
చివ్వెంల: కలెక్టరేట్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి జిల్లా ఆర్అండ్బీ ఏస్ఈ నర్సింహా నాయక్ అన్నా రు. కుడకుడ శివారులో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లా డుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశానుసారం కలెక్టరేట్ నిర్మాణాన్ని పరిశీలించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు, లేబర్ ను పెంచుకోని నాణ్యత లోపించకుండా నిర్మాణం చేపట్టాలన్నారు. కలెక్టరేట్‌ను ఆనుకొని ఉన్న ఈవీఏం స్ట్రాంగ్ రూం గోదాంను రెవిన్యూ అధికారులకు అప్పగించడం జరిగిందని అతి త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా కలెక్టరేట్ పక్క నే నిర్మాణం అవుతున్న అధికారుల క్వార్టర్స్ నిర్మాణంలోనూ వేగం పెంచాలన్నారు. ఆయనతో పాటు ఏఈ యాకూబ్ తదితరులు ఉన్నారు.