బుధవారం 20 జనవరి 2021
Suryapet - Nov 30, 2020 , 02:54:40

నర్సింహపురంలో కళా వేదిక ప్రారంభం

నర్సింహపురంలో కళా వేదిక ప్రారంభం

మునగాల: మండలంలోని నర్సింహపురం గ్రామంలో నిర్మించిన కళావేదికను ఆంధ్రప్రదేశ్‌ జలనవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా సీఎం కేసీఆర్‌ పీఆర్వో గటిక విజయ్‌ కుమార్‌, ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి, సినీనటి హేమ హాజరయ్యారు. అతిథులు మాట్లాడుతూ నిర్మాణ దాతలు పుల్లూరి వెంకటనారాయణ, అరుణ దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీపీలు బిందు, చింతా కవిత, సర్పంచ్‌ నాగమణి, ఎంపీటీసీ చింతల శ్రీనివాస్‌, రాధారెడ్డి పాల్గొన్నారు. logo