గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jul 30, 2020 , 01:49:02

భారీ వర్షంతో పొంగిన కాల్వలు

భారీ వర్షంతో పొంగిన కాల్వలు

తిప్పర్తి : మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కాల్వలు, కుంటలు  పొంగిపొర్లాయి. వర్షం నీటితో మండలంలోని కాశివారిగూడెం సమీపంలోని ఐబీ కాల్వ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో కాల్వ కొంతమేర కోతకు గురైంది. పంటచేలల్లో నీరు నిలిచింది. భారీ వర్షానికి అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

 ఇప్పర్తి చెక్‌డ్యామ్‌కు జలకళ

మునుగోడు : ఇటీవల కురిసిన వర్షాలతో మండలంలోని ఇప్పర్తి వాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం జలకళను సంతరించుకుంది. నాబార్డు నిధులు రూ.2.80కోట్లతో చేపట్టిన ఈ చెక్‌డ్యాం నిర్మాణం ఇప్పటికే 80శాతం వరకు పూర్తయింది. నిర్మాణ దశలోనే ఆశాజనకంగా వరద వచ్చి చేరడంతో ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యామ్‌తో భూగర్భజలాలు పెరిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.  

కనగల్‌లో మోస్తరు వర్షం

కనగల్‌ : మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్ర మోస్తరు వర్షం  కురిసింది. రేగట్టె, కురంపల్లి, పగిడిమర్రి, శాబ్దుల్లాపురం తదితర గ్రామాల్లో కురిసిన వర్షానికి లోతట్టు  ప్రాంతాలు జలమయమయ్యాయి. 

దర్వేశిపురం పుష్కరఘాట్‌ ఉప్పొంగి ప్రవహిస్తోంది. కొన్ని రోజులు ఎండ, మరికొన్ని రోజులు వర్షం కురుస్తుండటంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   


logo