గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - May 07, 2020 , 02:53:44

నేడు బేసి, రేపు సరి సంఖ్యల దుకాణాలే తెరవాలి

నేడు బేసి, రేపు సరి సంఖ్యల దుకాణాలే తెరవాలి

  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • మున్సిపల్‌ కమిషనర్‌ దేవ్‌సింగ్‌

నీలగిరి: నిబంధనలకు విరుద్ధ్దంగా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ మున్సిపల్‌ కమిషనర్‌ దేవ్‌సింగ్‌ హెచ్చరించారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుకాణాలకు నెంబర్లు ఇచ్చామని, 7న బేసిసంఖ్య, 8న సరిసంఖ్య వచ్చిన దుకాణాలు మాత్రమే తెరవాలని సూచించారు.  పట్టణంలోని దుకాణాలను ఏ, బీ, సీ కేటగిరిగా విభజించామన్నారు. ‘ఏ’ కేటగిరిలో నిత్యావసర వస్తువులు, మెడికల్‌ దుకాణాలు, వ్యవసాయ, భవన నిర్మాణ అనుబంధ దుకాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు.  ‘సీ’ కేటగిరిలో విద్యా సంస్థలు, రెస్టారెంట్లు, టీ సెంటర్‌, సినిమా హాళ్లు, ఫంక్షన్‌ హాల్స్‌, స్విమ్మింగ్‌పూల్స్‌, ప్రార్థన మందిరాలు, స్పోర్ట్స్‌ తదితర వాటికి అనుమతి లేదన్నారు. ఏ,సీ కేటగిరిలో లేని మిగతా అన్ని రకాల దుకాణాలను  ‘బీ’ కేటగిరిలో చేర్చారు. అనంతరం పట్టణంలోని ‘బీ’ కేటగిరిలో ఉన్న దుకాణాలకు మున్సిపల్‌, పోలీస్‌ అధికారులు నెంబరింగ్‌ వేశారు. ఆయన వెంట నల్లగొండ సీఐ ఎస్‌.ఎం. బాషా, టూటౌన్‌ ఎస్‌ఐ నర్సింగ్‌ ఉన్నారు.logo