హైదరాబాద్ : రంగు కేళీ హోలీ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే యువత, చిన్నారులు, పెద్దలు ఇంటి ఆవరణలతో పాటు ప్రధాన కూడళ్లలో రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబురాలు అంబరాన్నంటేలా వేడుకలు చేసుకున్నారు.