బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Feb 09, 2020 , 00:56:24

సదా రైతుల సేవలోనే..

సదా రైతుల సేవలోనే..

గంభీరావుపేట: 14 ఏళ్ల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్‌గా సదా రైతుల సేవలోనే గడుపుతున్నాననీ, ఇకముందూ అలాగే అన్నివిధాలా సహకారం అందిస్తానని టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు ఉద్ఘాటించారు. మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాల యం వద్ద సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. 6వ వార్డు నుంచి తనను ఏకాభిప్రాయంతో ఏకగీవ్రంగా ఎన్నిక చేసిన గోరంటాల, గజసింగవరం గ్రామాల సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటు గంభీరావుపేటలో 7, 8, 9 వార్డు, కొత్తపల్లిలో 13 వార్డు డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై హర్షం వ్యక్తం చేశా రు. సహకార సంఘాలు అందిస్తున్న పారదర్శక, మెరుగైన సేవలకు ఇది నిదర్శనమని రవీందర్‌రావు అభివర్ణించారు. పోటీ ఉన్న మిగతా అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 


సంఘం సభ్యుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరారు. సమష్టిగా సంఘాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుదామని, బంగారు తెలంగాణలో రైతులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బహముఖ సేవలను అందిస్తుందని రవీందర్‌రావు గుర్తుచేశారు. సంఘ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో సహకార సంఘాలు సేవలు అందిస్తున్నాయని, దానికి నిదర్శనం రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయా సంఘాల్లో డైరెక్టర్లను ఏకగీవ్రంగా ఎన్నుకుంటున్నారని రవీందర్‌రావు అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సెస్‌ డైరెక్టర్‌ కొక్కు దేవేందర్‌యాదవ్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు అహ్మద్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మోతె రాజిరెడ్డి, వైస్‌ ఎంపీపీ దోసల లత, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ధ్యానబోయిన రాజేందర్‌, సర్పంచ్‌లు కటకం శ్రీధర్‌, కొలుముల అంజమ్మ, సుతారి బాలరాజు, ఎంపీటీసీలు ఎర్రం అంజిరెడ్డి, మేర్గు నాగభూషణం, ఈడిగ పర్శరాములు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్‌, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్‌, కామిడి సదాశివరెడ్డి, కమ్మరి రాజారాం, సుతారి సంపూర్ణ, గంద్యాడపు రాజు, శేఖర్‌గౌడ్‌, రాజనర్సు, లింగం, ఎల్లాగౌడ్‌, సత్యంరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo