ఇన్స్టారీల్స్కు తెలుసు యుక్తి తరేజా ఖలేజా ఏంటో! ఇన్‌స్టాలో దాదాపు మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. సినిమాల్లోకి రంగప్రవేశం చేసి అతి తక్కువ సమయంలో టాలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ అన్నీ టచ్ చేసింది. ‘రంగబలి’తో తెలుగు సినిమాకు పరిచయమైన యుక్తి.. ‘మార్కో’ సినిమాతో గతేడాది అలరించింది. ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో కలిసి ‘కె ర్యాంప్’లో కిరాక్ రోల్ పోషించింది. ఈ సినిమాతో హీరోయిన్గా మంచి మార్కులు కొట్టేసిన యుక్తి పంచుకున్న కబుర్లు ఇవి.
మాది హరియాణ. మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటినుంచి నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. 2017లో నిర్వహించిన ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ అందాల పోటీల్లో విజేతగా నిలిచాను. డిగ్రీ చదివే రోజుల్లోనే ఎంటీవీ నిర్వహించిన సూపర్ కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. పరీక్షలకు డుమ్మా కొట్టి మరీ ఆ కాంపిటీషన్లో పాల్గొన్నా. గెలువకపోయినా నాలుగోస్థానంలో నిలిచాననే తృప్తి మాత్రం దక్కింది.
కె ర్యాంప్ సినిమాలో నా పాత్ర విచిత్రమైన పర్సనాలిటీలో ఉంటుంది. ఏదైనాఎక్స్ట్రీమ్ కోరుకుంటుదన్నమాట. మామూలుగా కాదు ఘాటుగా ప్రేమించాలనే మనస్తత్వం అన్నమాట! ఇందులోని లిప్ కిస్ సీన్లు క్యారెక్టర్ డిమాండ్‌ను బట్టే ఉంటాయి తప్ప.. కావాలని చొప్పిన్నట్టు అనిపించవు.
చాలా మంది సెలబ్రేటీల్లాగానే నాకు కూడా రీల్స్ అంటే సరదా. రీల్స్‌లలో డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేయడాన్ని హ్యాపీగా ఫిలవుతుంటా. పండుగలప్పుడైతే సంప్రదాయ దుస్తుల్లో ఫోటోలు దిగి షేర్ చేస్తుంటాను. ఇన్‌స్టాలో వచ్చే కామెంట్స్ రెగ్యులర్‌గా చూస్తుంటాను. కొన్ని ఉత్సాహపరుస్తాయి. మరికొన్ని సిల్లీగా అనిపిస్తాయి.
‘రంగబలి’ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. అందులో నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. తర్వాత మలయాళం చిత్రం మార్కోతో తొలి హిట్ అందుకున్నా. తాజాగా ‘కె-ర్యాంప్’తో టాలీవుడ్లో నా స్థానం పదిలం చేసుకున్నాను.
అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగించుకోవడం ఉత్తమం. అందుకే సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నా. ఇప్పటికే ‘హై జునూన్’ సిరీస్ చేశాను. మంచి రెస్పాన్స్ రావడం సంతోషాన్నిచ్చింది.
విహారయాత్రలన్నా, చిన్నపిల్లలన్నా ఇష్టపడతాను. ట్రిప్స్ నాలో కొత్త శక్తిని పుట్టిస్తాయి. గుర్రపు స్వారీ అంటే ఇష్టం. వీలున్నప్పుడల్లా హార్స్ రైడింగ్‌కు వెళ్తుంటాను. మానసిక సంతోషంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేందుకు మంచి డైట్ ఫాలో అవుతాను.
2021లో వచ్చిన మ్యూజిక్ వీడియో లూట్ గయేలో ఇమ్రాన్ హష్మీతో నటించాను. యూట్యూబ్‌లో బిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ వీడియోతో మొదటిసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాను. తర్వాత కూడా పలు మ్యూజిక్ వీడియోల్లో నటించాను. అన్నీ మంచి వ్యూస్ సొంతం
చేసుకున్నాయి.