గంటల తరబడి ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పనిచేస్తే.. మెడనొప్పి, వెన్నునొప్పి రావడం మామూలే. అలాంటి సమస్యకు పరిష్కారంగా.. అమెజాన్ బేసిక్స్ ల్యాప్‌టాప్ స్టాండ్‌ని వాడొచ్చు. దీన్ని ప్రీమియం అల్యూమినియం అలాయ్‌తో తయారు చేశారు. ఎక్స్-ఆకారంలో డిజైన్ చేసిన ఈ స్టాండ్.. 5 కిలోల బరువును కూడా సులభంగా మోస్తుంది. మీరు ఎంత వేగంగా టైప్ చేసినా ఇది అస్సలు కదలదు. దీని సిలికాన్ మ్యాట్.. ల్యాపీని సురక్షితంగా పట్టుకుని ఉంచుతుంది. ఆఫీసు, ఇల్లు ఎక్కడైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిటారుగా కూర్చొని హాయిగా పని చేసుకోవచ్చు. కూర్చునే ఎత్తుకు తగ్గట్టుగా స్టాండ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఐదు రకాల యాంగిల్స్ ఉన్నాయి. 15 నుంచి 45 డిగ్రీల వరకు మార్చుకోవచ్చు. దీంతో మెడ, వెన్ను, భుజాల నొప్పులు.. కళ్లపై ఒత్తిడి తగ్గుతాయి. దీనిని మడతపెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీన్ని వాడటం వల్ల ల్యాప్‌టాప్ మన్నిక కూడా పెరుగుతుంది. ల్యాపీ కిందివైపునా గాలి బాగా ఆడేలా ఈ స్టాండ్‌ని డిజైన్ చేశారు. దీంతో ల్యాప్‌టాప్ త్వరగా వేడెక్కకుండా ఉంటుంది. 9 అంగుళాల నుంచి 15.6 అంగుళాల వరకు ఉండే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లకు ఈ స్టాండ్ చక్కగా సరిపోతుంది.
ధర: రూ. 900 దొరుకు చోటు : అమెజాన్.కామ్
ఉన్నట్టుండి కరెంట్ పోతే.. వెంటనే ఏం చేస్తాం? ఎమర్జెన్సీ లైట్ కోసం వెతుకుతాం. అలాంటి ఒక పవర్ఫుల్ గ్యాడ్జెట్ ఇది. టార్చ్‌లైట్ మాత్రమే కాదు.. టేబుల్ ల్యాంప్గానూ దీన్ని వాడుకోవచ్చు. ఇంట్లోనూ.. బయట ప్రయాణాలకు చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో మొత్తం 14 ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఇవి గదిలో 360 డిగ్రీల కోణంలో వెలుగునిస్తాయి. దీంతో రాత్రి సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు. ఈ లైట్ బ్యాటరీ సామర్థ్యం చాలా ఎక్కువ. 1200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే.. టార్చ్ మోడ్‌లో ఎక్కువ వెలుతురులో 2.8 గంటలు.. తక్కువ వెలుతురులో అయితే 12.5 గంటల వరకూ పనిచేస్తుంది. ఇక టేబుల్ ల్యాంప్‌గా అయితే.. 4 గంటల పాటు వెలుగునిస్తుంది. ప్రత్యేక యూఎస్బీ కేబుల్‌తో చార్జ్ చేయొచ్చు. 6 గంటల్లో బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది. లైట్ ఎంతసేపు వాడినా వేడెక్కదు. దీంతో భయం లేకుండా సురక్షితంగా వాడుకోవచ్చు.
ధర: రూ. 900 దొరుకు చోటు: అమెజాన్.కామ్
మీ టైపింగ్‌ని స్మార్ట్‌గా మార్చేందుకు ‘లాగిటెక్’ ముందుకొచ్చింది. Keys to Go 2 పోర్టబుల్ బ్లూటూత్ కీబోర్డ్‌ను తీసుకొచ్చింది. ఇది కేవలం కీబోర్డ్ మాత్రమే కాదు.. మీ మొబైల్ లైఫ్‌స్టయిల్‌కు చక్కని కంపానియన్ కూడా. ఇది ల్యాపీ కీబోర్డుకు ఏమాత్రం తక్కువ కాదు. దీంతో టైప్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. సన్నగా, తేలికగా ఉండే ఈ కీబోర్డ్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఏ డివైజ్‌తోనైనా ఇట్టే కనెక్ట్ అవుతుంది. అన్ని ఓఎస్లనూ సపోర్ట్ చేస్తుంది. ఒకేసారి మల్టీ టాస్కింగ్ చేసే అలవాటు ఉంటే.. కీబోర్డ్‌ని కూడా ఒకేసారి రెండు, మూడు డివైజ్‌లకు కనెక్ట్ చేయొచ్చు. సో.. ఏ డివైజ్‌తో అయినా వాడుకోవచ్చు. ఈ కీబోర్డ్‌లో బ్యాటరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి బ్యాటరీ పెడితే.. ఏకంగా మూడు సంవత్సరాల వరకు పనిచేస్తుంది. హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా పనిని పూర్తి చేసుకోవచ్చు. మీ అవసరాలకు తగ్గట్టుగా కీలను మార్చుకోవడానికి Logi Options+ యాప్ కూడా ఉంది.
సాన్‌డిస్క్ ఎక్స్ట్రీమ్ పోర్టబుల్ ఎస్ఎస్డీ.. డేటాను మరింత సురక్షితంగా ఉంచుతుంది. దీని స్టోరేజ్ సామర్థ్యం 1టీబీ. రీడ్ స్పీడ్ 1050 ఎంబీపీఎస్, రైట్ స్పీడ్ 1000 ఎంబీపీఎస్. దీంతో పెద్దసైజు వీడియోలు, హై రిజల్యూషన్ ఫొటోలను క్షణాల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కొండల్లో.. వర్షాల్లో.. ఇలా ఎక్కడ, ఏలాంటి పరిస్థితుల్లో ఉన్నా డేటాని సేఫ్‌గా ఉంచుతుంది. మూడు మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా ఇందులోని డేటాకి ఏం కాదు. దీనిపై ఉన్న సిలికాన్ కవర్ అదనపు రక్షణను ఇస్తుంది. అంతేకాదు.. ఈ ఎస్ఎస్డీలో పాస్వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. మీ పర్సనల్ ఫైళ్లు, ఫొటోలను ఇతరులు చూడకుండా లాక్ చేయొచ్చు. 256-బిట్ AES హార్డ్‌వేర్ ఎన్క్రిప్షన్తో మీ సమాచారం సురక్షితంగా ఉంటుంది. తేలికగా, చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. మీ బ్యాగ్, బెల్టుకు తగిలించుకోవచ్చు కూడా. టైప్-సి పోర్ట్ ద్వారా స్మార్ట్ఫోన్లకు కూడా కనెక్ట్ చేసి డేటాని కాపీ
చేసుకోవచ్చు. ఐదేళ్ల వారెంటీ కూడా ఉంది.