జపాన్ సంస్కృతిలో షూకన్ అనే పదం బాగా వాడుకలో ఉంటుంది. రోజువారీ జీవితం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక నడవడికకు సంబంధించిన ఏదైనా అలవాటు అని దీనికి అర్థం. తీసుకున్న మరుక్షణమే తేలిపోయే తీర్మానాలు, తూతూమంత్రం కార్యాచరణలా కాకుండా షూకన్ అనేది వ్యక్తిశీలం,
సామర్థ్యం, సంక్షేమం దిశగా క్రమశిక్షణతో కూడిన, దీర్ఘకాలం నిలిచి ఉండే సానుకూలమైన అలవాట్లకు సంబంధించిన విధానం.