మనుషులను శుభ్రం చేసే వాషింగ్ మెషీన్ ఇటీవల వార్తల్లో నిలిచింది. దీనిని రూపొందించిన సంస్థ ఏది?
ప్రపంచంలోనే అరుదుగా కనిపించే ఓ పక్షి.. మహబూబాబాద్ జిల్లాలోని భీమునిపాదం జలపాతం దగ్గర ఓ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కెమెరాకు చిక్కింది. ఆ పక్షి పేరేంటి?
శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో విహరించే ‘షికారా’ చెక్క పడవలను తమ యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించిన సంస్థ ఏది?
హైదరాబాద్ చరిత్రలో అంతర్భాగమైన ఓ భవనం.. జాతీయ స్థాయి మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో
‘ట్రేడ్‌మార్క్’ పొందనున్నది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఈ ఘనత సాధించనున్న ఆ భవనం ఏది?
రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లినిక్‌ల పేరేంటి?
సూర్యుడి వెలుపలి వలయమైన ‘కరోనా’పై లోతైన పరిశోధనలు చేయడానికి ఐరోపా అంతరిక్ష సంస్థ ఇటీవల ఓ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఆ ప్రయోగాన్ని ఏమని పిలుస్తున్నారు?
సైబర్ నేరగాళ్లు తెరుస్తున్న ‘మ్యూల్ అకౌంట్స్’ను ఏరివేయడమే లక్ష్యంగా ఆర్బీఐ ఆవిష్కరించిన ఏఐ మోడల్ ఏది?
భోపాల్ నగరాన్ని మృత్యుదిబ్బగా మార్చిన ‘గ్యాస్ దుర్ఘటన’కు ఇటీవలే 40 ఏళ్లు పూర్తయాయి. ఏ కర్మాగారం నుంచి గ్యాస్ లీకై.. వేల మంది మరణాలకు కారణమైంది?
టీ20ల్లో 40 బంతుల్లోపు రెండు శతకాలు సాధించిన తొలి ఆటగాడిగా తాజాగా రికార్డు సృష్టించిన
యువ క్రికెటర్ ఎవరు?
భారత అమ్ముల పొదిలోకి ఓ సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆ అధునాతన సెల్ఫ్ డిస్ట్రాయ్ డ్రోన్ ఏది?