అన్నం వండిన తర్వాత, అందులో ఉన్న గంజిని వార్చడానికి చాలా కష్టపడతాం. పాత్ర వేడిగా ఉండటం వల్ల క్లాత్ పట్టుకోవాలి, అన్నం కింద పడిపోతుందేమో అని భయం. కొన్నిసార్లు అనుకున్నదే జరిగి కిచెన్ మొత్తం చిందరవందర అవుతుంది. ఈ సమస్యలకు సింగిల్ సొల్యూషన్.. ఈ అర్బన్ మాంక్ స్టెయిన్లెస్ స్టీల్ రైస్పాట్ డ్రైనర్ స్టాండ్. ఇది చాలా సింపుల్ డిజైన్.. కానీ, మీ కిచెన్‌లో చేసే పని మాత్రం బిగ్ డీల్. స్టాండ్ హ్యాండ్స్ ఫ్రీ డిజైన్‌తో అన్నం పాత్రను చక్కగా పట్టుకుంటుంది. దీంతో మీరు వేడి పాత్రను పట్టుకునే అవసరం ఉండదు. అన్నంలోని గంజి చాలా త్వరగా, మొత్తంగా వంపేయొచ్చు. ఇది కేవలం అన్నం వంచడానికి మాత్రమే కాదు. దీంతో మీరు పండ్లు, బీన్స్, నూడుల్స్‌లో ఉన్న అదనపు నీటిని కూడా సులభంగా వడగట్టవచ్చు. చిన్నవి, పెద్దవి.. వివిధ రకాల పాత్ర సైజులకు ఇది ఇట్టే సరిపోతుంది. దీనిని స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు. తుప్పు పట్టకుండా ఉంటుంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీ.
ధర: రూ. 400
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

కిచెన్‌లో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటివి తరుక్కోవడానికే ఎక్కువ సమయం పడుతుంది. అంతేనా.. కటింగ్ తర్వాత చాపింగ్ బోర్డ్‌ను, కత్తులను శుభ్రం చేయడం మరో పెద్ద పని. ఈ సమస్యలన్నిటికీ సింగిల్ సొల్యూషన్.. ఈ మాన్యువల్ గార్లిక్ క్రషర్. ఇది కరెంట్ అవసరం లేకుండా, తక్కువ బడ్జెట్లో మీ వంటింటి పనిని అల్ట్రా ఫాస్ట్‌గా చేసేస్తుంది. ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉంటాయి. దీంతో వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆలుగడ్డలు లాంటి వాటిని కత్తి కంటే వేగంగా కట్ చేయొచ్చు. దీనికి ఎర్గోనామిక్ హ్యాండిల్ ఉంది. దీంతో కట్ చేస్తున్నప్పుడు మీ చేతులు బ్లేడ్‌కు తగలకుండా సేఫ్‌గా ఉంటాయి. కంఫర్ట్‌గా పట్టుకోవచ్చు. ఎంత నొక్కితే అంత సన్నగా కట్ అవుతాయి. స్టెయిన్లెస్ స్టీల్, బీపీఏ-ఫ్రీ పీపీ మెటీరియల్‌తో దీనిని తయారు చేశారు. దీంతో తుప్పు పట్టకుండా మన్నికగా ఉంటుంది. వంట అయిపోయిన తర్వాత శుభ్రం చేయడం చాలా సులభం. చాపర్ సులువుగా విడిపోతుంది. దీంతో రన్నింగ్ వాటర్ కింద రెండు నిమిషాలు కడిగేస్తే చాలు.. మొత్తం క్లీన్ అయిపోతుంది. దీని బరువు కూడా చాలా తక్కువ.
ధర: రూ. 400
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
మీరు ఏదైనా పర్ఫెక్ట్ బేకింగ్ రెసిపీ ఫాలో అవుతున్నారా? లేదా డాక్టర్ చెప్పినట్లుగా, తీనే వాటిని కొలిచి తినాలనుకుంటున్నారా? అయితే, అంత కచ్చితంగా అన్నీ కొలవాల్సిందే! అందుకోసం కిచెన్‌లో ఈ చిన్న గ్యాడ్జెట్ ఉండాల్సిందే. అదే హెల్త్ సెన్స్ చెఫ్మేట్-కేఎస్ 63.. కిచెన్ వేయింగ్ స్కేల్. ఇది కేవలం త్రాసు మాత్రమే కాదు, మీ వంటగదికి అవసరమైన ఒక టెక్ అసిస్టెంట్ కూడా. దీంతో కిచెన్ స్మార్ట్‌గా మారిపోతుంది. ఈ వేయింగ్ మెషీన్లో హై ప్రెసిషన్ సెన్సర్లు ఉన్నాయి. దీంతో మీరు 1 గ్రాము నుంచి 5 కిలోల వరకూ కొలవొచ్చు. గ్రాములు, మిల్లీలీటర్లు.. ఇలా అన్ని యూనిట్లలోనూ తూకం వేయొచ్చు. ఒకే గిన్నెలో రకరకాల పదార్థాలను కొలిచి కలపాలనుకున్నా చేయొచ్చు. దీంతో ముందు తీసుకున్న పదార్థం బరువును జీరోకి రీసెట్ చేసి, కొత్త పదార్థం బరువును లెక్కించొచ్చు. దీనికి ఉన్న ఎల్సీడీ డిస్ప్లే పెద్ద అక్షరాలతో ఉంటుంది. దీంతో కొలతలను ఈజీగా చదివేయొచ్చు. పని పూర్తయ్యాక పవర్ సేవ్ చేయడానికి ఆటో-ఆఫ్ ఫీచర్ కూడా ఉంది.
ధర: రూ.1,200
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

పూజలకైనా, వంటకాల్లో వాడటానికైనా కొబ్బరికాయ మన కిచెన్‌లో కచ్చితంగా ఉంటుంది. కానీ, కొబ్బరి కాయను కొట్టడం, పీచు తీయడం, లోపల ఉన్న కొబ్బరిని ముక్కలుగా కట్ చేయడం చాలా పెద్ద పని. కాయ కొట్టేటప్పుడు చేతికి దెబ్బలు తగిలే రిస్క్ కూడా ఉంటుంది. ఈ కష్టాన్ని మొత్తం దూరం చేసే సింగిల్ టూల్.. ఈ ప్రగానియా కోకోనట్ స్లయిసర్. ప్రతి కిచెన్‌లో ఉండాల్సిన మల్టీ-ఫంక్షన్ గ్యాడ్జెట్ ఇది. ఈ చిన్న టూల్‌తో మీరు కొబ్బరికాయ పీచుతీయొచ్చు, కొట్టొచ్చు, లోపల ఉన్న కొబ్బరిని ముక్కలుగానూ కట్ చేయొచ్చు. దీంతో మీరు అదనంగా వేరే కత్తి, క్రషర్ వాడాల్సిన అవసరం ఉండదు. దీనికి గట్టి ఐరన్ హ్యాండిల్ ఉంటుంది. దీంతో మీరు కొబ్బరి చిప్పని గట్టిగా పట్టుకోవచ్చు. ఈ హ్యాండిల్ పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. దీన్ని హై-క్వాలిటీ మెటీరియల్‌తో సింపుల్ డిజైన్‌లో తయారు చేశారు. ఎక్కువ కాలం డ్యూరబుల్‌గా ఉంటుంది.
ధర: సుమారు రూ. 500
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్