ఒక్కేసి గంధపు చెక్కలో ..
భారతీయుల ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థమున్నది. శాస్త్రీయ దృక్పథమూ కనిపిస్తున్నది. వారి ఆటపాటల వెనుక అందమైన ఆరోగ్యసూత్రాలెన్నో దాగి వున్నాయి. బతుకునే దేవతగా భావించి, పూజించే పండుగే బతుకమ్మ పండుగ. తెలంగాణ స్త్రీలు అత్యంత ప్రియంగా, ప్రీతికరంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ.
భారతీయుల ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థమున్నది. శాస్త్రీయ దృక్పథమూ కనిపిస్తున్నది. వారి ఆటపాటల వెనుక అందమైన ఆరోగ్యసూత్రాలెన్నో దాగి వున్నాయి. బతుకునే దేవతగా భావించి, పూజించే పండుగే
బతుకమ్మ పండుగ. తెలంగాణ స్త్రీలు అత్యంత ప్రియంగా, ప్రీతికరంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ.
తల్లికి తన కడుపున పుట్టిన పిల్లలంతా ఎంత సమానమో ప్రకృతి మాతకు తననుండి ఉద్భవించిన ఆకు లు, పూలు అన్నీ సమానమే. బతుమ్మను గునుగుపూలు, గుమ్మడి పూలు, కట్లపూలు, కలువపూలు, తంగేడు పూల తో పూజిస్తారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను కుప్పగా పోసి బతుకమ్మను (పిల్ల బతుకమ్మలు) కంకసిబ్బి (ప్లేట్)లో పేరుస్తారు. గుమ్మడాకులు గుండ్రంగా పేర్చి, తంగేడు పువ్వు, గునుగు పువ్వు ఏడంతస్తులు పెడతారు. చివర తెల్ల గుమ్మడి పూవుంచుతారు, దాని పుప్పొడి పసుపు గౌరమ్మ వలె ఉంటది. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా… సదోదితా సదాతుష్టా తరుణాదిత్య పాటలా…’ అన్నట్లు కాయలుకాసే ఏ పూవు పూజకు ఉపయోగించకున్నా, గుమ్మడికాయలోని గింజ లు వెదజల్లబడి అనేక మొలకలు మొలచినట్లు వారి వారి వంశాభివృద్ధి చెందాలనే భావనతో గుమ్మడి పూవును పూజిస్తారు.
ఆ తర్వాత బతుకమ్మ చుట్టూ తిరుగుతుంటే, ఒక పెద్దావిడ ప్రక్కకు కూర్చొని పాటలు చెప్తుంటే వీళ్ళంతా చక్కగా ఆ పల్లవి, చరణాలు విని పాడుతారు. ఎన్నో అంశాలీ పాటల్లో ఇమిడి ఉంటాయి. ఉదా:
ఒక్కేసి గంధపు చెక్కలో రాచగుమ్మడి
ఏ రాజు పంపినాడే ఓ రాచగుమ్మడి
మారాజు కృష్ణమూర్తి ఓ రాజగుమ్మడి
ఎన్ని విత్తులే కాకేరా, ఏడే విత్తులు కాకేరా
ఎన్ని మొలకలు, ఎన్ని తీగెలు, ఎన్ని పూవులు,
అంటూ విత్తు యొక్క వివిధ వికాస దశలను పాట ద్వారా తెలుసుకుంటారు. ఏ ఆభరణం ఎక్కడ ఎలా పెట్టుకోవాలో ఈ పాట ఎలా తెలుపుతుందో చూడండి.
కాగపెట్టు పాలు శ్రీలక్ష్మి – నీ కాళ్ళ కడియాలు కదలంగ
తోడు పెట్టు శ్రీలక్ష్మి -నీ తొమ్మిది చిందులు కదలంగ
చల్లా చెయ్యి శ్రీలక్ష్మి – నీ సందుటి దండలు కదలంగ
వెన్నా తీయే శ్రీలక్ష్మి – నీ వేళ్ళ ఉంగరాలు కదలంగ
బతుకమ్మకు వాడే పూలలో ఆయుర్వేద గుణాలున్నాయి. వర్షాకాలంలో చెరువులు, కుంటలు, జలాశయాలు వర్షపునీటితో నిండి రకరకాల క్రిమికీటకాలు చేరుతాయి. మనుషులు, పశువులు త్రాగి రోగాల బారిన పడతారు. బతుకమ్మ పూవుల్లోని పుప్పొడి, పసుపు కుంకుమల్లో క్రిమి సంహారక గుణముంటుంది. కనుక వడబోసిన ఫిల్టర్ వాటర్ వలె మారుతాయి. మంచినీరుగా మారుతాయి. ఇన్ని మంచిగుణాలున్నది మన బతుకమ్మ.
పసుపులో పుట్టిన గౌరమ్మా.. పసుపులో పెరిగిన గౌరమ్మా…
మమ్ము కాపాడవమ్మా! వెళ్ళిరా మాయమ్మ వెళ్ళి రావమ్మా…
అని నిమజ్జనం చేస్తారు భక్తితో.
డాక్టర్ ఆర్ కమల
( అక్షరయాన్ సౌజన్యంతో)
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

