మనుషులకూ ఇతర జీవులకూ మధ్య ఉన్న తేడా తెలిసిపోయింది..

మనుషులకూ ఇతర జీవులకూ మధ్య భౌతికంగా చాలా తేడాలే కనిపిస్తాయి. ఆయుధాలను పట్టుకునేందుకు తోడ్పడేలా బొటనవేలు అమరిక నుంచి, వెన్ను నిటారుగా ఉండటం వరకూ… ఎన్నో మార్పులు మనిషిని మనిషిగా చేశాయని భావిస్తూ వచ్చాం. కానీ జన్యుపరమైన మార్పులను ఇంతవరకూ పూర్తిగా గుర్తించలేకపోయాం. స్వీడన్‌కు చెందిన పరిశోధకులు ఇలాంటి ప్రయత్నమే చేశారు. మన జన్యువులలో కొంతభాగాన్ని ఇంకా పూర్తిగా శోధించలేదు. దాన్ని ‘నాన్ కోడెడ్ డీఎన్ఏ’ అంటారు. మనిషి వైవిధ్యానికి మూలమైన బ్రహ్మ రహస్యం వీటిలోనే ఉందని అంచనా. జర్మనీ, అమెరికా, జపాన్‌లకు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఈ జన్యువులను విశ్లేషించే ప్రయత్నం చేశారు. వాటిని చింపాంజీల జన్యువులతో పోల్చి చూశారు. లక్షల సంవత్సరాల క్రితం చింపాంజీల నుంచి మనం విడిపడ్డామనే విషయం తెలిసిందే. కాబట్టి రెండు జీవుల మధ్య జన్యువుల్లో వచ్చిన తేడాలను గుర్తించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఫలితంగా… మన మెదడులో కొన్ని స్పష్టమైన మార్పులను గమనించారు. మన జన్యువులను పూర్తిగా విశ్లేషించడం వల్ల, భవిష్యత్తులో జన్యుపరమైన చికిత్సలు సులభం కానున్నాయి. స్కిజోఫ్రీనియా లాంటి వ్యాధులను నయం చేసే అవకాశం పుష్కలంగా ఉంటుంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

