ఓ నలుగురు స్టూడెంట్స్ కలిస్తే చాలు.. మార్కెట్లోకి వచ్చే కొత్త ఫోన్ల గురించి కచ్చితంగా టాపిక్ వస్తుంది. అదీ బడ్జెట్లో ఉంటే మరింత క్రేజీగా డిస్కస్ చేస్తారు. అలాంటి ఫోన్ ఒకటి మార్కెట్లోకి వస్తోంది. అదే ఐక్యూ జెడ్ (iQOO Z)10 సిరీస్. గేమింగ్, చదువు, ఆఫీస్ వర్క్‌కి బాగా ఉపయోగపడే మోడల్ ఇది. ఈ సిరీస్ ఫోన్లు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ ఫ్రొఫెషనల్స్ కోసమే దీన్ని ప్రత్యేకంగా రూపొందిచారు. దీంట్లో మెయిన్ ఫీచర్ బ్యాటరీ. 7300ఎంఏహెచ్ బ్యాటరీని ఫోన్‌తో అందిస్తున్నారు. ఇప్పటివరకూ మొబైల్స్‌లో వచ్చిన అతిపెద్ద బ్యాటరీ ఇదే! ప్రాసెసర్ విషయానికి వస్తే జెడ్ 10లో స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 3 ఎస్ఓసీ. గేమింగ్, మల్టిటాస్కింగ్కి బాగా సపోర్ట్ అవుతుంది. జెడ్10ఎక్స్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ ఉంటుంది. 5000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో సూర్యకాంతిలోనూ స్పష్టంగా చూడొచ్చు. ట్రిపుల్ సెటప్‌గా ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15తో, ఫన్‌టచ్ ఓఎస్‌లో పనిచేస్తుంది.
ధర: రూ. 20,000
దొరుకు చోటు: అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లు