విద్యా కాంతుల తెలంగాణ
ఉన్నత విద్యలోనూ అవకాశాలు పరిమితంగానే ఉండేవి. అన్ని యాజమాన్యాల పరిధిలో 2,493 జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిలో 3,42,754 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారు. 195 డిగ్రీ కాలేజీల్లో 1,41,250 మంది విద్యార్థులు చదివేది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండేవి.
ఉద్యమాల చైతన్యంతో, మట్టివాసనలతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం. 33 జిల్లాలుగా రూపుదిద్దుకున్న తర్వాత విద్యారంగంలోనూ నవశకం ఆరంభమైంది. ప్రాథమిక విద్య నుంచి వైద్య విద్య వరకు గుణాత్మకమైన మార్పులకు బాటలు పడ్డాయి. ఒక ప్రాంతం సమగ్ర అభివృద్ధికి వి-4… విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ రంగాలు కీలకమని చెప్పేవారు. ఈ వాస్తవాన్ని గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం, జిల్లాల పునర్వ్యవస్థీకరణతో విద్యారంగాన్ని విస్తరించే దిశగా అనేక చర్యలు చేపట్టింది.
2015-16 నాటికి తెలంగాణలో…
– ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 135 గురుకులాలు
– గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 38 గురుకులాలు
– బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 19 గురుకులాలు
– సాధారణ గురుకులాలు 47 మాత్రమే ఉన్నాయి.
ఉన్నత విద్యలోనూ అవకాశాలు పరిమితంగానే ఉండేవి. అన్ని యాజమాన్యాల పరిధిలో 2,493 జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిలో 3,42,754 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారు. 195 డిగ్రీ కాలేజీల్లో 1,41,250 మంది విద్యార్థులు చదివేది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో కేవలం 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, 15 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండేవి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,000 సీట్లు, ప్రైవేట్ కళాశాలల్లో 1,500 సీట్లు కలిపి మొత్తం 2,500 మంది మాత్రమే ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉండేది. నర్సింగ్ విద్య పరిస్థితి కూడా భిన్నంగా కనిపించదు. కేవలం 5 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 280 సీట్లు, 74 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో 3,880 సీట్లు అందుబాటులో ఉండేవి. ఇదీ ఒకప్పుడు తెలంగాణ విద్యారంగం ఎదురొన్న పరిమిత అవకాశాల చిత్రపటం.

Ts Welfare
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత విద్యారంగం అందమైన తోటలా విస్తరించింది. సాధారణ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు, నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా చేసుకుని రెసిడెన్షియల్ విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎస్సీ, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ, గిరిజన, మైనార్టీ వర్గాలకు చెందిన రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసే విధానం అమల్లోకి వచ్చింది. రెండు మూడు నియోజకవర్గాలతో ఏర్పడిన జిల్లాల్లోనే కనీసం 10 నుంచి 15 వరకు రెసిడెన్షియల్ విద్యాసంస్థలు అందుబాటులోకి వచ్చాయి.
గురుకులాల భారీ విస్తరణ…
ఏడేండ్ల వ్యవధిలోనే గురుకుల విద్యా వ్యవస్థలో గణనీయమైన విస్తరణ చోటుచేసుకుంది.
ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సూల్స్ 135 నుంచి 268కి
గిరిజన సంక్షేమ గురుకులాలు 38 నుంచి 160కి
బీసీ వెల్ఫేర్ గురుకులాలు 19 నుంచి 310కి
మైనార్టీ గురుకులాలు 12 నుంచి 264కి
మొత్తం రెసిడెన్షియల్ స్కూల్స్ 233 నుంచి 979కి చేరుకున్నాయి.
ఇది కేవలం సంఖ్యల పెరుగుదల మాత్రమే కాదు… గ్రామీణ, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడానికి జరిగిన విశేష విస్తరణ. ప్రాథమికోన్నత పాఠశాలలుగా ప్రారంభమైన అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు కొద్ది సంవత్సరాల్లోనే జూనియర్ కాలేజీ స్థాయికి ఎదిగాయి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాసంస్థలు కూడా జూనియర్ కాలేజీ స్థాయికి అప్ గ్రేడ్ అయ్యాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

