రంగులు ప్రకృతిలో అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. వేవేల వర్ణాల్లో విరబూసే పువ్వులు, సీతాకోకచిలుకలు, రంగురంగుల గోడలు.. అందరినీ ఆకర్షిస్తాయి. సూర్యోదయం-సూర్యాస్తమయంలో ఆకాశంలో కనిపించే వర్ణాలు.. చూపులను కట్టిపడేస్తాయి. విభిన్న వర్ణాలను ఒక్క ఫ్రేమ్‌లోకి తీసుకొస్తే.. అద్భుతమైన ఫొటోలు వస్తాయి. అలాంటి ఫొటోగ్రఫీకే.. ‘కలర్ కాంట్రాస్ట్ ఫొటోగ్రఫీ’ అనిపేరు.
అందమైన రంగులు.. వీక్షకుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. వారి మనసుపైనా ప్రభావం చూపుతాయి. కొన్ని రంగులు సంతోషాన్ని, ప్రశాంతతను, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మరికొన్ని వర్ణాలు వారిలోని బాధను బయటపెడతాయి. అందుకే, భిన్నమైన రంగులను ఒక్క దగ్గరికి చేరిస్తే.. ఫొటోలు కూడా విభిన్నంగా వస్తాయి. ఫొటోగ్రఫీలో కలర్ కాంట్రాస్ట్‌ను ఉపయోగించడానికి.. కలర్ థియరీలో నిష్ణాతులే కానవసరం లేదు. కొన్ని ముఖ్యమైన కాంట్రాస్ట్ ఫొటోగ్రఫీ రకాలను గుర్తించి.. పరిపూర్ణమైన రంగులతో ఫొటోలు తీస్తే చాలు. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ సాయంతోనే.. అద్భుతమైన ‘కలర్ కాంట్రాస్ట్’ ఫొటోలు తీయడం ఎలాగో తెలుసుకుందాం!
రెండుమూడు విభిన్నమైన రంగులను ఒక ఫ్రేమ్‌లో చేర్చడమే కలర్ కాంట్రాస్ట్. ఇవి ఒకదానితో ఒకటి స్పష్టంగా, భిన్నంగా కనిపించి.. వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఉదాహరణకు.. ఆకుపచ్చ ఆకుల మీద ఎర్రని పువ్వు; పసుపు రంగు గోడ ముందు బ్లాక్ కలర్ బైక్.
స్నాప్‌సీడ్, లైట్‌రూమ్ మొబైల్ లాంటి సాఫ్ట్వేర్లు ఉపయోగించండి.
సాచురేషన్ : రంగులు మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు సాచురేషన్ను అడ్జస్ట్ చేయండి.
కాంట్రాస్ట్ : రెండు విభిన్న రంగుల మధ్య వ్యత్యాసం చూపించడానికి కాంట్రాస్ట్‌ను పెంచండి.
సెలెక్టివ్ ఎడిటింగ్ : కేవలం సబ్జెక్ట్ లేదా బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చుకోవడానికి ఈ టూల్‌ను ఉపయోగించండి.
క్రాప్ : ఫొటోల్లో రూల్ ఆఫ్ థర్డ్స్, ఇతర కాంపొజిషన్ టెక్నిక్స్ కనిపించడానికి ఫొటోలను క్రాప్ చేసుకోండి.
ఫైనల్‌గా.. కలర్ కాంట్రాస్ట్ ఫొటోగ్రఫీ అనేది వీక్షకుల దృష్టిని సబ్జెక్ట్‌పై కేంద్రీకరించడానికి ఓ గొప్ప మార్గం. మీ మొబైల్ ఫోన్‌తోనే.. సాధారణ దృశ్యాలను కూడా రంగుల మాయాజాలంగా మార్చవచ్చు. ఈ టెక్నిక్‌ను రోజువారీ జీవితంలో ప్రయోగించి.. మీ ఫొటోగ్రఫీని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లండి. ఈరోజే మీరు నిత్యం చూసే రంగుల కాంబినేషన్లలో ఒక ఫొటో తీయండి.