స్వీట్‌కార్న్ గింజలు: పావుకిలో
శనగపిండి: రెండు టేబుల్ స్పూన్లు
బియ్యప్పిండి: టేబుల్ స్పూను
అల్లం: అంగుళం ముక్క
పచ్చిమిరపకాయలు: నాలుగు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
ఉల్లిపాయ: ఒకటి
ఉప్పు: తగినంత
తయారీ విధానం
మక్కజొన్న గింజలు మూడు వంతులు తీసుకొని మిక్సీలోనో రోట్లోనో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత మిగతా గింజల్ని కూడా ఈ పిండిలో కలిపి పక్కకు పెట్టుకోవాలి. అల్లం ముక్కను తురమాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొత్తిమీరలను సన్నగా తరగాలి. ఇప్పుడు ఇందాక రుబ్బి పెట్టుకున్న పిండిలోనే శనగపిండి, బియ్యప్పిండి, తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అల్లం తురుము కూడా జోడించి, పిండి మొత్తానికీ తగినంత ఉప్పు వేయాలి. ఇప్పుడు పదార్థాలన్నీ సమపాళ్లలో కలిసేలా పిండిని బాగా కలియబెట్టాలి. పొంగణాల పెనం తీసుకొని ఆ గుంటల్లో నాలుగు చుక్కల నూనె చల్లి, పిండిని వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. నూనె ఎక్కువగా వాడకుండా మక్కజొన్న స్నాక్స్ తినాలనుకుంటే ఇవి మంచి ఎంపిక.
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు