అనుమానమే జీవితంగా బతికేవాళ్లను ఉద్దేశించి చెప్పిన సామెత ఇది. కొందరికి ప్రతీది అనుమానమే. దేనిపైనా నమ్మకం ఉండదు. నిజ నిర్ధారణ చేసుకోరు. బలమైన నమ్మకం కలిగేంత వరకూ అనుమానం బుర్రను తొలిచేస్తూనే ఉంటుంది. ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తులనే ‘అనుమానపు పక్షి’ అంటారు. అనుమానమనే పెనుభూతంతో ఎంతోమంది సంసారాలను (జీవితాలను) నాశనం చేసుకుంటున్నారు. ఈ సామెత వివరణకు వస్తే.. ఊరిలో ఓ వ్యక్తి చనిపోయి అంతా ఏడుస్తుంటే.. ఓ అనుమాన రామయ్య వచ్చి, చనిపోయిన వ్యక్తి కళ్లలో వేలుపెట్టి చూశాడట బతికున్నాడా? లేదా? అని. అదొకరకమైన అర్థంలేని అనుమానం. అనుమానానికి సంబంధించి గొడవ/ చర్చ జరుగుతున్నప్పుడు ‘ముందు వాడు పుట్టిన తర్వాతే.. అనుమానం పుట్టింది’ అంటుంటారు. ప్రతి చిన్న విషయానికీ అనుమానిస్తే.. జీవితమే అనుమానాస్పదంగా మారుతుంది.