‘ఒక్కగానొక్క కొడుకును యుద్ధంలో పోగొట్టుకున్నందుకు బాధగా ఉందా?’
‘కాదు. ఒక్కగానొక్క కొడుకును కన్నందుకు బాధగా ఉంది. ఇంకొక్కడుంటే… ఈ క్షణమే సరిహద్దులకు పంపేదాన్ని’
ఆ రోజు ‘థ్యాంక్స్‌గివింగ్ డే’. కరోనా సమయంలో నాకు సేవలు చేసిన నర్సు గుర్తుకొచ్చింది. బొకేతో దవాఖానకు వెళ్లాను. ‘ఆ సిస్టర్ లేరు..’ ఏదో చెప్పబోయారు సిబ్బంది.
‘లొకేషన్ పెట్టండి ప్లీజ్! ఎలా అయినా కలవాలి’ బతిమాలాను. మొత్తానికి స్పందించారు.
ఆ మ్యాప్ ఫాలో అవుతూ వెళ్లాను.. ఎదురుగా శ్మశానం!
రైలు ప్రయాణం..
అటు అబ్బాయి.
ఇటు అబ్బాయి.
మధ్యలో అమ్మాయి.
బండి దిగే సమయానికి ఆమె..
ఒకడికి ఫోన్ నంబర్ ఇచ్చింది.
ఒకడికి వార్నింగ్ ఇచ్చింది.
ఒకడు మనసును
తాకే ప్రయత్నం చేశాడు.
ఒకడు ఒంటిని
తాకే ప్రయత్నం చేశాడు.
‘నీ తప్పేం లేకపోయినా..
గొడవ జరిగిన ప్రతిసారీ
మీ ఆయనకు సారీ
చెబుతావెందుకు?’
అడిగింది స్నేహితురాలు.
‘ఆత్మాభిమానాన్ని
చంపుకొని..
బంధాన్ని
బతికించుకొనే ప్రయత్నం’ జవాబిచ్చాను.
‘అతను’ ‘ఆమె’ను ప్రేమిస్తున్నాడు.
‘ఆమె’ అతడిని ప్రేమిస్తున్నది.
అయినా, ఈ ప్రేమ సుఖాంతం కాదు.
ఎందుకంటే,
ఈ కథలో మూడు పాత్రలున్నాయి..
అతను, ఆమె, ఆమె!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి