ఆంగ్లేయుల వలసపాలన నుంచి విముక్తి కోసం సాగిన స్వాతంత్య్రోద్యమం భారతదేశ చరిత్రలో చిరస్మరణీయఘట్టం. ఇక సమైక్య ఆంధ్ర పేరుతో దాదాపు 60 ఏండ్ల ఆంధ్రుల వలసపాలనకు నిరసనగా నడిచిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం స్వాతంత్య్ర పోరాటానికి ఏమాత్రం తీసిపోనిది. స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని కోరుతూ 1952లో ముల్కీ ఉద్యమం నడిచింది. ఆ తర్వాత ప్రజల ఆకాంక్షలను కాదని పెద్ద మనుషుల ఒప్పందంతో 1956లో తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. అక్కడినుంచి ఇక్కడి ప్రజల భాష, యాస, జీవిత విధానం, నీళ్లు, నియామకాలు, భూములు పరాయీకరణకు గురికావడం మొదలైంది.
ఈ క్రమంలో 1969లో ఉవ్వెత్తున ఎగసిన తొలిదశ తెలంగాణ ఉద్యమం ఆరు సూత్రాల పథకంతో చల్లారిపోయింది. మరో ముప్పై ఏండ్లకు మలిదశ ఉద్యమం మొదలైంది. ఓ దశాబ్దంన్నరకు 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఆధునిక భారతదేశంలో రాష్ర్టాల ఏర్పాటు ఘట్టాల్లో సుదీర్ఘమైనది, చిరస్మరణీయమైనది తెలంగాణ అవతరణ. కీలకమైన మలిదశ ఉద్యమంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యం అనితర సాధ్యం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో విద్యార్థులు, వృత్తిసంఘాలు, పౌర సమాజం కూడా తమవంతు పాత్ర పోషించారు. ఇంతటి మహోజ్జలమైన మలిదశ ఉద్యమ క్రమాన్ని ఇప్పటితరానికి, వచ్చే తరాలకు తెలియజేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ఎం.నాగశేష కుమార్ చేసిన ప్రయత్నమే ‘స్వాప్నికులు సాధకుడు’ పుస్తకం. ఇందులో మలిదశ తెలంగాణ ఉద్యమ కీలక ఘట్టాలకు రచయిత అక్షర రూపం ఇచ్చారు. ఇది చదివితే తెలంగాణ సాధన ఎంతటి ప్రయాసకు ఫలితమో తెలిసివస్తుంది. మామూలు పాఠకులకే కాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కూడా ఈ పుస్తకం రిఫరెన్సుగా పనికొస్తుంది.
స్వాప్నికులు-సాధకుడు
రచన: ఎం.నాగశేష కుమార్
పేజీలు: 191, ధర: రూ. 300
ప్రచురణ: తెలంగాణ హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్
ప్రతులకు: ఫోన్ 98494 86750
…? చింతలపల్లి హర్షవర్ధన్
బుక్ షెల్ఫ్
కళా సౌందర్యం
32
రచన: ఎల్.ఆర్.వెంకటరమణ
పేజీలు: 104, ధర: రూ. 100
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: ఫోన్: 98487 87284
ఎడారి చినుకు
రచన: ఝాన్సీ కొప్పిశెట్టి
పేజీలు: 52, ధర: రూ. 150
ప్రచురణ: నాగమణి పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 98660 59615
అమ్మ చెక్కిన శిల్పం
రచన: జాలాది రత్న సుధీర్
పేజీలు: 144, ధర: రూ. 200
ప్రతులకు: ఫోన్: 98494 18009
తెలకోవెల (కథలు)
రచన: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
పేజీలు: 168, ధర: రూ. 150
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు: ఫోన్: 98487 87284
కలహారం
రచన: కవిరాజు
పేజీలు: 104, ధర: రూ. 200
ప్రతులకు: ఫోన్: 70935 11789
మనసే ఓ మరీచిక
రచన: కిరణ్ కుమార్ సత్యవోలు
పేజీలు: 104, ధర: రూ. 150
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణ
ప్రతులకు: ఫోన్: 97032 22329
కడుపుబ్బడం ఖాయం
వాస్తవానికి కల్పన జోడించటం, కల్పనలో వాస్తవాన్ని కలబోయడం కథకుల పని. వీటితోపాటు వ్యంగ్యం, హాస్యం తాలింపు వేయడం కృష్ణస్వామి రాజుకే సాధ్యం. పుత్తూరు మాండలిక సౌరభం కూడా వారి కథలలో పరిమళిస్తుంది. ఆయన తాజాగా వెలువరించిన సంకలనం ‘పుత్తూరు పిలగోడు కథలు’! ఈ పుస్తకంలోనూ రచయిత పైన చెప్పిన ఫార్ములానే పాటించారు. దాదాపుగా కథలన్నీ నిజ జీవితం నుంచి పుట్టినవే. స్థానిక ప్రజలలోని హాస్యచతురత, వ్యంగ్య వైభవాలను ఎత్తిచూపుతాయి. ఎవరైనా టెంకాయ కొడితే పక్కనుండే దేవుడికి దండం పెట్టే మామ- ఫ్రీగా ట్రాక్టర్లో ఇంటిదగ్గర దించుతాము అంటే ఎందుకని వద్దంటున్నాడో కిష్టడికి అర్థం కాదు.. ఆ తర్వాత అది మనకు కూడా అర్థమయ్యాక పడిపడి నవ్వుతాం ‘చల్ మోహనరంగా’ అంటూ. ‘పెరుమాళన్న పుష్పాంజలి!’ కథలో చలివేంద్రం తతంగం చక్కిలిగింతలు పెడుతుంది. తనకి తిరుపతి వెళ్ళినప్పుడల్లా సన్మానం జరుగుతున్నదని భార్యను నమ్మించడానికి ఎర్రమ రాజు ఏం చేశాడో తెలియాలంటే ’దుశ్శాలువా కప్పంగ’ చదవాల్సిందే!
అందంగా చీర కట్టుకోవడంలో ఆ ఊరి మొత్తానికి పద్మ నెంబర్ వన్! ఆమె కట్టు చూసి ఆడంగులు కుళ్లుకుంటారు. ఆ కట్టు ఆమెకు నేర్పిన తల్లి గురించి చెప్పుకొంటారు. అయితే అసలు రహస్యం ఏమిటో ఆమె భర్త రామమోహనుడికే తెలుసు? మనం తెలుసుకోవాలంటే ‘నల్లంచు తెల్లచీర’ చదవాల్సిందే! ఆరు బయట పడుకున్న ఆ ఇల్లాలి ఖరీదైన నగను దొంగ తెంచుకొని పారిపోయాడు. లబోదిబోమంటూ ఏడ్చింది. ఆ వార్త పేపర్లో వచ్చేసరికి, అది అందరూ చదివేసరికి ఆవిడ మరింత బాధపడింది.. ‘దాచాలంటే దాగదులే ’ చదివితేనే దీని వైనం తెలుస్తుంది.. ఇలాంటి 32 కథలతో అలరిస్తున్న ‘పుత్తూరు పిలగోడు ..సరదా కథలు’ పాఠకుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి.
పుత్తూరు పిలగోడు సరదా కథలు
రచన: ఆర్ సి కృష్ణ స్వామి రాజు
పేజీలు: 107, వెల రూ.160/-
ప్రతులకు: 93936 62821
…? చంద్ర ప్రతాప్ కంతేటి