బయటికి వెళ్లేటప్పుడు పవర్ బ్యాంక్ వెంట తీసుకెళ్తాం. కానీ, చాలాసార్లు ఫోన్ కనెక్ట్ చేయడానికి కేబుల్ మర్చిపోతుంటాం. తీరా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయాక.. కేబుల్ లేదని తెలిస్తే వచ్చే చిరాకు అంతా ఇంతా కాదు. ఈ సమస్యకు Spigen ArcPack 10000mAh Power Bank శాశ్వత పరిష్కారం చూపిస్తున్నది. తనతోపాటే కేబుల్‌ను మోసుకొచ్చేలా రూపుదిద్దుకున్నది. ఇది మీ జేబులో పట్టేంత చిన్నగా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఇన్‌బిల్ట్ యూఎస్బీ-సీ కేబుల్ ఉంటుంది. మీరు విడిగా ఎలాంటి వైర్లు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పవర్ బ్యాంక్ 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో మొత్తం మూడు అవుట్‌పుట్‌లు ఉన్నాయి. అంటే మీరు ఒకేసారి మూడు డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు. ఓవర్ హీట్, డ్రాప్ టెస్టులతో సహా ఇతర 22 రకాల సేఫ్టీ పరీక్షల్లో పాస్ అయింది. ఏబీఎస్, పీసీ మెటీరియల్‌తో తయారైన దీని బాడీ చాలా బలంగా ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి, రోజంతా బయట ఉండేవారికి ఇది ఓ పర్ఫెక్ట్ గ్యాడ్జెట్.
ధర: 2,659
దొరుకు చోటు: అమెజాన్ (ఆఫర్లను బట్టి మారుతుంది)

ఇంట్లో ప్లగ్ పాయింట్లు తక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా వైర్లు ఉండే ఎక్స్టెన్షన్ బోర్డులను వాడుతుంటాం. కానీ, అవి నేల మీద పరుచుకోవడం వల్ల కాళ్లుకు తగులుతుంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా ఎక్స్టెన్షన్ సెట్అప్ చేసుకుంటే? అలాంటిదే ఈ అదనపు సాకెట్లను ఇచ్చే Digiway Three Pin Multi Plug Point. ఇది కార్డ్‌లెస్ డిజైన్‌తో వస్తుంది. అంటే దీనికి విడిగా వైర్లు ఉండవు. నేరుగా మీ ఇంట్లోని త్రీ-పిన్ సాకెట్‌కు దీన్ని తగిలిస్తే చాలు.. ఇది మీకు మూడు యూనివర్సల్ సాకెట్లను అందిస్తుంది. ఇందులో ప్రతి సాకెట్‌కు విడివిడిగా స్విచ్‌లు, ఎల్ఈడీ ఇండికేటర్లు ఉంటాయి. దీంతో మీకు కావాల్సిన పరికరాన్ని మాత్రమే ఆన్ చేసుకోవచ్చు. ఇది హై-క్వాలిటీ ఏబీఎస్ ప్లాస్టిక్, హెవీ డ్యూటీ కాపర్ వైరింగ్తో తయారైంది. టీవీ, సెట్‌టాప్ బాక్స్, మొబైల్ ఛార్జింగ్, ల్యాప్‌టాప్, సీసీటీవీ కెమెరాలు లాంటి తక్కువ పవర్ వాడే పరికరాలకు చాలా సురక్షితం. ఇందులో సర్జ్ ప్రొటెక్షన్ కూడా ఉంది. అందువల్ల మీ ఎలక్ట్రానిక్ వస్తువులను వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి కాపాడుతుంది. 1000 వాట్ల లోపు ఉండే పరికరాలకు మాత్రమే ఇది అనుకూలం.
ధర: 349
దొరుకు చోటు: అమెజాన్

ఆఫీసుకి వెళ్లేటప్పుడు ల్యాప్‌టాప్ బ్యాగ్, ట్రిప్‌కి వెళ్లేటప్పుడు ట్రావెల్ బ్యాగ్, ఫొటోగ్రఫీ కోసం కెమెరా బ్యాగ్.. ఇలా వేర్వేరుగా వాడటం వల్ల ఖర్చుతోపాటు స్టోరేజ్ సమస్య కూడా ఉంటుంది. ఈ మూడింటినీ ఒక్కటే బ్యాక్ ప్యాక్‌లో ఇమిడ్చేలా CarryPro H25 MINI 30L Backpack వచ్చేసింది. ఇది చూడటానికి చాలా స్టయిలిష్‌గా ఉంటూనే, అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో 30 లీటర్ల సామర్థ్యం గల రోల్-టాప్ డిజైన్ ఉంది. అంటే మీకు అవసరమైనప్పుడు బ్యాగ్ పైన ఉన్న భాగాన్ని విప్పి అదనపు వస్తువులను సర్దుకోవచ్చు. ఇందులో 16 అంగుళాల ల్యాప్‌టాప్ పట్టేంత ప్యాడెడ్ స్లీవ్ ఉంది. ఫొటోగ్రాఫర్ల కోసం రిమూవబుల్ హార్డ్షెల్ కెమెరా బాక్స్ కూడా ఇచ్చారు. ఆఫీసు ప్రయాణాలకైనా, వీకెండ్ ట్రిప్పులకైనా, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీకైనా ఇదో మంచితోడు. ఎర్గోనామిక్ డిజైన్ వల్ల భుజాల మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా చాలా సౌకర్యంగా ఉంటుంది.
ధర: 4,999
దొరుకు చోటు: అమెజాన్ (ఆఫర్లను బట్టి మారుతుంది)

బయట హోటళ్లలో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ప్లాస్టిక్ స్పూన్లు వాడటం పర్యావరణానికే కాదు, ఆరోగ్యానికీ మంచిది కాదు. అలాగే ఎక్కడపడితే అక్కడ ఇచ్చే స్పూన్లను వాడాలంటే చాలామందికి మొహమాటంగా ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ తొలగాలంటే.. మీ వెంట ఈ స్టయిలిష్ Rusabl Stainless Steel Cutlery Set ఉండాల్సిందే! ఇది కేవలం స్పూన్సెట్ మాత్రమే కాదు, ఒక పూర్తి ప్యాకేజీ. ఇందులో ఒక స్పూన్, ఫోర్క్, స్టీల్ స్ట్రా, స్ట్రా క్లీనింగ్ బ్రష్, ఒక నాప్కిన్ ఉంటాయి. ఇవన్నీ 100% ఫుడ్‌గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారయ్యాయి. కాబట్టి తుప్పు పట్టవు. మీ ఆఫీస్ బ్యాగులో, ట్రావెల్ బ్యాగులో ఇట్టే పట్టేస్తుంది. కెమికల్-ఫ్రీ మెటీరియల్‌తో తయారైన ఈ సెట్ పిల్లలకు సురక్షితం. ఆఫీసుకి వెళ్లేవారు, క్యాంపింగ్ చేసేవారు.. అలాగే, పర్యావరణ ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన గిఫ్ట్ ఆప్షన్.
ధర: 399
దొరుకు చోటు: అమెజాన్