శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ కృష్ణ విదియ బుధవారం తేది 14-05-2025 రాత్రి 10-32 గంటలకు దేవ గురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 15 గురువారం నాడు సార్ధ త్రికోటి తీర్థ సహిత సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. మే 26 వరకు ఇవి కొనసాగుతాయి.
ఈ 12 రోజుల పుష్కర సమయంలో తల్లిదండ్రులు గతించిన వారు, పితృ దేవతల ప్రీత్యర్థం స్నాన, దాన, తర్పణ, పిండ ప్రదానాలు ఆచరించాలని శాస్త్రం చెబుతున్నది. తల్లిదండ్రులు జీవించి ఉన్నవారు నదిలో స్నానం ఆచరించి యథాశక్తి దానం చేస్తే పుణ్యప్రదమని శాస్త్ర వచనం.