సాధారణంగా గిన్నెలు కడిగేటప్పుడు సబ్బు నీళ్ల వల్ల చేతులు పొడిబారిపోవడం, గోళ్లు విరిగిపోవడం, స్క్రబ్బర్ గట్టిగా తగిలి గాట్లు పడటం కామన్! ముఖ్యంగా జిడ్డుగా ఉన్న గిన్నెలను లేదా మాడిపోయిన గిన్నెలను తోమడం చాలా కష్టం. ఈ ఇబ్బందులన్నీ తొలగించి.. మీ చేతులకు రక్షణనిస్తూనే గిన్నెలను తళతళలాడేలా చేసేస్తుంది.. Reusable Wire Dishwashing Gloves . ఇది కేవలం గ్లౌజ్ మాత్రమే కాదు. దీనిపైనే ‘వైర్ డిష్ క్లాత్’ (స్క్రబ్బర్) అమర్చి ఉంటుంది. ఈ గ్లౌజ్ వేసుకుని జస్ట్ అలా రుద్దితే చాలు.. మొండి జిడ్డు, మాడిపోయిన మరకలు ఇట్టే వదిలిపోతాయి. దీని లోపలి పొర వాటర్‌ప్రూఫ్ పీవీసీతో తయారైంది, కాబట్టి మీ చేతులకు నీళ్లు లేదా సబ్బు అస్సలు తగలవు. పైన ఉండే వైర్ మెష్ గిన్నెలపై గీతలు పడకుండా శుభ్రం చేస్తుంది. వేడి నీళ్లతో గిన్నెలు కడిగేటప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు.
ధర: రూ. 299 (2 గ్లౌజుల ప్యాక్)
దొరుకు చోటు: అమెజాన్
కోయడం.. ట్రేలోకి వేయడం

వంటగదిలో కూరగాయలు కోసేటప్పుడు ఎదురయ్యే అతిపెద్ద సమస్య.. కోసిన ముక్కలను గిన్నెల్లోకి మార్చడం. చాకుతో ఒక్కో ముక్కను తీస్తుంటే కింద పడిపోతుంటాయి. బోర్డు నిండిపోయి కొత్తవి కోయడానికి స్థలం ఉండదు. ఈ గందరగోళానికి Bamboo Cutting Board with Stainless Steel Tray చెక్ పెట్టేస్తుంది. వంట పనిని ప్రొఫెషనల్ షెఫ్లా మార్చేస్తుంది. మీ కిచెన్ ప్లాట్‌ఫామ్‌ను నీట్‌గా ఉంచుతుంది. కేవలం కటింగ్ బోర్డు మాత్రమే కాదు.. దీని కింద ఓ స్టెయిన్లెస్ స్టీల్ ట్రే ఉంటుంది. మీరు బోర్డు మీద ముక్కలు కోశాక, వాటిని కింద ఉన్న ట్రేలోకి ఇట్టే నెట్టేయొచ్చు. దీనివల్ల బోర్డు ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. దీంతో మరిన్ని కూరగాయలను వేగంగా కోసుకోవచ్చు. కోయడం పూర్తయ్యాక ఆ ట్రేని బయటికి తీసి నేరుగా గిన్నెలో, బాణలిలో వేసేయొచ్చు. ఈ బోర్డు పర్యావరణంతోపాటు మీ ఆరోగ్యానికీ మేలు చేసే వెదురు కర్రతో తయారైంది. కింద ఉన్న ‘నాన్-స్లిప్ ఫీట్’ వల్ల మీరు ముక్కలు కోస్తున్నప్పుడు బోర్డు అస్సలు జారిపోదు. ఇరువైపులా ఉన్న హ్యాండిల్స్‌తో దీన్ని పట్టుకోవడం చాలా సులభం.
ధర: రూ. 1,199 నుంచి మొదలు (సైజును బట్టి)
దొరుకు చోటు: అమెజాన్
కార్లో సూపర్ ఫాస్ట్ చార్జింగ్!

కార్లో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తున్నప్పుడు మొబైల్లో మ్యాప్స్ చూడటం, పాటలు వినడం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంటుంది. సాధారణ కార్ చార్జర్లు చాలా నెమ్మదిగా చార్జ్ చేస్తాయి. ఒక్కోసారి ఫోన్ వాడుకోవడానికి సరిపడా పవర్ కూడా ఇవ్వలేవు. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ప్రయాణాల్లోనూ మీ గ్యాడ్జెట్లకు సూపర్ ఫాస్ట్ పవర్‌ను అందించేందుకు Portronics Car Power 80 కార్ చార్జర్ వచ్చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ఏకంగా 80 వాట్ల భారీ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఇందులో రెండు రకాల పోర్టులు (టైప్-సి, యూఎస్బీ-ఎ) ఉన్నాయి. అంటే మీరు ఒకేసారి రెండు డివైజ్‌లను వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. మీ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ మాత్రమే కాకుండా ట్యాబ్లెట్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇయర్‌బడ్స్.. ఇలా దేన్నయినా చార్జర్‌కి కనెక్ట్ చేయొచ్చు. ఇది చాలా చిన్నగా, స్టయిలిష్‌గా ఉండి కార్ సాకెట్లో పక్కాగా ఫిట్ అవుతుంది. భద్రత విషయంలోనూ పోర్ట్రానిక్స్ రాజీ పడలేదు. వోల్టేజ్ హెచ్చుతగ్గులు, ఓవర్ హీటింగ్ వల్ల మీ ఖరీదైన ఫోన్లు పాడవకుండా ఇందులో మల్టిపుల్ ప్రొటెక్షన్ లేయర్స్ ఉన్నాయి. ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడు, ఫ్యామిలీతో రోడ్ ట్రిప్స్ వేసినప్పుడైనా.. ఫోన్ బ్యాటరీ టెన్షన్ లేకుండా ఉండాలంటే ఈ స్మార్ట్ కార్ చార్జర్ మీ కార్లో ఉండాల్సిందే.
ధర: రూ. 599
దొరుకు చోటు: అమెజాన్
వెల్లుల్లి వాసనే అంటదు

భారతీయ వంటకాల్లో వెల్లుల్లి ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, వెల్లుల్లి రెబ్బలను వలవడం, వాటిని దంచడం లేదా సన్నగా కట్ చేయడం చాలా విసుగుతో కూడిన పని. పైగా వెల్లుల్లిని దంచినప్పుడు ఆ ఘాటైన వాసన చేతులకు అంటుకుని ఎంత కడిగినా వదలదు. ఈ ఇబ్బందులన్నీ తప్పాలంటే.. ZEVON మాన్యువల్ స్టెయిన్లెస్ స్టీల్ గార్లిక్ క్రషర్‌ని వాడాల్సిందే. గట్టి స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైన ఈ క్రషర్.. వెల్లుల్లిని చాలా సులభంగా క్రష్ చేసేస్తుంది. వెల్లుల్లి రెబ్బలను ఇందులో పెట్టి జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు.. అది సన్నగా ముక్కలై కిందికి వస్తుంది. దీంతో వెల్లుల్లిలోని రసం, రుచి వృథా కాకుండా వంటకు మంచి ఫ్లేవర్‌ను ఇస్తాయి. చేతులతో వెల్లుల్లిని ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ఆ వాసన చేతులకు అంటదు. వాడిన తర్వాత దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ. వెల్లుల్లిని తరచుగా వాడే గృహిణులకు, బ్యాచిలర్స్‌కు ఇది ఓ చక్కని వంటగది నేస్తం. సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, వంట పనిని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేస్తుంది.
ధర: రూ. 199
దొరుకు చోటు: అమెజాన్