చింపాంజీల్లోనూ అంతర్యుద్ధం!
రాజు మరణిస్తే, రాజ్యాధికారాన్ని చేపట్టేందుకు కొడుకుల మధ్య అంతర్యుద్ధం జరుగడాన్ని చరిత్రలోనూ, సినిమాల్లోనూ చూశాం. అయితే, మనుషులకే పరిమితమైందనుకొన్న ఈ రాజ్య కాంక్ష చింపాంజీల్లోనూ ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
హైదరాబాద్, ఏప్రిల్ 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రాజు మరణిస్తే, రాజ్యాధికారాన్ని చేపట్టేందుకు కొడుకుల మధ్య అంతర్యుద్ధం జరుగడాన్ని చరిత్రలోనూ, సినిమాల్లోనూ చూశాం. అయితే, మనుషులకే పరిమితమైందనుకొన్న ఈ రాజ్య కాంక్ష చింపాంజీల్లోనూ ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్కులో 2015లో ఓ వృద్ధ చింపాంజీ మరణించింది.
అప్పటివరకూ కలిసిమెలసి బతికిన మిగతా చింపాంజీలు వృద్ధ చింపాంజీ మరణం తర్వాత రెండు వర్గాలుగా విడిపోయి ప్రతీరోజూ పరస్పర దాడులకు తెగబడుతున్నాయి. ఏడేండ్లుగా కొనసాగుతున్న ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకూ 7 చింపాంజీలతో పాటు మరో 17 పిల్ల చింపాంజీలు మరణించినట్టు అధ్యయనకారులు పేర్కొన్నారు. రెండు వర్గాల్లో ఒక వర్గం బలంగా మారడంతో అందులోని ఓ చింపాంజీ ఆ సమూహానికి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ వివరాలు ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

