పెరుగుతున్న కాలుష్యంతో బయటే కాదు.. ఇంట్లోనూ స్వచ్ఛమైన గాలి కరువై పోతున్నది. ముఖ్యంగా నగరాల్లో ఉండేవారికి దుమ్ము, ధూళి, పొగ వల్ల శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెడుతూ, తక్కువ ధరలో మీ ఇంటిని, ఆఫీసును ఆరోగ్యకరమైన వాతావరణంగా మార్చేందుకు pTron EaseMate Air Purifier H1 వచ్చేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో 4-స్టేజ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఉంది. ఇది గాలిలోని 99.97% కాలుష్య కారకాలను, అలర్జీ కలిగించే రేణువులను, పెంపుడు జంతువుల వెంట్రుకల్ని.. అలాగే, చెడు వాసనలను తొలగిస్తుంది. ఇందులోని True HEPA H13 ఫిల్టర్ అత్యంత సూక్ష్మమైన కణాలను కూడా బంధిస్తుంది. ఈ ప్యూరిఫైయర్ సుమారు 250 చదరపు అడుగుల వరకు (బెడ్రూమ్, ఆఫీస్ క్యాబిన్) గాలిని శుభ్రం చేయగలదు. తక్కువ బడ్జెట్లో మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కావాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక.
ధర: రూ.2,999
దొరుకు చోటు: అమెజాన్

ఇప్పుడన్నీ క్విక్‌గా అయిపోవాలి. నేటితరం ఉరుకుల పరుగుల జీవితం అలాంటిది. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేసే సమయం ఉండదు. పోనీ బయట జ్యూస్ తాగుదామంటే శుభ్రత ఉండదు. ఇలాంటి సమయాల్లో Goodscity Portable Blender (GC141) మీకు తోడుగా ఉంటుంది. వైర్లెస్ డిజైన్‌తో ఎప్పుడైనా.. ఎక్కడైనా చిటికెలో జ్యూస్‌ను చేసి పెడుతుంది. ఎక్కడికైనా తీసుకొని వెళ్లగలిగే ఓ స్మార్ట్ గ్యాడ్జెట్ ఇది. ఇందులో 3000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. పదిసార్లకు పైగా జ్యూస్‌లను తయారు చేసుకోవచ్చు. ఇందులో ఉన్న 6 స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్లు, 16,500 ఆర్పీఎం స్పీడ్ మోటార్.. పండ్లు, ఐస్ ముక్కల్ని స్మాష్ చేసేస్తుంది. అంతేకాదు.. నట్స్‌ను కూడా చాలా సాఫ్ట్‌గా బ్లెండ్ చేస్తాయి. దీని జార్ 400 ఎంఎల్ సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా, బీపీఏ-ఫ్రీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్‌తో తయారైంది. భద్రత విషయంలోనూ ఎంతో మేలైనది. జార్ సరిగ్గా ఫిట్ అయితేనే బ్లేడ్లు తిరుగుతాయి. ప్రొటీన్ షేక్స్ తాగే జిమ్ ప్రేమికులకు, ఆఫీసుకి వెళ్లేవారికి ఇది ఓ పర్ఫెక్ట్ హెల్త్ పార్ట్నర్.
ధర: రూ.2,398
దొరుకు చోటు: అమెజాన్

పండుగలు, ఫంక్షన్లకు తప్పకుండా స్వీట్లు చేస్తుంటాం. ఇలాంటప్పుడు బాదం, జీడిపప్పులను సన్నగా తరగడం ఎంత కష్టమో మనకు తెలుసు. చాకుతో కోస్తే ముక్కలు ఎగిరి పడతాయి. వేళ్లు తెగే ప్రమాదం కూడా ఉంటుంది. Clazkit Precision Cashews & Almond Cutter.. ఈ ఇబ్బందులన్నీ తొలగించి, మీ వంట పనిని చాలావేగంగా పూర్తి చేసేస్తుంది. దీని డిజైన్ చాలా సురక్షితం. బ్లేడ్లు లోపల ఉండటం వల్ల చేతులు వాటికి తగిలే అవకాశం అస్సలు ఉండదు. ఇందులో ఉండే హెవీ-డ్యూటీ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్లు తుప్పు పట్టవు. పదేపదే వాడకపోయినా చాలాకాలం పదునుగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌ను ఇందులో వేసి తిప్పితే చాలు.. చాలా సన్నటి, ఒకే ఆకారంలో ఉండే ముక్కలు వస్తాయి. దీనికి కింద భాగంలో స్టోరేజ్ కంటైనర్ ఉంటుంది. మీరు కోసిన ముక్కలన్నీ నేరుగా అందులోనే పడతాయి. కాబట్టి కిచెన్ ప్లాట్‌ఫారమ్ అస్సలు పాడవదు.
ధర: రూ.299
దొరుకు చోటు: అమెజాన్

సాధారణంగా ఎక్కువ రోజులు ప్రయాణాలు చేసేటప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు ఉతికిన దుస్తులు ఆరేసుకోవడం పెద్ద సమస్య. గదుల్లో తాడు కట్టడానికి మొలలు ఉండవు. ఒకవేళ ఉన్నా క్లిప్పులు లేక దుస్తులు కింద పడిపోతుంటాయి. ఈ ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే.. ఇంట్లో ఈ Nibbler తాడు ఉండాల్సిందే! ఇది ఎలాస్టిక్ మెటీరియల్‌తో తయారైంది. మామూలుగా ఇది 6 అడుగుల పొడవు ఉంటుంది, కానీ అవసరమైతే 12.5 అడుగుల వరకు సాగుతుంది. దీనికి రెండు చివరల బలమైన మెటల్ హుక్స్ ఉంటాయి. వీటిని బాత్రూమ్ పైపులకు, కిటికీలకు లేదా చెట్లకు కూడా ఇట్టే తగిలించుకోవచ్చు. అదనంగా 12 క్లిప్పులు కూడా ఉంటాయి. వీటికి మధ్యలో చిన్న పూసలు ఉంటాయి. దీంతో గాలికి దుస్తులన్నీ ఒకే వైపు జారిపోవు. ఈ తాడుకు ఉన్న క్లిప్పులు, హుక్స్‌కు రబ్బర్ కోటింగ్ ఉంటుంది, కాబట్టి తడికి తుప్పు పట్టవు. ప్రయాణాలు చేసేవారికి, విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బాల్కనీలో తక్కువ స్థలం ఉన్నవారికి ఇది ఓ అద్భుతమైన గ్యాడ్జెట్. ఒకే ప్యాకెట్లో రెండు తాళ్లు రావడం మరో విశేషం.
ధర: రూ.599 (2 తాళ్ల ప్యాక్) (ఆఫర్లను బట్టి మారుతుంది)
దొరుకు చోటు: అమెజాన్