నన్ను నేను తెలుసుకున్నా
‘గ్యాంగ్‌లీడర్'తో తెలుగు తెరకు పరిచయమైన చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్. ఆ చిత్రంలో పరిమిత భావాలతోనే అందరి హృదయాలనూ కొల్లగొట్టింది. తర్వాత ‘శ్రీకారం’ సినిమాలో బబ్లీ గాళ్‌గా తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించింది.
‘గ్యాంగ్‌లీడర్’తో తెలుగు తెరకు పరిచయమైన చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్. ఆ చిత్రంలో పరిమిత భావాలతోనే అందరి హృదయాలనూ కొల్లగొట్టింది. తర్వాత ‘శ్రీకారం’ సినిమాలో బబ్లీ గాళ్‌గా తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. ‘ఓజీ’లో పవన్‌తో జట్టుకట్టి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.
తెలుగుతోపాటు తమిళంలో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుంది. తాజాగా ‘మేడ్ ఇన్ కొరియా’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా.. ఓటీటీలో ఈ సినిమా రికార్డ్ స్ట్రీమింగ్ సొంతం చేసుకుంటున్నది. ఈ సినిమాతో తనను తాను తెలుసుకున్నానంటున్న ప్రియాంక చెప్పిన కబుర్లు ఇవి..చి
న్నప్పటి నుంచి నాకు నటనంటే చాలా ఇష్టం. సినిమాలు చూస్తున్నప్పుడు.. నన్ను నేను తెరపై ఎప్పుడు చూసుకుంటానా అనిపించేది. నాతోపాటు ఆ ఇష్టం కూడా పెరిగింది. బయో టెక్నాలజీలో డిగ్రీ చేశానన్న మాటే కానీ, నా మనసంతా సినిమాలపైనే ఉండేది. అందుకే, డిగ్రీ పూర్తవ్వగానే.. అలా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను.క
న్నడ చిత్రసీమ నుంచి వెండితెరకు పరిచయమయ్యా. 2019లో విడుదలైన ‘ఒంధ్ కథే హెళ్లా’ నా మొదటి సినిమా. ఆ చిత్రం విడుదలైన రోజు నా కల నిజమైంది. మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీలయ్యా. చిత్ర యూనిట్ మద్దతుతో ఒత్తిడిని అధిగమించా. ఆ సినిమా షూటింగ్ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను.నే
ను కలిసి పనిచేసిన హీరోలు, నటీనటులు, దర్శకులు, నిర్మాతల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. వాళ్ల అనుభవం, అంకితభావం, సినిమాపై వాళ్లకున్న ప్యాషన్ నన్నెంతో ప్రభావితం చేశాయి. నాని, శర్వానంద్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ‘ఓజీ’లో పవన్‌కళ్యాణ్ సరసన చేయడం మరచిపోలేని అనుభూతి.
‘గ్యాంగ్‌లీడర్’ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. అయితే, పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తాను. సవాలు విసిరే రోల్స్ నాకు ఇష్టం. వైవిధ్యభరితమైన పాత్రలను పోషించినప్పుడే.. నటిగా గుర్తింపు సాధ్యమవుతుంది. ‘మేడ్ ఇన్ కొరియా’తో అలాంటి అవకాశం లభించింది. ఈ సినిమాతో నన్ను నేను తెలుసుకున్నాను అనిపించింది.
షూటింగ్స్ లేనప్పుడు కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తా! స్నేహితులతో కాలక్షేపం చేయడం ఇష్టం. పుస్తకాలు బాగా చదువుతాను. బుక్ రీడింగ్ వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. అలాగే ట్రావెలింగ్ అన్నా ఇష్టమే! కొత్తకొత్త ప్రదేశాలు చూస్తున్నప్పుడు మనసుకు ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఒత్తిడికి గురైనప్పుడు వంట చేసి రిలాక్స్ అవుతుంటాను.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

