తెలంగాణ ప్రబంధ పరిమళం
సీ॥ కుశదర్భపేఠికాకోటి గారుడమణీ రమణీయ సింహాసనములు గాగ, భరిత పాటల జటాపటలంబు లభిరూప పద్మరాగ కిరీట పటలి గాగ ప్రాలంబి నిర్మల స్ఫటిక హారంబులు విమల ముక్తాహార సమితి గాగ పవమాన వశతరుచ్యసమాన సుమధూళి బెడగైన పసుపు పావడలు గాగ
జీవుడు-దేవుడు
సీ॥ కుశదర్భపేఠికాకోటి గారుడమణీ
రమణీయ సింహాసనములు గాగ,
భరిత పాటల జటాపటలంబు లభిరూప
పద్మరాగ కిరీట పటలి గాగ
ప్రాలంబి నిర్మల స్ఫటిక హారంబులు
విమల ముక్తాహార సమితి గాగ
పవమాన వశతరుచ్యసమాన సుమధూళి
బెడగైన పసుపు పావడలు గాగ
తే॥ వరతపఃప్రాజ్యసామ్రాజ్య వైభవమున
నుల్లసిల్లు తపోధన తల్లజముల
గార్హపత్యంబు నేడు మీ కన్నుగవకు
రాగమొసగెనె యో రామ రఘు లలామ
ఈ పద్యం 17వ శతాబ్దికి చెందిన బిజ్జుల తిమ్మభూపాలుడు రచించిన అనర్ఘ రాఘవం అను పద్యకావ్యం ద్వితీయాశ్వాసం లోనిది. మురారి సంస్కృత నాటకానికి అదే పేరుతో పద్యరూప తెలుగు అనువాదం ఇది. అలంపురం సీమను పరిపాలించిన రాజవంశానికి చెందిన ఈ కవి వంశచరిత్ర ఈ కావ్యంలో విస్తృతంగా తెలుస్తుంది. సరళంగా ఉన్న అందమైన పద్యం. రామలక్ష్మణులను యాగ సంరక్షణ కోసం తీసుకువెళ్లిన కౌశికుడు… తపో సామ్రాజ్యానికి మహర్షులు రాజుల లాంటి వారుగా చెప్పకనే చెబుతున్నారు కవి.
తపోధన శ్రేష్ఠుల (తల్లజముల) ఆహార్య వైభవం గురించి కౌశికుడు రామునితో చెబుతున్నాడు.
కుశదర్భలతో చేసిన పీఠమే రమణీయమైన గరుడమణులతో కూడిన సింహాసనం మాకు. తెలుపు, ఎరుపు వర్ణమిళితమైన కేశ సంపదే మాకు పద్మరాగ కిరీటం. మెడలో పూదండలా (ప్రాలంబికా) ఉన్న నిర్మలమైన స్ఫటిక హారాలే (నీటి బిందువులు) ముత్యాల హారాలు. వీస్తున్న గాలికి వశమై ఆ వేగంతో రాలుతున్న పుప్పొడి పసుపు పావడలు. వరబలంతో తపస్సాధనా సామ్రాజ్యమేలు తాపస శ్రేష్ఠులు. తమ గార్హపత్య వైభవంతో మీకు ఆత్మీయానురాగాలు పంచడానికి సిద్ధంగా ఉన్నారు. గార్హం అంటే గృహం. అదే శరీరం. గార్హపతి జీవుడు. కౌశికునిది జీవుని వేదన. రాముడు దేవుడు. దేవునితో రాగమొలికే బంధం కోసం జీవుని ప్రయత్నం ఈ యజ్ఞం. అంత వాత్సల్య భరితంగా ఈ మాటలు చెబుతున్నారు కౌశికుడు. కృష్ణుడిపై రాధకు ఉన్న ప్రేమ లాంటిదే ఇది. అందుకే గార్హపత్యంబు అనే గృహ సంబంధిత పదబంధం వాడాడేమో కవి అనిపిస్తుంది.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

