Gold Price | తగ్గిన బంగారం ధరలు.. రూ.5 వేలు తగ్గిన వెండి
Gold Price | ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు పతనమయ్యాయి. ఇరాన్ (Iran) పై అమెరికా (USA) సైన్యం తాజాగా దాడులు జరపడంతో సురక్షిత పెట్టుబడులుగా భావించే ఈ లోహాలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
Gold Price : ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు పతనమయ్యాయి. ఇరాన్ (Iran) పై అమెరికా (USA) సైన్యం తాజాగా దాడులు జరపడంతో సురక్షిత పెట్టుబడులుగా భావించే ఈ లోహాలపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం ఫ్యూచర్స్ సుమారు రూ.1,000 వరకు పడిపోయాయి. ఇక వెండి ఫ్యూచర్స్‌లో కూడా దాదాపు 2 శాతం మేర క్షీణత కనిపించింది.
మంగళవారం ఉదయం 10:25 గంటల సమయంలో ఎంసీఎక్స్‌లో జూన్ 5 గోల్డ్ ఫ్యూచర్స్ 0.61% నష్టంతో రూ.971 తగ్గి రూ.1,58,110 వద్ద ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో రూ.1,58,000 కనిష్ఠ స్థాయిని తాకింది. మరోవైపు జూలై 3 సిల్వర్ ఫ్యూచర్స్ కూడా అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఇంట్రాడేలో సుమారు 2% నష్టంతో రూ.5,000 కంటే ఎక్కువగా పతనమై రూ.2,71,972 కనిష్ఠాన్ని నమోదు చేసింది.
కాగా, దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి ప్రదేశాలు, పడవలపై అమెరికా సైన్యం దాడులు జరపడమే ఈ పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. చర్చల కోసం ఇరాన్ తమ ప్రతినిధులను దోహాకు పంపిన సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. అయితే అమెరికా దీనిని ‘ఆత్మరక్షణ’ చర్యగా పేర్కొన్నది. ఇదిలావుంటే ఈ భౌగోళిక ఉద్రిక్తతల కారణంగానే బులియన్ మార్కెట్లో ధరలు ప్రభావితమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

