T-Works | తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేసిన విజన్ పేరు T-Works అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆలోచనల్లో పుట్టి, యువత చేతుల్లో సాంకేతిక శక్తిగా మారిన గొప్ప వేదిక ఇది అని కొనియాడారు. స్టార్టప్‌లకు కేవలం మాటల ప్రోత్సాహం కాదు.. ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అత్యాధునిక టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. ఈనాడు దేశం మొత్తం డ్రోన్లు, డిఫెన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు.. తెలంగాణలో ఆ బీజం ఎన్నో ఏళ్ల క్రితమే నాటింది కేసీఆర్ నాయకత్వం అని పేర్కొన్నారు.
T-Works అనేది ఒక భవనం కాదు.. తెలంగాణ యువత కలలకు రెక్కలు తొడిగి ప్రయోగశాల అని కేటీఆర్ తెలిపారు. మేక్ ఇన్ తెలంగాణ అనే ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని అన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్‌ను తీసుకొచ్చి, హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెట్టిన దూరదృష్టి కేసీఆర్‌దే అని చెప్పారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న ఈ సంస్థ.. తెలంగాణ అభివృద్ధి ఎంత ముందుచూపుతో సాగిందో మరోసారి నిరూపిస్తోంది అని అన్నారు.
తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేసిన విజన్ పేరు T-Works
కేసీఆర్ గారి ఆలోచనల్లో పుట్టి, యువత చేతుల్లో సాంకేతిక శక్తిగా మారిన గొప్ప వేదిక ఇది
స్టార్టప్‌లకు కేవలం మాటల ప్రోత్సాహం కాదు…ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అత్యాధునిక టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు పూర్తి స్వేచ్ఛ… pic.twitter.com/GWXJS7kE4u
— KTR (@KTRBRS) May 26, 2026