ఫొటోలను చాలా స్పష్టంగా తీయాలి. ఫోకస్ మొత్తం సబ్జెక్ట్‌పైనే ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. ఫొటోలు బ్లర్ అయిపోతాయి. అస్పష్టంగా కనిపిస్తాయి. మరి, కావాలనే ఫొటోలను బ్లర్ చేస్తే..? కొన్ని సందర్భాల్లో ఈ అస్పష్టమైన ఫొటోలే అద్భుతం అనిపిస్తాయి. దానికే.. ‘మోషన్ బ్లర్ ఫొటోగ్రఫీ’ అనిపేరు. స్మార్ట్‌ఫోన్ సాయంతో.. మోషన్ బ్లర్ ఫొటోగ్రఫీని ఎలా తీయాలో తెలుసుకుందాం.
మోషన్ బ్లర్ అనేది.. ఒక లాంగ్ ఎక్స్పోజర్ ఫొటోగ్రఫీ టెక్నిక్. ఇందులో కదిలే వస్తువే ప్రధాన సబ్జెక్ట్‌గా ఉంటుంది. దానిని ఉద్దేశపూర్వకంగా బ్లర్ చేయడం ద్వారా.. ఫొటోలో కొత్తదనం కనిపిస్తుంది. షటర్ స్పీడ్ తగ్గించడం ద్వారా.. ఇలాంటి ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఇలా తీసిన ఛాయాచిత్రాలు.. మరింత ఆకర్షణీయమైన కథలను చెప్పడంలో సహాయపడతాయి.
అవసరమైనవి
ఉపయోగపడే యాప్స్
మోషన్ బ్లర్ టెక్నిక్స్
ఇందులో షటర్ స్పీడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి, ట్రైపాడ్ కీలకం. లేకుంటే.. చేతులు వణికి ఫొటోలు అస్పష్టంగా వస్తాయి. ఇక ఫోకస్ మొత్తం సబ్జెక్ట్‌పైనే ఉంచి షటర్ వేయాలి. ఎక్కువ చీకటి లేదా ఎక్కువ వెలుతురులో ఈ రకమైన ఫొటోగ్రఫీని ప్రయత్నించొద్దు. ఇక మోషన్ బ్లర్ ఫొటోగ్రఫీలో ‘ఆటోమోడ్’ పనికిరాదు.
చివరగా.. మోషన్ బ్లర్ ఫొటోగ్రఫీ అనేది వేగాన్ని, భావాన్ని, జీవాన్ని చూపించగల ఒక కళ. మీ మొబైల్ఫోన్తోనే ఈ టెక్నిక్‌లో మాస్టర్ కావొచ్చు. కాస్త సృజనాత్మకత, ఇంకాస్త ఓపిక.. ఉంటే, ప్రొఫెషనల్ లెవెల్ ఫొటోలు తీయొచ్చు. రాత్రిపూట రోడ్లపై దూసుకెళ్తున్న వాహనాలు, ఆడిటోరియంలో ప్రదర్శనలిస్తున్న డ్యాన్సర్‌ను.. తక్కువ షటర్ స్పీడ్‌లో క్యాప్చర్ చేయడం మొదలుపెట్టండి.
-ఆడెపు హరికృష్ణ