ముఖ్యమైన ఫంక్షన్‌కు వెళ్లేటప్పుడు, ఆఫీసు హడావుడిలో ఉన్నప్పుడు.. దుస్తులపై ముడతలు కనిపిస్తే చిరాకు వస్తుంది. అప్పటికప్పుడు ఇస్త్రీపెట్టె తీసి, టేబుల్ సర్దుకుని ఇస్త్రీ చేయడం పెద్ద ప్రాసెస్. ముఖ్యంగా పట్టు చీరలు, సున్నితమైన డ్రెస్సుల మీద ఇస్త్రీపెట్టె పెడితే.. ఎక్కడ కాలిపోతాయోనన్న భయం ఉంటుంది. ఇలాంటి టెన్షన్లు ఏమీ లేకుండా, బట్టలను హ్యాంగర్‌కు తగిలించి ఉండగానే ముడతలు పోగొట్టేలా Philips హ్యాండ్‌హెల్డ్ గార్మెంట్ స్టీమర్ వచ్చేసింది. ఇది చాలా చిన్నగా, తేలికగా మడత పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. స్విచ్ ఆన్ చేసిన 30 సెకన్లలోనే వేడెక్కి.. వాడుకోవడానికి సిద్ధమైపోతుంది. ఇందులోని ‘ఆప్టిమల్టెంప్’ టెక్నాలజీ వల్ల ఏ రకమైన దుస్తులపైన అయినా దీన్ని ధైర్యంగా వాడొచ్చు.. అస్సలు కాలవు. 1000 వాట్ల పవర్‌తో వచ్చే ఈ స్టీమర్.. నిమిషానికి 20 గ్రాముల స్టీమ్‌ను విడుదల చేస్తూ, ముడతలను ఇట్టే మాయం చేస్తుంది. దీని నుంచి వచ్చే వేడి ఆవిరి దుస్తుల మీద ఉండే 99.9 శాతం బ్యాక్టీరియాను కూడా చంపేస్తుంది. దీంతో వాటికి ముడతలు లేకపోవడమే కాకుండా చాలా తాజాగా మారుతాయి. బ్యాచిలర్స్‌కు, ఆఫీసుకు వెళ్లేవారికి.. మంచి ఎంపిక.
ధర: రూ. 3,299
దొరుకు చోటు: అమెజాన్
(ఆఫర్లను బట్టి మారుతుంది)

ఇంట్లో వాడే టీవీ, ల్యాప్‌టాప్, ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు.. ఇతర గ్యాడ్జెట్ల సంఖ్య పెరిగిపోతున్నది. కానీ, వాటన్నిటికీ సరిపడా ప్లగ్ పాయింట్లు ఉండవు. ఒకవేళ ఉన్నా, వేర్వేరు దేశాల ప్లగ్ పిన్లు (చైనా, యూఎస్, యూకే వంటివి) మన ఇండియన్ సాకెట్లకు సెట్ కావు. ఈ గందరగోళాన్ని దూరం చేస్తూ, మీ ఇంటిని ఓ స్మార్ట్ పవర్ హబ్‌లా మార్చడంలో Robustt 4-అవుట్లెట్ ఎక్స్టెన్షన్ బోర్డ్ అద్భుతంగా పనిచేస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో 4 యూనివర్సల్ పవర్ సాకెట్లు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని ఏ దేశపు ప్లగ్ పిన్ అయినా ఇందులో ఇట్టే ఫిట్ అయిపోతుంది. దీనికితోడు 3 యూఎస్బీ-ఎ పోర్టులు, మరో ఫాస్ట్ చార్జింగ్ టైప్-సి పోర్ట్ కూడా ఉన్నాయి. దీంతో అడాప్టర్లు వెతుక్కోవాల్సిన పనిలేకుండా.. నేరుగా కేబుల్ పెట్టి ఫోన్లను చార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ‘చైల్డ్ సేఫ్టీ షట్టర్స్’ ఇచ్చారు. లోపల హై-కండక్టివిటీ మెటల్ వాడటం వల్ల బోర్డు త్వరగా వేడెక్కదు, కరెంటు వృథా కాదు.
ధర: రూ. 749 (2 బోర్డుల ప్యాక్)
దొరుకు చోటు: అమెజాన్

చలికాలంలో వాడే స్వెటర్లు, ఉన్ని దుస్తులు, బెడ్షీట్లపై కొన్నాళ్ల తర్వాత చిన్నచిన్న దారపు ఉండలు రావడం గమనించే ఉంటారు. దీనివల్ల కొత్త దుస్తులు కూడా పాతవాటిలా, మురికిగా కనిపిస్తుంటాయి. చేతితో తీయాలంటే కుదరదు. బ్రష్‌తో రుద్దితే ఇంకా ఎక్కువ అవుతాయి. దీంతో దుస్తులు పాడయ్యే ప్రమాదం ఉంది. ఈ చిక్కులన్నీ వదిలించి, మీ పాత బట్టలకు మళ్లీ కొత్త మెరుపు రావాలంటే.. Electric Lint Remover వాడాల్సిందే! ఇందులో 9000 ఆర్పీఎం స్పీడ్‌తో తిరిగే శక్తిమంతమైన మోటార్, ఆరు పదునైన బ్లేడ్లు ఉంటాయి. ఇవి ఉన్ని దుస్తులపై ఉండే పోగులను ఇట్టే పోగొట్టేస్తాయి. దీనిపై ఉండే హనీకోంబ్ నెట్ వల్ల మీ బట్టలు కట్ అవ్వవు, కేవలం పైన ఉన్న దారపు ఉండలను మాత్రమే తుడిచేస్తుంది. స్వెటర్లు, దుప్పట్లు, సోఫా కవర్లు, కార్ సీట్లు.. ఇలా దేనికైనా దీన్ని ధైర్యంగా వాడొచ్చు. ఇందులో ఓ పెద్ద ట్రాన్స్పరెంట్ బాక్స్ ఉంటుంది. రిమూవ్ చేసిన మెటీరియల్ అందులోనే పడుతుంది. పని పూర్తయ్యాక దాన్ని తీసి క్లీన్ చేయడం చాలా సులభం. ముఖ్యంగా ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే, వాటి వెంట్రుకలు సోఫాలకు, దుస్తులకు అంటుకుపోతుంటాయి. వాటిని క్లీన్ చేయడానికీ ఇది భలేగా పనిచేస్తుంది.
ధర: రూ. 289
దొరుకు చోటు: అమెజాన్ (ఆఫర్లను బట్టి మారుతుంది)

మన దగ్గర ఐఫోన్ ఉంటుంది. ఇంట్లో వారికేమో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. ఇక ఆఫీసు పని కోసం ల్యాప్‌టాప్, ట్యాబ్.. ఇలా ఒక్కోదానికి ఒక్కో చార్జర్ వెతుక్కోవడం పెద్ద తలనొప్పి. ప్రయాణాల్లో అయితే ఈ వైర్లన్నీ సర్దుకోవడం మరీ కష్టం. ఈ చిక్కులన్నిటినీ తీర్చేస్తూ, మీ చార్జింగ్ అవసరాలన్నిటినీ.. Elfora 4-ఇన్-1 ఫాస్ట్ చార్జింగ్ కేబుల్ తీర్చేస్తుంది. ఈ ఒక్క వైరుతోనే నాలుగు రకాల కనెక్షన్లు అందిస్తుంది. అంటే మీ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్, మ్యాక్‌బుక్ లేదా ట్యాబ్.. ఏదైనా సరే ఈ ఒక్క కేబుల్‌తోనే చార్జ్ అయిపోతుంది. ఇది 65 వాట్ల వరకూ పవర్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో మీ డివైజ్‌లు చాలా వేగంగా చార్జ్ అవుతాయి. దీని చివర్లు మ్యాగ్నెట్స్‌తో కలిసి ఉంటాయి. కాబట్టి వైర్లు విడిపోకుండా నీట్‌గా ఉంటాయి. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో రెండిటినీ సపోర్ట్ చేస్తుంది. కేబుల్ త్వరగా తెగిపోకుండా ప్రత్యేక మెటీరియల్‌తో తయారు చేశారు. బ్యాగులో పది వైర్లు వేసుకునే బదులు, ఈ ఒక్క స్మార్ట్ కేబుల్ ఉంటే చాలు.. మీ లైఫ్ చాలా సింపుల్‌గా మారిపోతుంది.
ధర: రూ. 249
దొరుకు చోటు: అమెజాన్