హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా స్పోర్ట్స్ హ్యాకథాన్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీఐటీఏ) నిర్వహిస్తున్న హ్యాకథాన్ రెండు రోజుల పాటు జరుగనుంది. ఈ సందర్భంగా టీఐటీఏ అధ్యక్షుడు సందీప్‌కుమార్ మాట్లాడుతూ ‘బాస్కెట్‌బాల్, ఫెన్సింగ్, కబడ్డీ, బ్యాడ్మింటన్, పవర్‌లిఫ్టింగ్, అథ్లెటిక్స్‌తో పాటు 24 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నాం.
క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఫిట్నెస్, శారీరక, సాంకేతిక సమస్యలను విశ్లేషిస్తూ వాటికి టెక్నాలజీ పరిష్కారం చూపిస్తుందో తెలియజేస్తాం. స్పోర్ట్స్ ఇన్నోవేషన్ హబ్‌గా దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్నదే తమ లక్ష్యం’ అని అన్నారు.