ప్రేమా! ఎక్కడ నీ చిరునామా?
రచన: ఉషారాణి.కె
పేజీలు: 196, వెల: రూ.200
ప్రతులకు: acchamgatelugu@gmail.com
85588 99478
భానూదయం కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. అసుర సంధ్య తర్వాత కమ్ముకునే చీకట్లు భయాలను రేకెత్తిస్తాయి. చీకటి తెరలను చీల్చుకుంటేనే కొత్త ఉషస్సును చూడగలం. కానీ, ఆ కాటుక నలుపును పులుముకుంటానంటే.. జీవితం గాడి తప్పుతుంది. అలా కండ్లు ఉండి చీకట్లోకి వెళ్లి చతికిల పడిన యువతి కథే.. ‘ప్రేమా! ఎక్కడ నీ చిరునామా?’. కండ్లు లేకపోతేనేం.. తను చీకట్లో ఉంటూ తనవారికి వెలుగులు పంచే మరో యువతి. ఈ ఇద్దరి మధ్యా నలిగినా, హుందాగా మెలుగుతూ, వారి మేలుకోరే యువకుడు భాను. ఈ మూడు ప్రధానపాత్రల చుట్టూ మరెన్నో పాత్రలను సృష్టించి ఆసక్తికరమైన మలుపులతో కథనం సాగించారు రచయిత్రి ఉషారాణి.కె. ఒకరివి ఆశలు, మరొకరికి ఆశయాలు. జీవితాన్ని మార్చే సందర్భాలు, బతుకును ఏమార్చే సన్నివేశాలు.. చదువుతుంటే సెల్యులాయిడ్ స్క్రీన్‌పై సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. కాస్త పిల్లకాల్వలా మంద్రంగా మొదలయ్యే కథనం.. కాసేపటికి కొండవాగులా వేగం పుంజుకుంటుంది. తర్వాత ఏమవుతుందన్న ఉత్సుకతను రేకెత్తిస్తుంది. ప్రేమాభిమానాలు పెనవేసుకున్న పాత్రలతో మనమూ ప్రయాణం కొనసాగిస్తాం.
శ్రీరామాయణ సౌరభము
రచన: సముద్రాల శఠకోపాచార్య
పేజీలు: 85, వెల: రూ.100
ప్రతులకు: 98483 73067
రామాయణం ఎన్నిసార్లు చదివినా తనివితీరదు. శ్రీరాముడి గాథలు ఎన్నిసార్లు విన్నా అదే దివ్యానుభూతి కలుగుతుంది. ఆ రామాయణంలోని అద్భుతమైన ఘట్టాలు, శ్రీరాముడిలోని విశేష గుణాలను ‘శ్రీరామాయణ సౌరభము’లో సవివరంగా పొందుపరిచారు రచయిత సముద్రాల శఠకోపాచార్య. వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను ఏర్చికూర్చి పుస్తకరూపంలో తీసుకొచ్చారు. రామాయణ వాక్సుధను అరవై వ్యాసాలలో ‘హస్త భూషణం’గా అందించారు. రామనామ మహిమను తెలియజేసే సేతు బంధనం, రాముడి విధేయత, కౌసల్యా శోకము, తండ్రిమాట, వాక్చాతుర్యము తదితర వ్యాసాలు రామాయణ కావ్యంలోని మరో కోణాన్ని పాఠకులకు పరిచయం చేస్తాయి. రామాయణంపై పూర్తి సాధికారత ఉంటే గానీ, ఇలాంటి లోతైన విషయాలను రాయడం సాధ్యం కాదు. లక్ష్మణుడికి తగిన మర్యాద చేయనందుకు సుగ్రీవుడికి ఎదురైన సమస్య ఏమిటి?, ఊర్మిళ చేసిన త్యాగాన్ని వివరించే ‘ఊర్మిళ ఓర్మి’ తదితర వ్యాసాలు రామాయణ వైభవాన్ని కండ్లకు కడతాయి.
రచన: అచ్యుతానంద బ్రహ్మచారి
పేజీలు: 108,
వెల: రూ. 100 /
ప్రతులకు:
ఫోన్: 99481 48874
రచన: కందకుర్తి యాదవరావ్
పేజీలు: 95, వెల: రూ. 150 /-
ప్రచురణ: ఇతిహాస
సంకలన సమితి
ప్రతులకు:
ఫోన్: 99497 03224
రచన: రామిగాని ఉమాదేవి
పేజీలు: 120, వెల: రూ. 150 /
ప్రచురణ: అచ్చంగా తెలుగు
ఫోన్: 85588 99478
రచన: వెన్నెల సత్యం
పేజీలు: 64, వెల: రూ. 100 /-
ప్రచురణ: వెన్నెల ప్రచురణలు
ఫోన్: 94400 32210
రచన: వంశీకృష్ణ
పేజీలు: 183, వెల: రూ. 150 /-
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
ఫోన్: 98487 87284
రచన: పెయ్యేటి రంగారావు
పేజీలు: 296, వెల: రూ. 250 /
ప్రచురణ: అచ్చంగా తెలుగు
ఫోన్: 99129 97368
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
(జాతీయ సదస్సు పత్రాలు)
సంపాదకురాలు: నిదానకవి నీరజ
పేజీలు: 272, వెల: రూ. 200 /-
ప్రచురణ: శ్రీచందన మారోజు
పబ్లికేషన్స్,
ప్రతులకు: ఫోన్: 99089 48649