పురుషుడి జీవనయానంలో భార్యకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అనుకూలవతి అయిన భార్య కావాలని, జీవితం ఆనందమయంగా ఉండాలని ఆశించనివాళ్లు అసలే ఉండరు. భార్యల ఔదార్యాన్ని గొప్పగా చాటుతూ పాతిక మంది రచయితల కథలతో వచ్చిందే ‘అర్ధాంగి’ సంకలనం. సముద్రంలో వేటకెళ్లే భర్తకు విషపువ్యాధి సోకిందని, అతనితో సంసారం ప్రాణాంతకం అని తెలిసినా, తరచూ తీవ్ర చలిజ్వరానికి గురయ్యే భర్తను దగ్గరికి తీసుకుని సేద తీర్చటానికి వెనకాడదు గురవమ్మ. చివరికి అది ఆమె ప్రాణాన్నే హరించి వేస్తుంది. గురవమ్మ త్యాగాన్ని కండ్లకు కట్టే కథ ‘జాలువారు జీవితాలు’.
ఇక ‘నేటి సావిత్రి’ మతిస్థిమితం లేని భర్త ఇంటినుంచి వెళ్లిపోతే, అతణ్ని వెతికి పట్టుకోవటానికి నానా అవస్థలూ పడే నిరుపేద మహిళ సీతమ్మ కథ. రోడ్డు ప్రమాదానికి గురై మంచానికి అతుక్కుపోయిన భర్త మరో వివాహం చేసుకోమని కోరినా ససేమిరా అనే భార్య కథ ‘మమేకం’, భర్తను లోబరుచుకున్న మరో అమ్మాయిని చాకచక్యంగా పక్కకు తప్పించే భార్య కథ ‘కాలం బొమ్మలు’, అత్త ఎంత హింసపెట్టినా, నొచ్చుకోకుండా ఓర్పుగా ఆమెకు సేవలు చేసే ఓ కోడలు సీత కథ ‘ఆక్సిజన్’, వ్యసనపరుడైన భర్తను దారికి తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించి విఫలమైన లచ్చమ్మ, చివరికి రోకలిబండకు పనిచెప్పే కథ ‘ఎచ్చమ్మకోట’.. ఇలా ‘అర్ధాంగి’ సంకలనంలోని స్త్రీ పాత్రలన్నీ వైవిధ్యభరితమైన ప్రవర్తనతో ఆకట్టుకుంటాయి.
అర్ధాంగి (ప్రత్యేక కథలు)
పేజీలు: 216; వెల: రూ. 250
ప్రచురణ: జలదంకి పద్మావతి మెమోరియల్ ట్రస్ట్ ప్రతులకు : జలదంకి సుధాకర్, హైదరాబాద్
99599 29603, 91824 64386
మౌద్గల్యస
బుక్ షెల్ఫ్
కె.సి.ఆర్.తాత్విక స్వప్నం – చాణక్యం
(రాజకీయ వ్యాస సంపుటి)
రచన: డా॥ కాలువ మల్లయ్య
పేజీలు: 244,
వెల: రూ. 200
ప్రచురణ:
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
సృష్టి-ప్రకృతి- మనిషి
(కవితా సంపుటి)
రచన: నార కృష్ణమూర్తి
పేజీలు: 200,
వెల: రూ. 300
ప్రచురణ: శ్రీయజ్ఞ పబ్లికేషన్స్
ఫోన్: 98664 73385
విలోలితం
రచన: ఉషారాణి కందాళ
పేజీలు: 168,
వెల: రూ. 200
ప్రచురణ: అచ్చంగా తెలుగు
ఫోన్: 85588 99478