మనిషి వినూత్న ఆలోచనలు ఒకవైపు.. అత్యాధునిక టెక్నాలజీ మరో వైపు. ఇంకేముందీ.. ఆవిష్కరణలకు అంతేలేదు. ప్రతి చిన్న అవసరానికీ ఓ యంత్రాన్ని తయారు చేసేస్తున్నాడు. కావాలంటే ఈ డివైజ్‌ని చూడండి. దీని పేరు అమెజాన్ ఏకో షో 21. ఇదో కొత్త స్మార్ట్ డిస్ప్లే. చూడ్డానికి కంప్యూటర్ మానిటర్‌లా ఉందని అనుకోవద్దు. ఇది అమెజాన్ సంస్థ రూపొందించింన ప్రత్యేక డిస్ప్లే డివైజ్. ఇంట్లో పలు అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని తీర్చిద్దారు. ఇదేం చేస్తుంటే.. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే.. టీవీలా మారిపోతుంది. ఇంటికి రక్షణ కల్పించే వెబ్ కెమెరాలా పని చేస్తుంది. వీడియోలు షూట్ చేసే వీడియో కెమెరాలా రూపుదాలుస్తుంది. ఇంకా చెప్పాలంటే.. ఆఫీస్ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడే ప్రొఫెషనల్ డివైజ్లానూ పని చేస్తుంది. ఈ పరికరం తాకే తెర పరిమాణం 21 అంగుళాలు. ఇంటి నిర్వహణను మరింత సులభతరం చేస్తుంది. దీంట్లోని 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో గది మొత్తాన్ని చిత్రీకరించొచ్చు. వీడియో కాల్స్ కోసం మెరుగైన ఫ్రేమింగ్‌ను అందిస్తుంది. 65% ఎక్కువ జూమ్, డబుల్ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో.. మీరు కిచెన్‌లో కదులుతున్నప్పుడు కూడా ఎప్పుడూ ఫ్రేమ్‌లోనే ఉంటారు. అంతేకాదు.. ఆధునిక వైఫై సపోర్ట్‌తో వీడియోలను వేగంగా స్ట్రీమింగ్ చేయొచ్చు. డబుల్ బాస్‌తో ఆడియో నాణ్యత అదుర్సే!
ధర: రూ.42,000
దొరుకు చోటు: https://l1nk.dev/SJAx6
ఐక్యూ పెంచుకుని కొత్తగా..!!
మొబైల్ తయారీ రంగంలో తనదైన ముద్ర వేసింది వివో. ఇప్పుడు మరో ఉప బ్రాండ్ ‘ఐక్యూఓఓ’ పేరుతో మార్కెట్లో సందడి చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO 13ని భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్ Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో పని చేస్తుంది. iQOO 13 తెర పరిమాణం 6.82-అంగుళాలు. 2K+ AMOLED డిస్ప్లే. 50MP ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఫోన్ వెనక భాగంలో 50MP Sony IMX921 ప్రాథమిక సెన్సర్, 50MP అల్ట్రా వైడ్ లెన్స్.. అలాగే, 50MP టెలీఫొటో లెన్స్ ఉన్నాయి. దీంట్లో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఫోన్ ప్రైమరీ కెమెరాల చుట్టూ ‘లైట్ ఫ్లాష్’ ని ఏర్పాటు చేశారు. కాల్స్, మెసేజ్‌లు వస్తే.. ఈ లైట్ ఆటోమాటిక్‌గా ఫ్లాష్ అవుతుంది. చార్జింగ్ స్టేటస్‌ని కూడా ఫ్లాష్ లైట్లో చూడొచ్చు. బ్యాటరీ సామర్థ్యం 6,000mAh. 120W ఫాస్ట్ చార్జింగ్‌తో చార్జ్ చేయొచ్చు. IP68, IP69 రేటింగ్ నీళ్లు, దుమ్ముధూళి నుంచి రక్షణ కల్పిస్తుంది. iQOO 13 ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15పై పనిచేస్తుంది.
ధర : రూ. 55,000
దొరుకు చోటు: https://encr.pw/lnqQc
విలువైన వాటి కోసం..
ఇంట్లో విలువైన వస్తువులకు తగిన రక్షణ గురించి ఆలోచిస్తుంటాం. ప్రత్యేక లాకర్లను తయారు చేయించుకుంటాం. వాటికి మరింత అదనపు రక్షణ వలయాన్ని పెట్టుకోవాలనుకుంటే.. యేల్ సంస్థ తయారు చేసిన Biometric Smart Premium Furniture Lock ని అమర్చుకుంటే సరి. మీ వార్డ్రోబ్ లేదా కేబినెట్లకు ఈ లాక్‌ని సులభంగా అమర్చవచ్చు. దీన్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకున్నాక.. మీ ఫింగర్ ఫ్రింట్ లేనిదే.. ఈ సరుగుని తెరవలేరు. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల ఫింగర్ ప్రింట్స్‌ను కూడా జత చేయొచ్చు. మొత్తం 10 మంది యూజర్ల ప్రింట్స్‌ని తీసుకుంటుందిది. ఏదైనా అత్యవసర సందర్భాల్లో యూఎస్బీ పోర్ట్తోనూ అన్‌లాక్ చేయొచ్చు.
ధర: రూ.2,199
దొరుకు చోటు: https://encr.pw/KPuQc
మినీ ధరతో.. మ్యాగ్జిమమ్!
టెక్నాలజీ ప్రియుల్లో బ్రాండ్బాబులు చాలామందే ఉంటారు. వారిలో ఎక్కువశాతం మంది ‘యాపిల్’ చేతబుచ్చుకుని తిరిగేవారే. డెస్క్‌టాప్ యూజర్లదీ అదే రూటు. మినీ మ్యాక్‌లను జేబులో పెట్టుకుని వెళ్లిపోతుంటారు. మరైతే, మీరు కూడా ఇదే బ్రాండ్బాబుల జాబితాలో చేరొచ్చు. ‘అబ్బే.. మాదంత బడ్జెట్ కాదబ్బా..!!’ అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే యాపిల్ మ్యాక్ మినీ ధర కాస్త తగ్గింది. ఓ హైఎండ్ ల్యాపీ ధరలోనే మధ్య తరగతి యూజర్లకూ దగ్గరవుతున్నది. M4 Mac Mini తక్కువ పరిమాణంతో డెస్క్‌టాప్ అవసరాల్ని తీర్చేలా రూపొందించారు. ఇది 5×5 అంగుళాల పరిమాణంలో ఉండటం వల్ల ఇంట్లో ఎక్కడైనా సులభంగా ఉంచుకోవచ్చు. Mac Miniలో M4 మరియు M4 Pro చిప్‌లు ఉన్నాయి. ఇవి ఇంటెల్, ఏఎండీ చిప్‌ల కంటే వేగంగా పని చేస్తాయి. రోజువారీ పనులు నిర్వహించడంలోనే కాకుండా, కోడ్ కంపైలింగ్, వీడియో ఎడిటింగ్ వంటి కష్టమైన పనులను కూడా సులభంగా చేసుకోవచ్చు. Pages, Photos, iMovie వంటి అనేక అప్లికేషన్లు బాక్స్‌లోనే అందుబాటులో ఉంటాయి. M4 Mac Mini ప్రాథమిక మోడల్ ధర రూ. 59,900గా ఉంది. కానీ విద్యార్థులు దీనిని రూ. 49,900కే కొనుగోలు చేయవచ్చు.
దొరుకు చోటు: https://l1nk.dev/jkcfM