సాధారణంగా కర్వ్డ్ డిస్ప్లే అనగానే.. ఖరీదైన ఫోన్లు, ప్రీమియం వాచీలే గుర్తొస్తాయి. కానీ, తక్కువ బడ్జెట్లోనే లగ్జరీ లుక్ ఇచ్చే వాచ్ కావాలనుకునే వారికి.. Noise Icon Arc బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం సమయం చూపే గడియారం మాత్రమే కాదు.. మీ మణికట్టుపై మ్యాజిక్ చేసే ఒక మినీ అసిస్టెంట్ కూడా. ఇందులో 2.01 ఇంచుల భారీ కర్వ్డ్ టీఎఫ్టీ స్క్రీన్ ఉంది. దీంతో డిస్ప్లేపై అక్షరాలు, బొమ్మలు చాలా స్పష్టంగా, వివిడ్ క్లారిటీతో కనిపిస్తాయి. దీని కర్వ్డ్ డిజైన్.. వాచ్‌కి ప్రీమియం లుక్ అందిస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 10 రోజులపాటు నిరంతరంగా పనిచేస్తుంది. దీంతో ట్రావెలింగ్‌లో ఉన్నా, వర్కవుట్స్ చేస్తున్నా చార్జింగ్ గురించి టెన్షన్ పడాల్సిన పనిలేదు. వాటర్ రెసిస్టెన్స్‌తో వర్షంలో తడిచినా, జిమ్‌లో చెమట పట్టినా, చేతులు కడుక్కుంటున్నప్పుడు నీళ్లు పడినా వాచ్‌కి ఏమీ కాదు. స్మార్ట్ వాయిస్‌కి అసిస్టెంట్ ఫీచర్ ఉంది. చేతులతో పనిలేకుండా వాయిస్ కమాండ్స్‌తో అలారమ్స్ సెట్ చేయొచ్చు. నాయిస్ హెల్త్ సూట్ యాప్‌తో మీ గుండె వేగం, రక్తంలో ఆక్సిజన్ (ఎస్పీవో2), ఒత్తిడి, నిద్రను ట్రాక్ చేయొచ్చు. దీంతో మీ ఆరోగ్యంపై మీకు ఎప్పుడూ అప్డేట్ ఉంటుంది. దీనికి ఉన్న క్రౌన్ బటన్ కేవలం షో కోసం కాదు.. అవసరమైనప్పుడు మెనూని స్క్రోల్ చేస్తుంది.
ధర: సుమారు రూ.2,500
దొరుకు చోటు: అమెజాన్,ఫ్లిప్‌కార్ట్
కారులో మూడో కన్ను

రోడ్డు మీద కారులో వెళ్తుంటే ఎప్పుడు ఏ మలుపులో ఎవరు ఢీ కొడతారో.. ఎవరి తప్పు ఎంతో తెలియక తల పట్టుకోవాల్సి వస్తుంది. అందుకే.. ఇప్పుడు ‘డ్యాష్ క్యామ్’ అనేది లగ్జరీ కాదు. ఒక అత్యవసర వస్తువు. అందుకే REDTIGER సంస్థ తన సరికొత్త ఎఫ్17 డ్యాష్ క్యామ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది కెమెరా మాత్రమే కాదు.. మీ కారు చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తుంది. చాలా డ్యాష్ క్యామ్‌లు కేవలం ముందు వైపు మాత్రమే చూస్తాయి. కానీ ఎఫ్17 అలా కాదు, ఇది 3 చానెల్ రికార్డింగ్ చేస్తుంది. ముందు వైపు 4కె క్వాలిటీతో, కారు లోపల.. వెనక వైపు 1080పి క్వాలిటీతో రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ వ్యూ 150ఓ, క్యాబిన్ వ్యూ 160ఓ, రియర్ వ్యూ 155ఓ ఉండటంతో కారు చుట్టూ ఏం జరుగుతుందో పక్కాగా రికార్డ్ అవుతుంది. జీపీఎస్ డేటా వల్ల ప్రమాదం జరిగినప్పుడు మీరు ఏ లొకేషన్లో, ఏ స్పీడ్‌లో ఉన్నారో పక్కా సాక్ష్యంగా చూపించవచ్చు.
ధర: సుమారు రూ. 16,000
దొరుకు చోటు: అమెజాన్
ఆరోగ్యానికి జ్యూసర్

మనం సాధారణంగా వాడే మిక్సీలు, జ్యూసర్లు చాలా వేగంగా తిరుగుతాయి. అందువల్ల వేడి పుట్టి, పండ్లలోని పోషకాలు కొంతమేర నశించిపోతాయి. అప్పుడు ఆ జ్యూస్ తాగినా ప్రయోజనం తక్కువ. ఈ సమస్యకు మోడ్రన్ సొల్యూషన్.. ఈ SOLARA కోల్డ్ ప్రెస్ జ్యూసర్. ఇది పండ్లను వేగంగా పిప్పి చేయకుండా.. మెల్లగా నలిపి రసాన్ని తీస్తుంది. తక్కువ వేగంతో తిరుగుతుంది. దీంతో పండ్లలోని విటమిన్లు, ఖనిజాలు ఏమాత్రం పాడవకుండా మీకు చిక్కని, పోషక విలువలున్న జ్యూస్‌ను అందిస్తుంది. ఇందులోని ప్రత్యేక టెక్నాలజీ సాధారణ జ్యూసర్ల కంటే 30% ఎక్కువ రసాన్ని పిండుతుంది. రెండు రకాల స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి. దీంతో నారింజ, పుచ్చకాయ లాంటి మెత్తని పండ్లనే కాకుండా.. క్యారెట్, బీట్రూట్ లాంటి ఇతర కూరగాయల నుంచి కూడా రసాన్ని సులభంగా తీయొచ్చు. జ్యూస్ తీసేటప్పుడు పీచు పదార్థం ఏదైనా అడ్డుపడితే.. రివర్స్ బటన్ నొక్కితే చాలు, బ్లేడ్ మొత్తం క్లియర్ అవుతుంది. మెషిన్ స్ట్రక్ అవుతుందేమోననే భయం అక్కర్లేదు. జ్యూస్ తీయడం ఎంత ఈజీయో.. క్లిన్ చేయడం కూడా అంతే సులభం. ఇది బీపీఏ ఫ్రీ మెటీరియల్‌తో తయారైంది.
ధర: సుమారు రూ.6,000
దొరుకు చోటు: అమెజాన్
చలికి స్మార్ట్ చెక్!

చలి మామూలుగా లేదు. ఒకప్పుడంటే చలిమంటలు వేసుకోవడం.. కుంపటి పెట్టుకోవడం ఉండేది. కానీ, ఇప్పుడంతా ఇన్స్టంట్ లైఫ్. అందుకే రూమ్ హీటర్లు వచ్చేశాయ్. కానీ, బిల్లు బోల్డంత వస్తుందేమోనని అనే భయం చాలామందిలో ఉంటుంది. అంతేకాదు, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే హీటర్ వల్ల ఏవైనా ప్రమాదాలు జరుగుతాయేమో అనే టెన్షన్ కూడా ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ సింపుల్ అండ్ సేఫ్ సొల్యూషన్.. ఈ Orient Electric Stark రూమ్ హీటర్. ఇది తక్కువ పవర్ వాడుకుంటూనే మీ గదిని వెచ్చగా మార్చేస్తుంది. కేవలం 800 వాట్స్ గరిష్ఠ పవర్‌తో పనిచేస్తుంది. ఇందులో రెండు హీటింగ్ రాడ్స్ ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి 400వాట్స్ లేదా 800వాట్స్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. హీటర్ అనుకోకుండా కింద పడిపోతే.. ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. దీంట్లోని క్వార్ట్జ్ టెక్నాలజీ వల్ల స్విచ్ ఆన్ చేసిన వెంటనే సెకన్లలో వేడిని విడుదల చేస్తుంది. హీటర్ పనిచేస్తున్నప్పుడు కూడా దాని బాడీ వేడెక్కదు. సేఫ్టీ గ్రిల్ కూడా ఉంది. చూడటానికి క్లాసీగా, ప్రీమియం లుక్‌తో ఉంటుంది. చాలా తేలికగా ఉండటం వల్ల ఇంట్లో ఎక్కడికైనా సులభంగా మార్చుకోవచ్చు.
ధర: సుమారు రూ.1,500
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్