సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమానా’. భాస్కర్ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే ట్రైలర్ను లాంచ్ చేశారు.
హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో కథ నడుస్తుందని, నేటి యువత ఆలోచనలకు అద్దం పడుతూ చక్కటి వినోదం, థ్రిల్లింగ్ అంశాలతో మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. ఎమ్జీ మూవీస్ అచ్చిబాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. స్వాతి కశ్యప్, జారా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగన్ ఏ, సంగీతం: కేశవ కిరణ్, రచన-దర్శకత్వం: భాస్కర్ జక్కుల.