పూర్వం చలికాలం వచ్చిందంటే మన అమ్మమ్మలో.. నానమ్మలో వెచ్చని కుంపటిని గదిలో పెట్టేవారు. అందరూ వెచ్చగా నిద్రపోయేవారు. ఇదే మాదిరిగా నేటితరానికి సరిపడేలా ఓ గ్యాడ్జెట్ కుంపటి ఉన్నదని తెలుసా? అదే Bajaj Flashy Radiant Room Heater. 1000 వాట్స్‌తో ఇది వేడెక్కి.. గది ఉష్ణోగ్రతలను పెంచుతుంది. హీటర్ నుంచి వేడిని రెట్టింపు చేసేలా స్టీల్ రిఫ్లెక్టర్ పనిచేస్తుంది. చిన్న పరిమాణంలో ఉండే ఈ హీటర్‌ను గదిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
ధర : రూ.999.
దొరుకు చోటు : https://encr.pw/OyPCl
ఇవి ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్
శీతకాలంలో దుప్పటి కప్పుకొని వెచ్చగా నిద్రపోతే.. ఆ హాయిని వర్ణించగలమా? అందుకే.. చలికి స్మార్ట్‌గా చెక్‌పెట్టేలా ఎలక్ట్రిక్ బ్లాంకెట్లు వచ్చేశాయ్. వీటి వాడకానికి అనేకమంది ఆసక్తి చూపడంతో మార్కెట్లో వీటి సందడి ఎక్కువైంది. వీటిలో ప్రత్యేకంగా రూపొందించిన ఇన్సులేటెడ్ వైర్లలో వేడిని జనరేట్ చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ బ్లాంకెట్లు గది హీటర్ల కంటే తక్కువ విద్యుత్‌ని తీసుకుంటాయ్. దీంతో కరెంటు బిల్లు కోసం చింతించాల్సిన పనిలేదు. అడ్జస్టబుల్ టెంపరేచర్లతో.. వీటిని కప్పుకొని హాయిగా నిద్రించొచ్చు. సేఫ్టీ విషయంలోనూ రూపకర్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆధునిక ఎలక్ట్రిక్ బ్లాంకెట్లలో ఓవర్‌హీట్ ప్రొటెక్షన్, ఆటో-షటాఫ్ వంటి సురక్షిత ఫీచర్లను అందించారు. అవి నిద్రను మెరుగుపరచడంతోపాటు కొన్ని మసాజ్ చేస్తాయ్ కూడా. అయితే, వీటిని వాడే క్రమంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఆన్లైన్ అంగళ్లలో ఇవి దొరుకుతున్నాయ్.. కావాలంటే ప్రయత్నించొచ్చు. Beurer HD 75 Electric Blanket, Utopia Bedding Double Bed Electric Blanket,Warmland Single Bed Electric Bed Warmer
ధర : రూ.6,045
దొరుకుచోటు : https://encr.pw/JZgul
వేడినీళ్ల గురించి వేరే చెప్పాలా?
చలికాలంలో వేడినీళ్లతో స్నానం చేసినా.. ఆవిరి పట్టినా.. ఆ రిలీఫ్ మాటల్లో చెప్పలేం కదా! అందుకే ఈకాలంలో గీజర్ అమ్మకాలు బాగా పెరుగుతాయ్. బాత్రూమ్, కిచెన్లలో వీటిని ఇన్స్టాల్ చేసుకుని వాడేస్తుంటారు. సామర్థ్యాన్ని బట్టి కొన్ని గీజర్లు నిమిషాల్లోనే నీటిని వేడి చేస్తాయి. కావాలంటే Havells Instanio 3 Litre Instant Water Heater చూడండి. ఇది మూడు లీటర్ల నీటిని నిమిషాల్లోనే వేడి చేస్తుంది. ఎల్ఈడీ ఇండికేటర్‌తో నీళ్లు వేడెక్కడాన్ని గుర్తించొచ్చు. ఒకవేళ నీళ్లు బాగా వేడెక్కిపోతే.. హీటర్ ఆటోమాటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీని ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా చాలా సులభం.
ధర : రూ.3,399
దొరుకుచోటు : https://acesse.dev/CxtwD.
తేమ.. ఇక మన కంట్రోల్లో..
గాలిలో తేమ శాతం కారణంగానే వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయ్. ఇప్పుడు ఆ తేమను మనమే కంట్రోల్ చేస్తూ.. ఇంట్లో వాతావరణాన్ని వెచ్చగా మార్చేయొచ్చు. అందుకోసం ప్రత్యేకంగా తయారైనవే ఈ హ్యూమిడిఫయర్లు. శీతకాలంలో చల్లని గాలులు.. అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతాయి. అలాంటప్పుడు ఈ హ్యూమిడిఫయర్లను వాడి.. గది ఉష్ణోగ్రతల్ని నియంత్రించొచ్చు. వీటి నుంచి వచ్చే తేమ.. చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. దీంతో శీతకాలంలో చర్మ, శ్వాస సంబంధ సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు. అయితే, వీటిని ఉపయోగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేదంటే.. బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఇదిగోండి.. ఈ హ్యూమిడిఫయర్లు మనమే ప్రయత్నించొచ్చు. Reffair Caligo 500 Smart Ultrasonic Humidifier, SELLER ZONE Humidifiers.
ధర : రూ.499
దొరుకుచోటు : https://encr.pw/66w0G