వైర్లెస్ మౌస్ అంటే.. ఎక్కువశాతం ఏఏ బ్యాటరీలపైనే ఆధారపడతాం. కానీ, ఈ అమెజాన్ బేసిక్స్ ఆర్జీబీ వైర్లెస్ మౌస్ అలా కాదు. ఇది త్వరగా చార్జ్ అవుతుంది. ఈ మౌస్‌లో 500 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటుచేశారు. ఇది కేవలం పని కోసమేనా? అంటే కాదు.. మీ డెస్క్‌టాప్ లుక్‌ను ట్రెండీగా మార్చేస్తుంది. స్మూత్ అండ్ హై-ప్రెసిషన్ పనితీరును అందిస్తుంది. ఈ మౌస్‌ను 10 మీటర్ల దూరం నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. ఆర్జీబీ లైటింగ్, 1600 డీపీఐ సెన్సిటివిటీ వంటి అత్యాధునిక ఫీచర్లతో ప్రొఫెషనల్స్, గేమర్స్, క్యాజువల్ యూజర్లకు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నది. రీచార్జబుల్ 500mAh బ్యాటరీ ఇంటెలిజెంట్ పవర్ సేవింగ్ మోడ్‌తో ఎక్కువ బ్యాకప్ అందిస్తుంది. డెస్క్‌టాప్ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే కస్టమైజబుల్ ఎల్ఈడీ బ్యాక్‌లైట్.. దీంట్లో మరో ప్రత్యేకత. అంతేకాదు, 1600 DPI సెన్సిటివిటీ హై-ప్రెసిషన్ ట్రాకింగ్, స్మూత్ కర్సర్ మూమెంట్‌తో పనిని మరింత సులభంగా చేసుకోవచ్చు. ఈ మౌస్.. మీ కంప్యూటర్ వాడకాన్ని కచ్చితంగా మరో లెవల్‌కి తీసుకెళ్తుంది.
ధర: రూ.549
దొరుకుచోటు: https://encr.pw/JaQqI
ఒక్క క్లిక్‌తో.. గుడ్లు ఉడికేస్తాయ్!
ఉదయాన్నే నిద్రలేచి గుడ్లు ఉడకబెట్టుకోవాలంటే సమయం చాలడం లేదా? నీళ్లు ఎక్కువైనా, తక్కువైనా గుడ్లు సరిగా ఉడకడం లేదా? ఇక ఆ టెన్షన్ అవసరం లేదు! అమెజాన్ బేసిక్స్ ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్‌తో మీకు కావాల్సిన విధంగా కోడిగుడ్లను ఉడికించుకోవచ్చు. మూడు రకాల బాయిలింగ్ మోడ్లు కలిగిన ఈ పరికరం.. కొద్ది నిమిషాల్లోనే పనిని పూర్తిచేస్తుంది. ఈ ఎగ్ బాయిలర్‌లో 25 మిల్లీలీటర్ల నీటితో సాఫ్ట్ బాయిల్, 50 మిల్లీలీటర్ల నీటితో మీడియం బాయిల్, 75 మిల్లీలీటర్ల నీటితో హార్డ్ బాయిల్ చేసుకోవచ్చు. ఆటో షట్-ఆఫ్ అండ్ ఎల్ఈడీ ఇండికేటర్ ఉండటంతో, గుడ్లు సిద్ధమైన వెంటనే ఆటోమాటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. డిటాచబుల్ పార్ట్స్ వల్ల దీన్ని తక్కువ టైమ్‌లోనే క్లీన్ చేయొచ్చు. చిన్న కిచెన్లు, హాస్టల్స్, బ్యాచిలర్స్కి ఇది మంచి చాయిస్. స్టెయిన్లెస్ స్టీల్ హీటింగ్ ప్లేట్, హై-క్వాలిటీ ప్లాస్టిక్ బాడీ ఉండటంతో ఎక్కువకాలం మన్నుతుంది. చిటికెలో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేసుకోవాలనుకునే వారికి ఇది బాగా
ఉపయోగపడుతుంది.
ధర: రూ.399
దొరుకుచోటు: https://l1nq.com/NmXf6
మ్యూజిక్.. మరో మెట్టు!
సాధారణ టీడబ్ల్యూఎస్ బడ్స్‌తో సరిపెట్టుకోవడం ఎందుకు? అమెజాన్ బేసిక్స్ ఎస్19తో మ్యూజిక్ అనుభూతిని మరో మెట్టు ఎక్కించండి. 50 గంటల బ్యాటరీ సామర్థ్యం, 10ఎంఎం డ్యూయల్ డ్రైవర్స్, ఫాస్ట్ చార్జింగ్, ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్లతో.. ఇది మీకు రోజువారీ మ్యూజిక్ కంపానియన్‌గా మారిపోతుంది. కేవలం 10 నిమిషాలు చార్జింగ్ పెడితే.. 85 నిమిషాల ప్లేబ్యాక్ పొందొచ్చు. బడ్జెట్ టీడబ్ల్యూఎస్ బడ్స్ సాధారణంగా 30-40 గంటల బ్యాటరీ లైఫ్ మాత్రమే ఇస్తాయి. కానీ, ఎస్19 మాత్రం 50 గంటల ప్లేబ్యాక్ అందిస్తుంది. బ్లూటూత్ 5.3 తో ల్యాగ్-ఫ్రీ కనెక్టివిటీతో మీ గ్యాడ్జెట్లతో ఇట్టే కనెక్ట్ అవుతుంది. సౌండ్ క్వాలిటీలో మరింత డెప్త్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ప్రముఖ బ్రాండ్ల కన్నా తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నది.
ధర: రూ.1,999
దొరుకుచోటు: https://l1nq.com/jfVse
చిన్న బ్యాగ్.. పెద్ద సౌకర్యం!
బ్యాగ్ చిన్నగా ఉండాలి.. ట్రెండీగా కనిపించాలి. అయినా అన్ని వస్తువుల్నీ సౌకర్యంగా సర్దుకోవాలి అనుకుంటే.. ఈ బ్యాగ్ మీ కోసమే. ట్రావెల్లో చార్జింగ్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. వర్షంలో వస్తువులు తడిసిపోకుండా రక్షణ కల్పిస్తుంది. ఇంతకీ ఏంటా బ్యాగు అంటే.. అమెజాన్ బేసిక్స్ క్రాస్బాడీ బ్యాగ్! స్టయిల్, సేఫ్టీ, సౌకర్యం.. అన్నీ ఒకేదాంట్లో! ఈ బ్యాగ్‌లో మూడు విభాగాలు ఉండటంతో ఫోన్, వాలెట్, వాటర్ బాటిల్, కెమెరా, తాళంచెవులు లాంటి వస్తువులను సులభంగా భద్రపరచుకోవచ్చు. బయట యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, లోపల బిల్ట్-ఇన్ చార్జింగ్ కేబుల్ ఉండటంతో, ట్రిప్‌లో ఫోన్ చార్జింగ్ అనేది ఇక సమస్య కాదు. వాటర్ రెసిస్టెంట్ మెటీరియల్ వల్ల వర్షం పడినా లోపలి వస్తువులు సేఫ్‌గా ఉంటాయి. అడ్జస్టబుల్ స్ట్రాప్ ఉండటంతో ఎడమ లేదా కుడి భుజంపై ఎలాగైనా ధరించవచ్చు. చిన్న సైజులో ఉండే ఈ బ్యాగుని డే బ్యాక్ప్యాక్గానూ వాడుకోవచ్చు. కాంపాక్ట్, స్టయిలిష్, వెర్సటైల్ బ్యాగు కోసం వెతికేవారికి ఇది చక్కని ఎంపిక!!
ధర: రూ.449
దొరుకుచోటు: https://encr.pw/QKf41