ఎన్ని మోడళ్లు వచ్చినా.. ఇంకేదో ఉంటే బాగుంటుంది అనుకునేవారే ఎక్కువ. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు. నిత్యం అప్డేటెడ్ ఫోన్ల కోసమే చూస్తుంటారు. అలాంటివారికి ప్రత్యేకం.. మోటరోలా తెస్తున్న మోటో జీ96 5జీ. ఇది బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ ఇచ్చే ఫోన్ అయ్యుండొచ్చని టెక్ ప్రియులు ఆశిస్తున్నారు.
ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే 6.67 అంగుళాల పెద్ద స్క్రీన్. 144 Hz రిఫ్రెష్ రేట్‌తో సినిమాలు, గేమ్స్ చూసేటప్పుడు స్మూత్‌గా కనిపిస్తుంది. ఈ స్క్రీన్‌కి గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉంది. అంటే స్క్రీన్ సులభంగా పగలదు. ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌ని వాడారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది.
దీంతో ఇక చెప్పేదేముంది.. యాప్స్, గేమ్స్ వేగంగా రన్ అవుతాయి. వెనుక 50 ఎంపీ సోనీ ఎల్వైటీ-700సీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాతో మంచి ఫొటోలు తీయొచ్చు. ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. స్టూడెంట్స్, గేమింగ్ ఇష్టపడే యువతకు బాగా సరిపోతుంది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
ధర: రూ. 22,000 (అంచనా)
దొరుకు చోటు : మోటరోలా అధికారిక సైట్

కామన్ మ్యాన్ కూడా కంటెంట్‌పై వర్క్ చేస్తున్నాడు. వ్లాగ్ పెట్టేసి వీడియోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో మొదల్లో చాలామంది చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ వాడినా.. తర్వాత వీడియో కెమెరాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారికి ప్రత్యేకమైందే ఈ సోనీ మిర్రర్‌లెస్ కెమెరా. మోడల్ జెడ్ వీ-ఈ10ఎల్. హై ఎండ్ క్వాలిటీతో వీడియోలు, వ్లాగ్స్ తీయాలనుకునే వాళ్లకు బెస్ట్ ఆప్షన్! ఇందులో 16-50 ఎంఎం పవర్ జూమ్ లెన్స్, 24.2 ఎంపీ లార్జ్ ఏపీఎస్-సీ ఎక్స్మోర్ సీఎంఓఎస్ సెన్సార్ ఉన్నాయి. అంటే 4కె వీడియోలు సూపర్ క్లారిటీతో వస్తాయన్నమాట. 5 ఎఫ్‌పీఎస్ స్పీడ్‌తో వరుసగా ఫొటోలు తీయొచ్చు. స్క్రీన్‌ని తిప్పి సెల్ఫీలు, వ్లాగ్స్ ఈజీగా తీసుకునే వీలుంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో నడుస్తున్నప్పుడు కూడా వీడియోలు స్మూత్‌గా వస్తాయి. వ్లాగర్స్, కంటెంట్ క్రియేటర్స్‌కి బాగా సరిపోతుంది. ఫాస్ట్ ఆటోఫోకస్, స్పీడ్ అప్, స్లో-మోషన్ వీడియోలు, టైమ్-లాప్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. వై-ఫై, బ్లూటూత్‌తో ఫొటోలు, వీడియోలు ఈజీగా షేర్ చేయొచ్చు.
ధర: రూ. 58,490
దొరుకు చోటు: ఫ్లిప్‌కార్ట్

ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్కి ఊపు వచ్చేలా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే.. ఇదిగోండి ఈ ప్రొజెక్టర్ మంచి చాయిస్. జెబ్రానిక్స్ ZEB-PIXAPLAY 24 స్మార్ట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్. దీంతో ఇంట్లోనే థియేటర్ ఫీల్‌ని పొందొచ్చు! ఈ ప్రొజెక్టర్ 4000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో 1080p FHD క్వాలిటీలో సినిమాలు చూడొచ్చు. 160 అంగుళాల (406 సెం.మీ) వరకు పెద్ద స్క్రీన్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ (వర్టికల్ అడ్జస్ట్మెంట్) ఉన్నాయి. దీంతో ఎక్కడైనా సెటప్ చేయడం సులభం. బ్లూటూత్ 5.0, వై-ఫై, HDMI, USB, AUX కనెక్షన్‌తో ఫోన్, ల్యాప్‌టాప్ నుంచి సులభంగా కనెక్ట్ చేయొచ్చు. స్క్రీన్ మిర్రరింగ్, యాప్ సపోర్ట్‌తో స్మార్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 30,000 గంటలు లైఫ్ ఉన్న ఎల్ఈడీ ల్యాంప్, బిల్ట్-ఇన్ స్పీకర్లతో వస్తుంది. హోమ్ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే వాళ్లకు, స్టూడెంట్స్ ప్రజెంటేషన్స్ కోసం, బిజినెస్ మీటింగ్స్‌కి బాగా ఉపయోగపడుతుంది.
ధర: రూ. 9,999
దొరుకు చోటు: ఫ్లిప్‌కార్ట్

బ్రాండ్.. హై ఎండ్.. లాంటివి అవసరం లేకుండా ఫోన్ కొందామనుకుంటే.. మైండ్లోకి వచ్చేది బడ్జెట్ ఫోన్లే. అలాంటి బడ్జెట్ స్మార్ట్ఫోన్ల కోసం చూస్తున్నట్టయితే ఆల్కాటెల్ ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ఫ్రెంచ్ కంపెనీ భారత్‌లో మూడు కొత్త ఫోన్లను విడుదల చేసింది. అవే వీ3 క్లాసిక్, వీ3 ప్రో, వీ3 అల్ట్రా! యువతను ఆకర్షించేలా వీటిని రూపొందించారు. అందుకే ధర తక్కువగా, ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. వీ3 క్లాసిక్‌లో 6.67 అంగుళాల పెద్ద స్క్రీన్, 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది స్టూడెంట్స్‌కి, కొత్తగా ఫోన్ కొనాలనుకునే వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. వీ3 ప్రోలోనూ 6.67 అంగుళాల స్క్రీన్, 5,010 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ + 5 ఎంపీ వెనుక కెమెరాలతో మంచి ఫొటోలు తీసుకోవచ్చు. మూడో మోడల్ వీ3 అల్ట్రాలో 6.78 అంగుళాల స్క్రీన్, 108 ఎంపీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, స్టయిలస్ పెన్ ఉన్నాయి. మూడు ఫోన్లలోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. సో.. వాడకంలో స్పీడ్ సమస్య ఉండదు. వీ3 క్లాసిక్, వీ3 ప్రో ఆండ్రాయిడ్ 15తో, వీ3 అల్ట్రా ఆండ్రాయిడ్ 14తో వస్తాయి. మరో విషయం ఏంటంటే ఇవి భారత్‌లోనే తయారవుతాయి.
ధర : వీ3 క్లాసిక్ రూ.12,999, వీ3 ప్రో రూ.17,999, వీ3 అల్ట్రా రూ.19,999
దొరుకు చోటు : ఫ్లిప్‌కార్ట్