Health Tips | వాటికి దూరంగా ఉంటే చాలు.. మైగ్రేన్‌కు చిట్కా చికిత్స
మైగ్రేన్ అంటేనే తలలో ఓ కార్ఖానా కదులుతున్న భావన. నరనరాన్నీ మంటపెట్టే బాధ. ఈ సమస్యను ఎదుర్కోవడంలో కొన్ని చిట్కాలూ పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ప్రత్యేకించి కొన్ని పరిస్థితులు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి.
Health Tips | మైగ్రేన్ అంటేనే తలలో ఓ కార్ఖానా కదులుతున్న భావన. నరనరాన్నీ మంటపెట్టే బాధ. ఈ సమస్యను ఎదుర్కోవడంలో కొన్ని చిట్కాలూ పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ప్రత్యేకించి కొన్ని పరిస్థితులు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. పెద్ద శబ్దాలు, ఘాటైన రసాయనాలు, మద్యం, కాఫీ, చలి, ఎండ… ఇందులో ఏవి మనకు తలనొప్పిని తెప్పిస్తున్నాయో గమనించుకుని వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది. వీలునుబట్టి సంప్రదాయ వైద్యాన్నీ ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల తలనొప్పి తగ్గుతుందని నమ్మకం. కాఫీ విషయానికొస్తే.. కొందరికి కాఫీ ఉపశమనం కలిగిస్తే, మరికొందరిలో సమస్యను తీవ్రతరం చేస్తుంది.
బాల్యానికి బాదం!
బాదంపప్పు అంటే ఖరీదైన వ్యవహారమే. కానీ వాటితో వచ్చే లాభంతో పోల్చుకుని తింటే మాత్రం మహా చవకగా అనిపిస్తుంది. అందులోనూ, గుప్పిట్లో పట్టేటన్ని బాదం పప్పుల్ని నానబెట్టి, రోజూ పిల్లలకు ఇవ్వాలంటారు నిపుణులు. ఎందుకంటే..విటమిన్-ఇ,మెగ్నీషియం, జింక్ లాంటి పదిహేను పోషకాలు బాదంలో సమృద్ధం. బాదంలోని మంచి కొవ్వు వల్ల చర్మం నిగనిగలాడుతుంది. ప్రొటీన్ల పుణ్యమాని ఒంటికి తగినంత శక్తి లభిస్తుంది. కండరాలు బలపడతాయి. బాదంపప్పులు తినడం వల్ల కడుపు నిండుగా తోస్తుంది. ఆకలి తీరుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వాటిలోని క్యాల్షియం ఎముకల దృఢత్వానికి, ఎత్తు పెరగడానికి దోహదపడుతుంది.
చక్రాల కుర్చీలు
జీవితాంతం చక్రాల కుర్చీలో గడపాలని ఎవరూ అనుకోరు. కానీ ఏదైనా సమస్య వల్ల తాత్కాలికంగానో, శాశ్వతంగానో వీల్‌చైర్‌లో గడపాల్సిన పరిస్థితి ఎవరికైనా రావచ్చు. కాకపోతే ఓ సమస్య ఉంది. వీల్
చైర్‌కు పరిమితం కావడం వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండెజబ్బు లాంటి సవాలక్ష సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు పరిశోధకులు.
శరీరంలో కదలికలు లేకపోవడం వల్ల కండరాలు దెబ్బతినే ఆస్కారం ఉంది. దీన్ని అధిగమించడానికి శరీర పైభాగాన్ని చురుకుగా ఉంచే.. కార్డియో వ్యాయామాలను రోజుకు అరగంట పాటైనా చేయాలని సూచిస్తున్నారు. తాజా కూరలు, పండ్లతో పాటు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, మంచి కొవ్వును అందించే పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. తరచూ నీళ్లు తాగితే రక్తప్రసరణ, జీర్ణవ్యవస్థ బాగుంటాయి. మద్యం, ధూమపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

