Mango | మామిడి… ‘పండ్లలో మహారాజు’గా పేరుగాంచింది. ఎక్కువ మంది భారతీయుల మనసు దోచుకున్న పండు కూడా ఇదే. మనదేశంలో వెయ్యికి పైగా మామిడి రకాలు సాగులో ఉన్నాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో వెరైటీకి ప్రసిద్ధి. ఈ ఫలరాజు రుచిలోనే కాదు.. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా కలిగి ఉండి మంచి ఆరోగ్యానికీ హామీ ఇస్తుంది. వేసవి జోరు అందుకోక ముందే రకరకాల మామిడి పండ్లు రుచి చూడమంటూ మారాం చేస్తున్నాయి. మీరూ ఓ పట్టుపట్టండి..
గుజరాత్, మహారాష్ట్రల్లో దొరుకుతుంది. మనదేశంలో దొరికే ఖరీదైన పండ్లలో కేసర్ ఒకటి. ఆకుపచ్చ, ఎరుపు రంగులో కావిరంగు కండతో తియ్యటి రుచి కలిగిన కేసర్ రకం మామిడి మంచి సువాసనలను వెదజల్లుతుంది. దీన్ని ‘మామిడిలో మహారాణి’గా మెచ్చుకుంటారు. డెజర్ట్‌లు, ఐస్‌క్రీమ్‌లు, షేక్స్‌లో ఉపయోగిస్తారు. కేసర్
మామిడితో చేసే ‘ఆమ్స్’్ర ప్రసిద్ధిచెందిన పానీయం.
ఆరోగ్య ప్రయోజనాలు : డైటరీ ఫైబర్‌కు మంచి వనరు. ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది.
మహారాష్ట్రలోని రత్నగిరి, దేవగఢ్ ప్రాంతాలు ఈ రకం పండ్లకు ప్రసిద్ధి. అన్ని పండ్లలో అల్ఫాన్సోను గొప్ప పండుగా పరిగణిస్తారు. భారతదేశంలో అతి ఖరీదైన పండ్లలో ఇవి ఒకటి. చిన్నగా, గోళాకారంగా ఉండే అల్ఫాన్సో పండ్లను చూడగానే గుర్తుపట్టొచ్చు. పసుపు ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లను ఐస్‌క్రీమ్‌లు, ఫుడ్డింగ్‌లు, యోగర్ట్ తయారీకి ఉపయోగిస్తారు. వీటిలో టెంక చిన్నగా, గుజ్జు ఎక్కువగా ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు : అల్ఫాన్సో పండ్లలో ఎ, సి విటమిన్లు ఎక్కువ. కంటిచూపు, చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మెరుగుదలకు ఇవి సహకరిస్తాయి.
ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్లోని మాల్డా ప్రాంతాలు లంగ్డా రకం పండ్లకు ప్రసిద్ధి. జూలై, ఆగస్టు నెలల్లో దొరుకుతాయి. ఇతర మామిడి పండ్లతో పోలిస్తే లంగ్డా రకం పండ్లు మంచి వాసనతో ఉంటాయి. పండిపోయిన తర్వాత కూడా దీని తొక్క ఆకుపచ్చగా ఉంటుంది. తియ్యగా, రసంతో ఉండే లంగ్డా గుజ్జులో పీచు ఉండదు. డెజర్ట్స్, షేక్స్‌కు ఈ రకంపండ్లు
పనికివస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు : వీటిలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువ. రోగ నిరోధక శక్తిని పెంచే, శరీరంలో కణాల వినాశనాన్ని అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీనిలో పుష్కలమే.
రుచికి పుల్లగా, ఆకారంలో పొడుగ్గా ఉండే తోతాపురికి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పెట్టిందిపేరు. ఆకుపచ్చ పసుపు కలిసిన తొక్కతో ఉండే తోతాపురి రకాన్ని ఊరగాయలు, పచ్చళ్లకు కూడా
వాడుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు : ఫైబర్ అధికంగా ఉండే తోతాపురి అరుగుదలకు, పొట్ట ఆరోగ్యానికి మేలుచేస్తుంది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఈ రకం పండ్లకు ప్రసిద్ధి. చౌసా మామిడిది వందల ఏండ్ల చరిత్ర. 16వ శతాబ్దంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన షేర్షా కాలంలో దీన్ని తొలిసారిగా పండించారు. ఇది పసుపు పచ్చ రంగులో మంచి సువాసన, మృదువైన గుజ్జుతో ఉంటుంది. అందుకే జ్యూస్ తయారీకి చౌసా మంచి ఎంపిక. డెజర్ట్స్, పచ్చళ్లు, ఊరగాయలు పెట్టుకోవడానికి కూడా అనుకూలమైన రకం.
ఆరోగ్య ప్రయోజనాలు : చౌసా పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో కొలాజెన్ ఉత్పత్తికి దోహదపడుతుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ర్టాల్లో పండుతుంది. తియ్యగా, రసభరితంగా పీచులేని గుజ్జుతో ఉంటుంది. మార్కెట్‌ను మొదట ఆక్రమించుకునేవి బంగినపల్లి పండ్లే. పలుచటి తొక్క ఉండే ఈ పండు పరిమాణంలో మధ్యస్థంగా ఉంటుంది. డెజర్ట్స్,
రసాలు, షేక్స్ తయారీకి అనువైనది.
ఆరోగ్య ప్రయోజనాలు : విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి, కొలాజెన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. ఇందులోని విటమిన్ ఎ కండ్లు, చర్మ ఆరోగ్యానికి మంచిది. పొటాషియం కూడా ఎక్కువే. ఇది రక్తపోటు అదుపునకు, గుండె ఆరోగ్యానికి మేలుచేస్తుంది. దీన్నే కొన్నిచోట్ల సఫేదా రకంగా కూడా పిలుస్తారు.
ఉత్తరప్రదేశ్‌లోని మలీహాబాద్ దశేరీ పుట్టినిల్లు. ఆ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ దీన్ని సాగుచేస్తారు. మామిడి డెజర్ట్‌లు, రసాలకు దశేరిని విరివిగా వాడతారు. నారలేని కండకు ప్రసిద్ధి చెందిన ఈ పండు ఉవ్విళ్లూరించే సువాసన, తియ్యటి రుచితో ఆకట్టుకుంటుంది. ఓ మోస్తరు మందంతో మృదువుగా, పలుచటి తొక్క కలిగిన దశేరి పసుపు ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు : విటమిన్ సి, ఎ, ఇ, ఐరన్, క్యాల్షియం లాంటి విటమిన్లు, మినరల్స్ కలిగి ఉంటుంది. దీనిలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
ఆంధ్రప్రదేశ్, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో సాగుచేస్తారు. తియ్యగా ఎక్కువ రసంతో మంచి సువాసన కలిగి ఉంటాయి. సాధారణంగా
మే, జూన్ నెలల్లో కోతకు వస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు : వీటిలో విటమిన్ సి పుష్కలం. రోగ నిరోధక శక్తి పెరుగుదలకు, శరీరంలో కొలాజెన్ ఉత్పత్తికి దోహదపడతాయి. అదనంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మేలుచేసే ఎంజైములు ఉంటాయి. సిందూరి పండ్లలో ైగ్లెసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి.