మీ వంటగదిని మరో లెవెల్‌కి తీసుకెళ్లే గ్యాడ్జెట్ వచ్చేసింది! పేరు ఫేబర్ 6ఎల్ 1500 డబ్ల్యూ డిజిటల్ ఎయిర్ ఫ్రయర్. ఇది వంటలో స్టయిల్, స్పీడ్‌తోపాటు ఆరోగ్యాన్ని కూడా జోడించే మాజిక్ మెషిన్! ఈజీ కంట్రోల్స్, అదిరే ఫీచర్స్‌తో ఈ ఫ్రయర్ మీ వంటగదికి పర్ఫెక్ట్ బడ్డీ. తక్కువ నూనెతో ఫ్రైడ్ ఫుడ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కుటుంబాలకు 6 లీటర్ల కెపాసిటీతో ఉన్న ఫ్రయర్ సరిపోతుంది.
బిజీ షెడ్యూల్ ఉన్నవాళ్లకు ప్రీసెట్ మెనూలు, టచ్ కంట్రోల్స్ టైమ్ సేవ్ చేస్తాయి. ఒకేసారి 4-6 మందికి ఆహారాన్ని సిద్ధం చేయొచ్చు. పార్టీలు, గెట్-టుగెదర్స్లో సమయం ఆదా అవుతుంది. కేక్ బేక్ చేయాలన్నా, చికెన్ గ్రిల్ చేయాలన్నా.. ఈ ఫ్రయర్ మీ కిచెన్‌లో స్టార్ షెఫ్లా పనిచేస్తుంది. 8 ప్రీసెట్ మెనూలతో ఒక్క టచ్‌తో మీ ఫేవరెట్ డిష్ రెడీ అయిపోతుంది.
చికెన్ నగ్గెట్స్, కేక్, గ్రిల్డ్ వెజ్జీస్.. ఏదైనా సులభం! 360 డిగ్రీల ర్యాపిడ్ ఎయిర్ సర్కులేషన్ టెక్నాలజీతో 85% తక్కువ నూనెతో ఆహారపదార్థాలను వండి వార్చుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు.. టేస్ట్ ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు! ఎల్ఈడీ డిస్ప్లే, టచ్ ప్యానెల్‌తో ఆప్షన్స్‌ని ఈజీగా సెట్ చేయొచ్చు. టెంపరేచర్, టైమ్ సెట్ చేయడం చాలా సింపుల్. వ్యూ విండోతో ఫుడ్ ఎలా కుక్ అవుతుందో చెక్ చేసుకునే వీలుంది. 1500 వాట్స్ పవర్‌తో ఈ ఫ్రయర్ పనిచేస్తుంది.
ధర: రూ. 6,000
దొరుకు చోటు: అమెజాన్ వెబ్సైట్
ఏదైనా గ్యాడ్జెట్ కొనేముందు.. బ్రాండ్‌ను చూస్తాం. ల్యాప్‌టాప్‌ల విషయానికొస్తే ‘డెల్’లాంటి ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రాధాన్యత ఇస్తాం. ఒకవేళ మీరు ఏదైనా మంచి ల్యాపీ కొనాలని చూస్తున్నట్టయితే.. డెల్ విడుదల చేసిన ‘డెల్ 15 థిన్ అండ్ లైట్’ మోడల్ని ట్రై చేయొచ్చు. ఇది స్టూడెంట్స్‌కి ఆన్లైన్ క్లాసులు, ప్రాజెక్ట్స్‌కు మంచి ఆప్షన్. అంతేకాదు.. ప్రొఫెషనల్స్‌కి ఆఫీస్ వర్క్, ప్రెజెంటేషన్స్కి సూపర్‌గా పనిచేస్తుంది.
అప్పుడప్పుడు సినిమాలు చూసే వాళ్లకు ఫుల్ హెచ్డీ స్క్రీన్ అదిరిపోతుంది. మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే.. గంటలోనే 80 శాతం చార్జ్ అవుతుంది. స్లిమ్ డిజైన్ వల్ల బ్యాగ్‌లో ఈజీగా క్యారీ చేయొచ్చు. విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ రెడీగా ఉండటంతో.. కొనగానే పని మొదలుపెట్టేయొచ్చు. బడ్జెట్లోనే స్టయిల్, స్పీడ్ పెర్ఫార్మెన్స్ కావాలంటే.. ఈ ల్యాపీ పర్ఫెక్ట్! స్పీడ్ గురించి చెప్పాలంటే టాప్‌క్లాస్! ఇందులో 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ స్క్రీన్ ఉంది.
13వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 – 1305యూ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌తో హాయిగా మల్టీటాస్కింగ్ చేయొచ్చు. 512 జీబీ ఎస్ఎస్డీతో యాప్స్, ఫైల్స్ సూపర్ ఫాస్ట్‌గా ఓపెన్ అవుతాయి. ప్లాటినం సిల్వర్ కలర్లో స్లిమ్, లైట్‌వెయిట్‌తో ఈ ల్యాపీని రూపొందించారు. స్టాండర్డ్ కీబోర్డ్‌తో టైపింగ్ కంఫర్టబుల్‌గా చేయొచ్చు.
ధర: రూ. 48,000
దొరుకు చోటు: అమెజాన్, డెల్ అధికారిక వెబ్సైట్
స్మార్ట్‌ఫోన్‌ని దాని పరిధి మించి వాడితే? ఆ కిక్కే వేరప్పా!! అంటారు కదా. అయితే, మీరు షావోమీ 15 అల్ట్రా గురించి తెలుసుకోవాల్సిందే. ఇది కేవలం ఫోన్ మాత్రమే కాదు. మీ జేబులో ఒక మినీ స్టూడియో, గేమింగ్ బీస్ట్తోపాటు స్టయిల్ స్టేట్మెంట్ ఉన్నట్టు! ఫొటోగ్రఫీ లవర్స్‌కి 200 ఎంపీ లైకా కెమెరా ఒక మాయాజాలంగా పనిచేస్తుంది.
గేమర్స్‌కి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, కూలింగ్ సిస్టమ్ సూపర్ థ్రిల్ ఇస్తాయి. ప్రొఫెషనల్స్‌కి వీడియో కాల్స్, ప్రెజెంటేషన్స్, మల్టీ టాస్కింగ్ ఎంతో సులభం. సోషల్ మీడియా లవర్స్‌కి సెల్ఫీలు, రీల్స్ కోసం పర్ఫెక్ట్ ఎంపిక. కెమెరా సెట్అప్ గురించి మాట్లాడితే.. 200 మెగాపిక్సెల్ లైకా క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. తెర పరిమాణం 6.73 అంగుళాలు. క్వాడ్ కర్వ్ డిజైన్ స్క్రీన్‌ని సినిమా థియేటర్లా మారుస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్.. ఫోన్‌ని రాకెట్ స్పీడ్‌తో నడిపిస్తుంది. 16 జీబీ ర్యామ్‌తో యాప్స్ సెకన్లలో ఓపెన్ అవ్వడమే కాదు.. గేమ్స్ స్మూత్‌గా రన్ అవుతాయి. 5410 ఎంఏహెచ్ బ్యాటరీ, 90వాట్స్ హైపర్‌చార్జ్, హైపర్ ఓఎస్2, ఏఐ సపోర్ట్.. లాంటి ఎన్నో ప్రత్యేకతలు ఇన్నాయి.
ధర: రూ. 1,09,998
దొరుకు చోటు: అమెజాన్, షావోమీ అధికారిక వెబ్సైట్
వన్‌ప్లస్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్ బెస్ట్ డీల్స్‌గా అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ మ్యూజిక్, గేమింగ్, కాల్స్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తాయి! పేరు వన్‌ప్లస్ నర్డ్ బడ్స్ 2ఆర్. జిమ్‌లో చెమటలు చిందించేటప్పుడు.. గేమింగ్‌లో లీనమైనా.. జర్నీలో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నా ఈ బడ్స్ మీకు బెస్ట్ కంపానియన్ అని చెప్పొచ్చు. 12.4 ఎంఎం డ్రైవర్స్‌తో క్రిస్ప్, క్లియర్ సౌండ్‌తో పాటలు వినొచ్చు.
ఒక్కసారి చార్జ్ చేస్తే 38 గంటల వరకు నాన్-స్టాప్ మ్యూజిక్ వినొచ్చు. కేస్‌తో కలిపి ఈ లాంగ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. 4-మైక్ డిజైన్‌తో నాయిస్‌లో కూడా క్రిస్టల్ క్లియర్ కాల్స్ మాట్లాడొచ్చు. స్వెట్ రెసిస్టెన్స్‌తో వర్కవుట్స్, వర్షంలో కూడా టెన్షన్ లేదు. లైట్‌వెయిట్ ఉండటంతో జేబులో, బ్యాగ్‌లో ఈజీగా క్యారీ చేయొచ్చు.
ధర: రూ. 1,600
దొరుకు చోటు: అమెజాన్ వెబ్సైట్