ఓ నాలుగురోజులు ఎటైనా వెళ్లాలంటే ముందుగా ఆలోచించాల్సింది పెంపుడు జంతువుల గురించే. వాటికి టైమ్‌కు ఎవరు తిండి పెడతారు? ఆలనాపాలనా ఎవరు చూస్తారు? అనే ప్రశ్నలు వేధిస్తాయి. ఇప్పుడిక ఆ సమస్య లేదు. పిల్లులు, కుక్కల లాంటి పెంపుడు జంతువులకు సకాలంలో ఆహారాన్ని అందించడానికి వచ్చేసింది.. బేబాట్ పెట్ ఫీడర్. బ్యాటరీ సాయంతో పనిచేసే దీనికి ఓ ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఉంటుంది. స్మార్ట్ యాప్ ద్వారా కంట్రోల్ చేయగలిగే ఈ ఫీడర్ తడి, పొడి ఆహారాలను వేర్వేరుగావడ్డిస్తుంది. దీని ఆన్లైన్ ధర రూ. 8,999. వివరాలకు baybot.in చూడవచ్చు.