– వి. ప్రసన్న, పటాన్చెరువు.
సహజంగా అపార్ట్మెంట్లలో కారు పార్కింగ్ ప్లేస్లో స్టాఫ్కు గదులు కట్టి ఇస్తారు. మీది గృహం కాబట్టి, కింద స్థలం సరిపోనప్పుడు ఇంటి స్లాబుమీద కట్టి ఇవ్వడం తప్పుకాదు. అయితే వాళ్లకు కిందనే.. నేలమీదే కట్టి ఇవ్వాలి అనే నియమం లేదు. పైన కట్టినప్పుడు వారి రాకపోకలకు కాస్త ఇబ్బంది ఉంటుంది. దగ్గరలో ఉండరు కదా! అని ఆలోచిస్తారు. మీరు ఇష్టపడితే.. ఇంటి స్లాబుమీద ఆగ్నేయం లేదా వాయవ్యంలో స్టాఫ్కు గదులు కట్టి ఇవ్వండి. అలాగే నైరుతిలో ఏదో ఒక గదిని తప్పకుండా వేసుకొని, మీరు వాడుకోండి చాలు. నైరుతి గది వేయకుండా స్టాఫ్కు గదులు వేయవద్దు.
– కె, మునీశ్వర్, నిజామాబాద్.
మీరు మూల దిక్కులు అంటున్నారు. అంటే అది విదిక్కుల గృహం అవుతుంది. మీరు అలాంటి ఇంట్లో ఉంటున్నారు. అంటే ప్రభావం, ఫలం నూరుశాతం ఉండదు. స్థలం దిశలకు ఉన్నప్పుడే అది శక్తిగృహం అవుతుంది. విదిక్కుల గృహాలు వ్యాపారానికి బాగుంటాయి. గృహానికి అంటే.. కుటుంబానికి యోగించవు. మీరు ఇంటిపైన గదివేసి, దానిలోకి కిందినుంచి మెట్లు వేయవద్దు. దిశలు లేని ఇల్లు కాబట్టి దోషం వస్తుంది.
ఆర్థిక నష్టాలు వస్తాయి. ఈశాన్యం దిశగుండా ద్వారం వచ్చే విధంగా విదిక్కులలో ఈశాన్యం రోడ్డు వచ్చినట్టయితే.. ఆ నిర్మాణం వ్యాపారానికి ఎంతగానో ఉపకరిస్తుంది. లేదా ఆఫీస్కు వాడుకోవచ్చు. బాగుంటుంది. దిశలు నిర్ధారణ చేసుకోకుండా మీరు సాధారణంగా అది ఉత్తరం.. ఇది తూర్పు అనుకొని నిర్ణయాలు తీసుకోవద్దు. అన్నీ జాగ్రత్తగా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. ఇంటికి పనికిరాదు అనుకుంటే.. ఇల్లు మారిపోండి. శుభం కలుగుతుంది.
– డి. సావిత్రి, గచ్చిబౌలి.
స్థిరత్వం అనేది నాలుగు స్తంభాలమీద ఉంటుంది. అది మూలసూత్రం. మూడు కాళ్ల మీద ఉండదా? అంటే.. ఉంటుంది. అది అస్థిరత్వం. దిశలు నేలమీద మండలాకారానికే వర్తిస్తాయి. తుది, మొదలు అనేది కూడా ఉండాలి. ఇది ఈ నేలమీది ఏ నిర్మాణాలకైనా వర్తిస్తుంది. ప్రతిదానికి పరిధి అనేది ప్రధాన అంశం. ఎంత మహోన్నతుడికైనా ఆయుష్షుకు ఒక పరిధి ఉంది. ఎంత పెద్ద సముద్రానికైనా.. ఒడ్డు (చెలియలి కట్ట) ఉంటుంది. నిర్మాణంలో గుండ్రని దానికి దిశ పరిధి ఉండదు. కాబట్టి దిశలు, శక్తులు కూర్చోవు. తద్వారా ఆ నిర్మాణానికి సర్వదిక్కుల అలక్ష్యం, వాటి ప్రభావం, స్వభావం.. దెబ్బతింటుంది. అందుకే.. గుండ్రని ఇల్లు లేదు. గుండ్రని భూమిమీద చతురస్ర గృహమే స్థిరమైనది అని శాస్త్రం ఎన్నో దృష్టిలో పెట్టుకొని నిర్ధారించింది.
పిచ్చి ఉన్న వ్యక్తికి నెత్తిలో కుచ్చుటోపి పెట్టినా.. బంగారు కిరీటం పెట్టినా ఒక్కటే కదా! అతను చూసే విధానంలో మార్పు ఉండదు. మీ గుండ్రని ఆఫీస్కు కాంపౌండ్ కట్టినా, అందమైన ఎలివేషన్ చేసినా.. అంతే! ఇక్కడ నిర్మాణమే ప్రధానం. విలువ ఉండదు. కాబట్టి వాటిలో ఫలితాలు పరిమితం. తప్పకుండా కాలం మీకు ఒక పరిష్కారం చెబుతుంది. అప్పుడు ఎలాగూ అందులోంచి వెళ్లక తప్పదు. కానీ, శాస్త్రం మాత్రం అలాంటి కట్టడాలు అభివృద్ధిని అందించవు అనే చెబుతున్నాయి. కొన్నిచోట్ల చుట్టిల్లు వేసుకుంటారు. కానీ, అవికూడా కరెక్ట్ కాదు.
– వై. పార్థసారథి, జూబ్లీహిల్స్.
చాలామందికి ఒక అలవాటు, భావన ఉంటుంది. ఒక చెడుకు.. ఒక మంచి విరుగుడు అని. అది వ్యక్తుల లాజిక్ మాత్రమే. దానిని శాస్త్రం ఒప్పుకోదు. స్వీట్ తిని.. షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవడం లాంటిది. సగం మంచినీళ్లలో సగం మురికి నీళ్లు కలపడం లాంటిది. చెడు.. చెడే! దాని విలువ అనుభవించాలి. అలాగే, మంచి విలువనూ అనుభవించగలం. ప్రకృతి దేని ప్రభావాన్ని దానికి అందిస్తుంది. దక్షిణ – నైరుతి గేటు కాలనాగు కాటు అంటారు. దానిని బ్యాలెన్స్ చేయడానికే దక్షిణం – ఆగ్నేయం గేటు ఉందికదా! అంటారు.
ఇదంతా అర్థంపర్థం లేని శుష్కవాదం. ఇలాంటివాళ్లు అంతటా తగులుతుంటారు. వారి మాటలను పట్టించుకోవద్దు. మీకు రెండు గేట్లు దక్షిణం వైపు కావాలి అంటే.. దక్షిణం మధ్యలో ఒకటి, దక్షిణం – ఆగ్నేయంలో మరొకటి పెట్టుకొని వాడుకోండి. దానికి అనుగుణంగా మీ అపార్ట్మెంటులో డ్రైవింగ్ దారిని అడ్జెస్ట్ చేసుకోండి. అంతేకానీ, మీకు అనుకూలం కోసం తప్పుడు గేట్లు పెట్టుకోవద్దు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143