– పి. వసుంధర, పెంబర్తి.
భగవంతుడి ఆలయాలను సందర్శించడం మంచిదే! తద్వారా మనిషికి బుద్ధి శుద్ధి పడుతుంది. పాపప్రక్షాళన జరుగుతుంది. అది కర్మలకు సంబంధించిన అంశం. వ్యక్తి.. భూమి మీదికి ఒక్కడే రాడు. తాన ప్రారబ్ధాన్నీ వెంట పెట్టుకొని వస్తాడు. అంటే, పుట్టుకతోనే కొన్ని స్వభావాలతో జన్మిస్తాడు. ఆ స్వభావాలను బట్టి అతని నిర్ణయాలు ఉంటాయి. ఆ కోవలో నచ్చిన ఇంటిని కొని, అందులో నివాసం చేస్తాడు. కానీ, ఆ గృహం.. ఆ స్థలం అతనికి యోగ్యమైనదేనా? అనేది ఆలోచించడు.
ఇష్టపడే ప్రతి ఆహారం.. ఆ వ్యక్తికి పడుతుందని ఎలా అనుకుంటాం. అది పరీక్షించి, డాక్టర్ నిర్ధారణ చేస్తాడు. అలాకాకుండా వండిన ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెట్టి, ఆ తరువాత తింటే.. అది పడుతుంది అనుకుంటే ఎట్లా? షుగర్ రోగికి స్వీట్ పెట్టినట్లు అవుతుంది. ఇంట్లో దోషాలు సవరిస్తేనే వాటి దోషం పోతుంది. మీరు ఈ ప్రశ్న అడిగారు అంటేనే.. మీ నిర్ణయంలో సందేహం ఉన్నట్టే కదా! దైవ దర్శనాలు చేయండి. గృహాన్ని చక్కదిద్దుకోండి. మన ప్రయత్నం మనం చేస్తూనే.. దైవ సహకారాన్ని కోరాలి. కానీ, అన్నిటికీ దైవంమీద పడవేయడం తప్పించుకోవడం అవుతుంది.
– బి. ప్రభావతి, మోత్కూర్.
ఇంటికి కాంపౌండ్లు ఇష్టం వచ్చిన ఎత్తుతో కట్టడం సరైనది కాదు. అవసరమైన ఎత్తులోనే కట్టాలి. ఇంటికి దక్షిణంలో రెండు అడుగుల స్థలం కూడా విడవకుండా కేవలం కాంపౌండ్ ఎత్తు కడితే.. ఇంట్లో గాలి – వెలుతురు (వెంటిలేషన్) ఏమాత్రం లేకుండా పోతుంది.
ఇంటి దక్షిణం – పడమరల వైపు ఉండే కిటికీలను దాటి, కాంపౌండ్లను పైకి కట్టవద్దు. ప్రహరీలు మరీ ఎక్కువ ఎత్తు కట్టాలి అనుకున్నప్పుడు ఇంటి చుట్టూ కాంపౌండు ఎత్తుకన్నా ఎక్కువ స్థలం ఆయా దిశల్లో వదలాల్సి ఉంటుంది. కేవలం కాంపౌండ్ల ఎత్తు పెంచడం వల్లకాదు.. అన్నీ సరిగ్గా వాస్తు చెప్పినట్టు ఇల్లు కడితే.. అది చిన్నదైనా, పెద్దదైనా బాగుంటుంది. బాగు పరుస్తుంది.
– వి. భరత్, జీడిమెట్ల.
బాత్రూమ్ ఎత్తు ప్రధానం కాదు. అసలు మీ ఇంటి మాస్టర్ బెడ్రూమ్ నుంచి.. పశ్చిమ – నైరుతిలో ఉన్న మెట్లకింది స్థలాన్ని గదిలోకి కలపడం పెద్ద దోషం. అసలు ఏ గదికీ ఇంటి ఆవరణలోని స్థలాన్ని కలపకూడదు. ఇంటి చుట్టూ ఖాళీ వదలడంలో ఉద్దేశం ఏమిటి? ఇంటికి ధారాళంగా వెంటిలేషన్ రావాలనే కదా! ఇంటి చుట్టూ ప్రదక్షిణం ఉండాలని కదా! మరి మీరు నైరుతిని బెడ్రూమ్లోకి కలపడం వల్ల ఇంటి నైరుతి పెరుగుతుంది. అది చాలా తీవ్రమైన అనారోగ్యాలకు కారణం అవుతుంది. వెంటనే ఆ టాయిలెట్‌ను తొలగించివేయండి. మీ పడక గదిలోనే ఆగ్నేయంలో కానీ, వాయవ్యంలో కానీ అటాచ్డ్ టాయిలెట్ కట్టుకోండి. స్థలం చాలదు.. అనుకుంటే, బయట టాయిలెట్ కట్టుకొని వాడుకోండి. లేదా ఇంటిలో స్థలాన్ని బట్టి గదులను సవరించి, కొత్తగా శాస్త్రబద్ధంగా కట్టుకోండి. సొంతవైద్యం మంచిదికాదు.
– కె. విద్యాధర్, కొత్తగూడెం.
సహజంగా ఇలాంటి నిర్మాణాలకు విద్యాలయాలు, గురుకులాలు చాలా అనుకూలంగా ఉండటం విశేషం. అయితే, రెండు దిక్కులను ఆక్రమించి, రెండు దిక్కులను వదిలి కట్టే విధానం.. ఈ ‘ఎల్ – ఆకారం’ నిర్మాణం. నిజానికి దానిని శాస్త్ర పరిభాషలో ‘ద్విశాల నిర్మాణం’ అంటారు. వీటిలో ప్రమాదకరమైనది తూర్పు – ఉత్తరం దిశలల్లో నిర్మాణం చేసి, పడమర – దక్షిణం దిశలను వదిలి కట్టడం.
దీనివల్ల కేవలం ప్రగతిదాయకమైన తూర్పు – ఉత్తరాలు మూతబడి పోతాయి. దక్షిణ – పశ్చిమాలు స్వేచ్ఛగా ఉండి.. విపరీత – వికృత ఫలాలు అందే అవకాశం ఉంటుంది. ఈ ద్విశాల నిర్మాణం శ్రేష్ఠమైనది. ఆచరించాల్సినది. దక్షిణం – పడమర దిశల్లో నిర్మాణం చేసిన పాఠశాల ఎంతో ఆహ్లాద వాతావరణాన్ని కలిగి, అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఈ నిర్మాణం సూర్యునికి అభిముఖంగా ఉండి, నిరంతరం ఉత్తేజితం అవుతుంది. ఇది ప్రకృతి దిశలలో దాగిన ఉల్లాసపూరిత చైతన్యం. దానికి అనుకూలంగా నిర్మాణం ఉంటేనే.. ఆ చోట పిల్లలు నిత్య ప్రజ్ఞావంతులుగా వర్ధిల్లుతారు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143