– ఇ. శ్రీనివాస్, ఖమ్మం.
Vaasthu Shastra | టెక్నికల్‌గా మీరు చెప్పేది నిజం. రోజులో ఎండ 12 గంటల్లో అధికంగా దక్షిణం దిశలోనే ఉంటుంది. కాబట్టి, సోలార్ పవర్ ఉత్పత్తి కావాలి అంటే.. ఆ విధానం తప్పనిసరి అవసరం. మీరు అన్నట్టు.. అది దక్షిణం వాలు అవుతుంది అనేది కూడా శాస్త్ర సమ్మతమే! అయితే, ఇంటిమీద టెర్రస్‌లో నైరుతి భాగాన కేవలం స్లాబ్‌మీద వేస్తే.. ఆ ప్యానెల్స్ మూడు అడుగుల ఎత్తులో వేస్తారు. అది దోషం కాదు. ఎత్తుగా ఉండవు కాబట్టి. మీరు నైరుతి అని కాకుండా ఇంటి టెర్రస్ మీద.. ముందుగా రేకులతో ఒక కప్పును దక్షిణం అలాగే ఉత్తరం వాలు వచ్చేలా వేయండి. అది పిరమిడ్ షేపులోనే.. నాలుగు వైపులా కాకుండా, రెండు దిక్కులకే వాలు ఉంచి వేయండి. దానిమీద దక్షిణంలో సోలార్ ప్యానెల్స్ వేయండి. అప్పుడు కప్పు రెండు వైపులా వాలుగా ఉంటుంది కాబట్టి దోషం ఉండదు. సోలార్ ప్యానెల్స్ కూడా దక్షిణం వాలుతోనే ఉంటాయి.
– ఎం. రవికుమార్, కొంపెల్లి.
అలా అంటే.. దేశంలో సగం ఇండ్లు పనికిరానివే అవుతాయి. పనికిరాని ఆహారం ఉండదు. పనికిరాని దిశ ఉండదు. ప్రకృతిలో ఇష్టం వేరు.. అది వ్యక్తిగతం. అలాగే, అయిష్టం కూడా అంతే! ప్రకృతిలో దిశలన్నిటికీ అద్భుత శక్తులు ఉన్నాయి. దక్షిణం సలక్షణం. అది గొప్పగా యోగిస్తుంది. వండే విధంగా వండితే.. కాకరకాయ దివ్య ఔషధం. వంట రాకపోతే.. పప్పు కూడా బాగుండదు. అలాగని పప్పుది దోషం అవుతుందా? దక్షిణం దిశను శాస్ర్తానికి గొప్పగా కట్టుకోవచ్చు. అలా ఎందరో మహావ్యక్తులు – వ్యాపారవేత్తలు దక్షిణ సింహద్వారం నుంచి వచ్చినవారు ఉన్నారు.. మనమధ్య. ఏ కందులూ మూటగట్టడం అవసరం లేదు. దక్షిణం అంటే.. ఒక అపదృష్టి ఉంది లోకంలో. అది తప్పుడు భావన. అందరూ గొప్పగా అనుకునే తూర్పు ఇండ్లు కూడా ఎన్నో భయంకరంగా ఉన్నాయి. కట్టడంలో లోపం ఉండొచ్చు. దిశల్లో ఉండదు.
– పి. యాదగిరి, భువనగిరి.
డాక్టర్ పట్టా ఉంటే చాలు.. అతనికి ఏ రోగం రాదు! అన్నట్టుంది మీ మాట. ప్రతి స్థలం మంచిదిగా ఉండాలి. ఆ స్థలంలో మంచి వాస్తు గృహం కట్టాలి. అప్పుడే ఆ కుటుంబం ఆయురారోగ్యాలతో చక్కగా ఉంటుంది. దక్షిణం – పడమర కన్నా.. ఈశాన్యం స్థలం ఎంతో గొప్పది అనుకోవద్దు. దేని రోగాలు దానికి ఉంటాయి. అన్నిటికీ తగిన జాగ్రత్తలు తీసుకొనే.. ఇండ్ల నిర్మాణం చేయాలి. స్థలం గొప్పగా ఉన్నప్పుడే కదా.. అక్కడ నిర్మాణానికి పూనుకుంటాం. స్థలంలో లోపం లేకపోయినా.. ఇంటి లోపం, ఇంటి సభ్యులమీద ఉంటుంది కదా! రోడ్డు బాగుంటే ఎట్లా.. కారుకూడా బాగుండాలి కదా! అప్పుడే ప్రయాణం ఆనందంగా సాగుతుంది. కాబట్టి, స్థలంతోపాటుగా ఇల్లు కూడా బాగా కట్టుకోవాలి.
– వి. ఆశాలత, జీడిమెట్ల.
ఇల్లు కట్టడం సర్వసాధారణం. కానీ, మన ఇష్టాలతోనే కష్టాలన్నీ వచ్చేది. కింద మొత్తం వదిలి, పైన.. ఆపైన మంచి డూప్లెక్స్ కట్టడం మీకు ఇష్టంలేదు. పైగా పార్కింగ్ ఇంటికిందే రావాలి అంటున్నారు. ఇదే పెద్ద టాస్క్. తూర్పులో ఎక్కువ స్థలం వదిలి, పార్కింగ్ బయటపెట్టడం చాలా గొప్ప పద్ధతి. అప్పుడు ఇల్లు దానికది గొప్పగా నిలబడుతుంది. పార్కింగ్ ఇంటికింద అంటే.. వాయవ్యంలో స్థలం వదలాలి. అక్కడ పార్కింగ్ పెట్టొచ్చు. లేదా తూర్పు – ఆగ్నేయంలో కొంతభాగం.. అంటే, కిచెన్ ఆగ్నేయంలో వచ్చేలా కొంత లోపలికి, కొంత బయటికి స్థలం విభజన చేసి, పార్కింగ్ ఏర్పాటుచేసుకోవచ్చు. లేదా ఇంటి చుట్టూ ఎక్కువ స్థలం వదిలి.. అంటే, డ్రైవ్ ఏరియా వచ్చేలా చేసుకొని, పడమరలో ఇంటికి సెంటర్లో పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటే.. ఏ సమస్యా రాదు. అంతే కానీ, తూర్పు – ఉత్తరం – ఈశాన్యాలు కట్‌చేసి, ఇంటి కింద పార్కింగ్ పనికిరాదు. అలాంటివి గృహాలు కాదు. యమ స్థావరాలు అనేది మరువకూడదు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143