– ఎం. కృష్ణ ప్రసాద్, ఆలేరు.
కొన్న ఇంటిని.. పెద్దగా చేసుకొని ఉండాలంటే, పైకి ఎన్ని అంతస్తులైనా పెంచుకోవచ్చు. చుట్టుపక్కలకు ఇల్లు పెంచడానికి టెక్నికల్‌గా దాని లోడ్ పిల్లర్లు, బీముల నిర్మాణం, వాటి పటిష్ఠత తదితర విషయాలను చూసుకోవాలి. అవన్నీ బాగున్నాయి అనుకుంటే.. అప్పుడు పని మొదలుపెట్టాలి. ఇంటి వైశాల్యం పెద్దగా ఉండాలి అనుకుంటే.. తూర్పు – ఉత్తరాలకు ఇల్లు పెంచడం నిషేధం. కింద పెంచకుండా పైన పెంచవద్దు. మన కుటుంబ పెద్దల ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పడమర – దక్షిణం ఎంత ఖాళీ స్థలం ఉందో చూసుకొని, దక్షిణం లేదా పడమర ఎటు పెద్దగా ఉంటే అటువైపు ఇల్లు పైన పెంచుకోవచ్చు. అయితే, రెండు దిక్కులకు అంటే.. అటు దక్షిణం, ఇటు పడమర వైపు ఇల్లు పెంచవద్దు. తద్వారా ఇంటి నైరుతిలో దోషం వస్తుంది. అదికూడా యజమానికే నష్టం తెస్తుంది. ఇంటి భద్రతకు భగం వాటిల్లకుండా అవసరమైన పిల్లర్లు, బీములు పెంచి, స్లాబులు వేసి ఇల్లు పెంచండి. ఏం చేసినా.. నిపుణుల సలహా తీసుకోండి. శుభం!
– ఎం. సునీత, కొలనుపాక.
అది కత్తెర ఆకారంలో మీ స్థలానికి వీధిపోటు పడుతూ.. తూర్పు – పడమర వీధులతో ఉంది. నిజానికి అది గొప్ప స్థలం కాదు. రెండు రోడ్లు ఉన్నాయని భ్రమపడకండి. త్రిభుజాకారంలో ఉన్న ఆ స్థలానికి దక్షిణం నుంచి వీధిపోటు పడుతూ ఉంటుంది. ఆ వీధిపోటు ఉన్న స్థలంలో ఇల్లు కట్టడం మంచిదికాదు. కత్తెర వీధి అంటేనే.. రెండు కత్తుల మధ్య ఇరికించినట్టుగా ఉండే స్థలం. అందులో ఎలాంటి సొంత నిర్మాణాలు చేయవద్దు. అది పార్కుగా పనికి వస్తుంది. దానిని కమర్షియల్‌గా ఉపయోగించాలి అంటే.. దక్షిణం భాగం కట్‌చేసి, అక్కడ ఒక నిర్మాణం చేయాలి. అంటే.. గుడి లేదా బస్‌స్టాప్ కట్టి, మిగతా స్థలాన్ని కోణాలు లేకుండా సవరించాలి. అందులో షాపులు వేసుకొని, అద్దెలకు ఇవ్వొచ్చు. అంతేకానీ, ఇల్లు కట్టడానికి ఆ స్థలం ఏమాత్రం పనికిరాదు. మీరు ఏది కట్టాలన్నా.. అన్నీ సరిగ్గా చూసుకొని నిర్ణయం తీసుకోండి.
– ఎం శ్రీలత, వాడపల్లి.
వ్యక్తులు – వారి ఆలోచనలను.. మనం నివసించే ప్రాంతాలు, పరిసరాలు, చుట్టు పక్కల వ్యక్తులు, వారివారి జీవన విధానాలు అన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. వ్యక్తి ప్రకృతికి ఎప్పుడూ చంటిబిడ్డనే! అంతేకాదు.. దాని శాసనాలకు బానిస. అందుకే, ఆనందం కోసం, శాంతి కోసం సుందర ప్రదేశాలను వెతుక్కుంటూ ఉంటాడు ఎప్పుడూ! ఆ రకంగా జీవన విలువలను మార్చుకుంటాడు. అందుకే, ఒక ప్రాంతానికి – మరొక ప్రాంతానికి వ్యక్తుల స్వభావాలలో మార్పులు కనిపిస్తాయి. ప్రకృతి శాసిస్తుంది అంటే.. వాస్తు శాసించినట్టే కదా! మనుషులు తమ అలవాట్లను ప్రాంతాలవారీగా కలిగి ఉంటారు. అవి వ్యసనాలుగా మారుతాయి. అంతేకాదు.. ప్రాంతం – నివాసం మారితే, తప్పకుండా వ్యక్తిత్వంలో కూడా మార్పులు వస్తాయి. అందుకనే కదా ‘సహవాస దోషం’ అంటారు. నైరుతి దోషాలు ఉన్న ఇండ్లలో యజమానులు మొండిగా ఉండేందుకు కారణం అందుకే!
– సీహెచ్ విమల, చెన్నూర్.
మీ గృహం వాయవ్యం బ్లాకులో ఉంది. స్త్రీలమీద, పిల్లల మీద ప్రభావం ఉంటుంది. ఇల్లు – స్థలం దిశలకు ఉన్నట్టు అయితే.. అది మంచి ఇల్లే అవుతుంది. ఇక్కడ ఉత్తరం రోడ్డు డెడ్‌ఎండ్ అంటున్నారు. కాబట్టి పడమర వీధిని ప్రధానంగా చేసుకొని వాడండి. ‘ఉత్తరం రోడ్డు ఉంది కదా! అటు ఎందుకు వాడవద్దు!’ అనిపించవచ్చు. దానికి తూర్పు నడక ఆగిపోయింది.
తద్వారా అది పడమర కన్నా తక్కువ శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి అటు గేటు పెట్టండి. కానీ, పశ్చిమ సింహద్వారంగా ఇల్లు మంచి ఫలితాలు ఇస్తుంది. అటునుంచే రాకపోకలు చేయండి. ఇంటికి పడమర – వాయవ్యంలో ప్రధాన ద్వారం, పశ్చిమ – వాయవ్యంలో గేటు తప్పనిసరిగా ఉండాలి. అలాగే.. తూర్పు ద్వారం, ఉత్తరం ద్వారం, ఉత్తరం గేటు కూడా పెట్టుకోవాలి. ఇంకా ఇంట్లో లోపాలు ఏవైనా ఉంటే సవరించుకొని ఉండండి. చాలు!
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143