Indian Army Dog Squad | జవాన్లతో పాటుగా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న నాలుగు కాళ్ల సైనికుల గురించి ఈ విషయాలు తెలుసుకోండి
Indian Army Dog Squad | బుల్లెట్ల వర్షం కురుస్తున్నా వైరి వర్గాలను తుదముట్టించేతెగువ.. ఇండియన్ ఆర్మీ డాగ్ ఫోర్స్ సొంతం. ‘యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్'లో రక్తం ధారలుగా పారుతున్నా.. ప్రాణాలొడ్డి మరీ తీవ్రవాదుల భరతంపట్టిన వీర శునకాలు మన సైన్యంలో కోకొల్లలు.
Indian Army Dog Squad | శత్రుమూకలు చుట్టుముట్టినా చెక్కుచెదరని ధైర్యం, బుల్లెట్ల వర్షం కురుస్తున్నా వైరి వర్గాలను తుదముట్టించేతెగువ.. ఇండియన్ ఆర్మీ డాగ్ ఫోర్స్ సొంతం. ‘యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్’లో రక్తం ధారలుగా పారుతున్నా.. ప్రాణాలొడ్డి మరీ తీవ్రవాదుల భరతంపట్టిన వీర శునకాలు మన సైన్యంలో కోకొల్లలు. ప్రతి జాగిలం ఓ సుశిక్షిత సైనికుడితో సమానం. శాంతిభద్రతలను పరిరక్షిస్తాయి, ఉగ్రవాదులను మట్టుపెడతాయి. మన జవాన్లతో పాటుగా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఆ నాలుగు కాళ్ల సైనికులపై ప్రత్యేక కథనం.

జూలై 30, 2022..
జమ్మూకశ్మీర్, బారాముల్లా జిల్లా.
క్రీరి ప్రాంతంలోని వనిగంబాలలో కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తున్న సైనికులకు ఓ ఇంట్లో జైషే ఉగ్రవాదులు మకాం వేసినట్టు సమాచారం అందింది. వెంటనే పటాలమంతా రంగంలోకి దిగింది. లక్ష్యానికి కేవలం పదిమీటర్ల దూరంలో మసీదు ఉంది. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా.. మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటి సమయంలో పరిష్కారం ఒక్కటే. ఎప్పటిలాగే,
‘ఆక్సెల్’ (జర్మన్ షెపర్డ్) అనే నాలుగు కాళ్ల సైనికుడిని రంగంలోకి దింపారు.

చుట్టూ ఉన్న నాలుగైదు ఇండ్లలో ఉగ్రవాదులు ఎక్కడ తలదాచుకున్నారో తెలియని పరిస్థితుల్లో.. ‘ఆక్సెల్’ వాసన పసిగడుతూ.. నేరుగా ఉగ్రవాదులున్న ఇంట్లోకే వెళ్లింది. సింహంలా ఉగ్రమూకపై దూకింది. ఏం జరుగుతున్నదో తెలుసుకునేలోపే.. ఆక్సెల్ వెనుకనే వెళ్లిన ఆర్మీ కాల్పులు జరిపింది. ఇటు మసీదుకు, అటు స్థానికులకు ఎలాంటి నష్టం జరగకుండా పని పూర్తిచేసింది. ఈ పోరాటంలో ఆక్సెల్ అసువులు బాసింది. ఆ తర్వాతి రోజు అత్యున్నత త్యాగం చేసిన డాగ్ సోల్జర్ హోదాలో అంత్యక్రియలు అందుకుంది. దేశసేవకే అంకితమైన ఇలాంటి ‘ఫోర్స్ మల్టిప్లయర్స్’కు శిక్షణ అందిస్తున్నది.. ‘నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్’ (ఎన్టీసీడీ).

ఏటా 300 వరకూ
హర్యానా రాష్ట్రం పంచకుల సమీపంలోని భానూ ప్రాంతంలోని నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అంతర్జాతీయంగా అగ్రశ్రేణి జాగిలాల శిక్షణ కేంద్రంగా ఎన్టీసీడీకి పేరుంది. ఇక్కడ ఏటా 100 నుంచి 300 శునకాలకు శిక్షణ ఇస్తారు. అంతర్గత, సీమాంతర ఉగ్రవాదంపై పోరుకు వీటిని ఉపయోగిస్తారు. వివిధ రాష్ట్రాలు కూడా ఈ బలగాల సహాయం తీసుకుంటాయి.

ఇక్కడ మొత్తం 180 సుశిక్షిత జాగిలాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన ట్రైనర్స్ వీటికి సరికొత్త పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంటారు. పేలుడు పదార్థాల గుర్తింపు, దాడి, పహరా, నేరస్తుల వేట.. తదితర పోలీసింగ్ నైపుణ్యాలు ఈ జాగిలాలకు కొట్టినపిండి. ఈ కేంద్రాన్ని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ నిర్వహిస్తున్నది. 2005 నుంచి ఇప్పటివరకు 3,600 డాగ్ సోల్జర్స్‌ను దేశానికి అందించిందీ సంస్థ. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి ఇక్కడి సుశిక్షిత జాగిలాలు.

ఐదో నెల నుంచే
ఎన్టీసీడీ కోసం సుమారు ఐదు నెలల వయసు ఉన్న జాతి శునకాలనే ఎంచుకుంటారు. బెల్జియన్ షెపర్డ్, జర్మన్ షెపర్డ్ జాతులకు ప్రాధాన్యం. ఇక్కడ శిక్షణ పొందిన జాగిలాలను బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, కంబోడియా, దక్షిణాఫ్రికా తదితర దేశాలు కండ్లకు అద్దుకుని మరీ తీసుకుంటాయి. గత ఏడాది ఏప్రిల్‌లో సియాచిన్‌లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది.

16,500 అడుగుల ఎత్తు మీద.. విపరీతమైన చలిలో.. ఆక్సిజన్ కూడా అందని పరిస్థితుల్లో 25 అడుగుల లోతులో కూరుకుపోయిన తొమ్మిది మంది సైనికులను గుర్తించింది ‘దర్మి’ అనే డాగ్ సోల్జర్. హీనా అనే మరో డాగ్ సోల్జర్ ఓ చొరబాటుదారుణ్ని మట్టుబెట్టింది. బ్లాక్ లాబ్రడార్ అనే శునకం గ్రెనేడ్లను కనుగొని మన సైనికుల ప్రాణాలు కాపాడింది. ఇలా ఎన్నో డాగ్ సోల్జర్స్ దేశ సేవకు అంకితమయ్యాయి.

Read More :
“Dog’s Food | మనుషులు తినే ఆహారం శునకాలకు మంచిదేనా?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Dog Squad
- dogs
- Indian Army
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

