Health Tips | మంచి ఆరోగ్యానికి.. కొన్ని అడుగులైనా సరే !
రోజు ఎంత ఎక్కువగా నడిస్తే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అయితే నడకకు గరిష్ఠ పరిమితి ఏదైనా ఉందా అంటే మాత్రం దాన్ని ఇప్పటివరకు నిర్ధారించలేదు. కాకపోతే రోజుకు కనీసం 2,500 అడుగులు వేసినా సరే గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులతో మరణించే ముప్పు 16 శాతం వరకు తగ్గుతుందట.
Health Tips | రోజు ఎంత ఎక్కువగా నడిస్తే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అయితే నడకకు గరిష్ఠ పరిమితి ఏదైనా ఉందా అంటే మాత్రం దాన్ని ఇప్పటివరకు నిర్ధారించలేదు. కాకపోతే రోజుకు కనీసం 2,500 అడుగులు వేసినా సరే గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులతో మరణించే ముప్పు 16 శాతం వరకు తగ్గుతుందట. ఇంకోమాట ఏంటంటే జీవనశైలిలో ఓ మోస్తరు మార్పులు కూడా మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయట. ఈ అధ్యయనం పోలాండ్ అమెరికా పరిశోధకుల బృందం నిర్వహించింది. కనీసం 2,500 అడుగులైనా నడవండి మర్చిపోకండి!
ఈ ఆహారంతో రొమ్ము క్యాన్సర్ దూరం
కొన్ని ప్రత్యేకమైన మొక్కల నుంచి లభించే ఆహారం రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గిస్తుందని జేఎన్సీఎల్ క్యాన్సర్ స్పెక్ట్రం జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఒకటి వెల్లడించింది. సోయాబీన్స్, కొన్ని ప్రత్యేకమైన గింజలు, నట్స్, కాయధాన్యాలు, ముతక ధాన్యాలు, పండ్లు, కూరగాయల్లో దొరికే లిగ్నాన్స్, క్యాబేజి, కాలిఫ్లవర్ లాంటి కూరగాయలు, గ్రీన్ టీల్లో ఉండే పోషకాలు క్యాన్సర్, ఇతర కారణాల వల్ల తలెత్తే మరణాల ముప్పుపై ప్రభావం గురించి పరిశోధకులు వివిధ అధ్యయనాలను పరిశీలించారు. వీటి ఆధారంగా కొన్ని మొక్కల నుంచి వచ్చే ఆహారం తీసుకునే వారిలో రొమ్ము క్యాన్సర్ ముప్పు 26 శాతం నుంచి 44 శాతం వరకు తక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
పిల్లలపై హింస వద్దు
బాల్యంలో శారీరక, లైంగిక, మానసిక హింసకు, నిర్లక్ష్యానికి గురైన పిల్లలు పెద్దయ్యాక దీర్ఘకాలిక వేదన అనుభవించే ముప్పు ఎక్కువని ఓ పరిశోధన వెల్లడించింది. ప్రతి ఏడాది దాదాపు వంద కోట్ల చిన్నారులు ఏదో ఒక హింసకు గురవుతున్నారట. ఇది మొత్తం పిల్లల జనాభాలో సగం. కాబట్టి ఈ విషయ వలయాన్ని బద్దలు కొట్టడానికి, పిల్లలకు అండగా నిలవడానికి తగిన చొరవ అవసరమవుతుందని ఈ అధ్యయనం సూచించింది. పిల్లలు, టీనేజర్లు ప్రత్యక్ష హింసకు గురైనా, లేదంటే గృహ హింసను చూడటం లాంటి పరోక్ష సంఘటనలైనా వారి మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. కెనడాకు చెందిన మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
ఎక్కువసేపు నిల్చోవడమూ మంచిది కాదు
ఇప్పటి ఉద్యోగాలు చాలావరకు కూర్చుని చేసేవే. అయితే, ఎక్కువకాలం కూర్చోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండెజబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు ఉంటుందని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. మెడ, వెన్నునొప్పులు కూడా వస్తాయి. ఇక ఒకే దగ్గర ఎక్కువసేపు నిల్చునే ఉండటం కూడా అంతే ప్రమాదకరం అంటున్నారు పరిశోధకులు. దీనివల్ల కండరాలు పట్టేయడం, కాళ్లవాపు, నరాలు ఉబ్బడం, తుంటి, మోకాళ్లు, పాదాలు, మడమల నొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఎక్కువసేపు కూర్చోవద్దు అంటే నిల్చోవడం కూడా మంచిది కాదు. ప్రతి అరగంటకోసారి సీట్లోంచి లేచి కాసేపు అలా నడవాలి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

